గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేసి మీకోసం సార్ పంపించారని విషయం చెప్పాడు డ్రైవర్.
నా కోసం కార్ ఎవరు పంపారు అని ఆలోచిస్తూనే.. ఎవరు పంపిన అవసరం లేదు అని వెళ్ళిపొమ్మని చెప్పింది అతనికి.
ఇది నా డ్యూటీ మేడం, మిమ్మల్ని తీసుకు వెళ్లకపోతే సార్ సీరియస్ అవుతారు.
నా జాబ్ పోతుంది మేడం అని రిక్వెస్ట్ చేస్తున్నాడు వాడు.
గేటు దగ్గర నిలబడి మాట్లాడుతుంటే ఎవరు అంటూ బయటికి వచ్చారు ఓనర్ ఆంటీ.