New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 1

కలియుగ మ(మా)యసభ – 1

పచ్చటి పందిరి… చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.

ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. “అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది.” అని తొందరపెట్టింది.
“శైలు చెల్లిని అంట తీసుకురమ్మ..” అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ.
“సరే పిన్ని.” అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు.
“ఏ అమ్మాయి నువ్వు ఆగు..’ అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..’ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత వయసు వచ్చింది పైగా.” అని అరిచింది ఆ పెద్దావిడ.
“నేనేం చేశాను అత్తయ్య..!” అని అంది కంగారుగా ఆ మధ్య వయసు గల స్త్రీ.
“ఏం చేసావా….! శుభమా అని తల్లి కాబోతున్న నీ కూతురికి శ్రీమంతం చేయబోతుంటే తీసుకురావడానికి ఇంకా ఎవరు దొరకలేదా ఈ గొడ్డు మోతుది తప్పించి.” అని అంది ఆ పెద్దావిడ కోపంగా.
అప్పటివరకు ఆ పెద్దవిడ ఎందుకు అంతగా తన వైపు కోపంగా చూస్తుందో అర్థం కాక భయంగా చూసిన శైలు,ఆవిడ తనని గొడ్డు మోతు అనేసరికి వరదల వచ్చాయి తన కళ్ళల్లో కన్నీళ్లు.
అప్పటివరకు చుట్టుపక్కల వాళ్ళు గుసగుసగా అనుకున్న మాటని అత్తయ్య గారు శైలు ముందే అనేసరికి కంగారుగా శైలు చేయి పట్టుకొని ఏడవొద్దు అన్నట్టుగా శైలుకి కళ్ళతో చెప్పి…”అవేం మాటలు అత్తయ్య శైలు గోడ్డు మోతుది ఎలా అవుతుంది..!! ఎందుకు అవుతుంది..? ఆడది తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే అమ్మతనం పుణికిపుచ్చుకుంటుంది.
 ఆడది అంటేనే అమ్మ.. అలాంటిది తనని అంత మాట అనకండి అత్తయ్య.” అని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది ఆ మధ్య వయసుగల స్త్రీ.
ఆ మధ్య వయసు గల స్త్రీ వైపు చూస్తూ.. “కస్తూరి ఈ ఉపన్యాసాలు నువ్వు స్టేజ్ ఎక్కాక అక్కడ చెప్పుకో ఇక్కడ చెప్పకు.
 పెళ్లయి 11 సంవత్సరాలు అయింది శైలుకి ఇప్పటివరకు తన కడుపున కాయ కాసిందా.. నేను కూడా చాలా గొప్పగా చెప్తాను ఆడది అంటే అమ్మ,అమ్మ అంటే ఆడది అని.. కానీ..! అవి అన్ని నిజాలు అయిపోవుగా. 
నీకు తనమీద ప్రేమ ఉంటే మీ గదిలో చూపించుకో అంతేగాని నా మనవరాలికి శ్రీమంతం చేస్తుంటే తనని ఇక్కడ ఉంచి దీని చెడు చూపు నా మనవరాలి మీద పడేలా చేయకు.
 కొంచెం నా మనవరాలికి దూరంగా ఉంచు నీ అక్క కూతురు అయిన ఈ శైలుని.” అని కోపంగా అరిచి చెప్పి తనే స్వయంగా తీసుకురావడానికి శ్రీమంతం చేయడానికి ముస్తాబైన మనవరాలి గదిలోకి వెళ్ళింది ఆ పెద్దావిడ.
శైలు తల కిందకి దించుకొని ఏడుపుని చాలా ఆపడానికి ప్రయత్నిస్తుంది.. కానీ అప్పటికే నేల తడి అయ్యింది.
శైలు చూట్టు చెయ్యి వేసి..”పెద్దావిడ కదా వయసు పైబడింది అందుకే తన మనవరాలి మీద ప్రేమ చూపిస్తున్నాను అనుకొని నీ మీద కోపాన్ని చూపిస్తుంది,ఇవి పట్టించుకోకు శైలు. 
అమ్మ అంటే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ మీద ప్రేమ చూపించడం కాదు..ప్రకృతి మీద, ప్రతి జీవి మీద ప్రేమను చూపించేదే అమ్మ అంటే.
 నాకు తెలిసి నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నుంచే తల్లివి రా.. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే తన తల్లి చుట్టూ జరుగుతున్నవి తెలుసుకొని కదులుతూ ఉంటుంది,సంభాషణని వింటూ ఉంటుంది, ప్రతి ఒక్కరి స్పర్శని తల్లి కడుపులో ఉన్నప్పుడే సందర్శిస్తుంది, బిడ్డని మోస్తున్న తల్లి మనసు ఎలా ఉంటుందో ఆ కడుపులో ఉన్న బిడ్డ మనసు కూడా అలాగే ఉంటుంది… అమ్మ కూడా అంతే..”అని అంది కస్తూరి అనునయంగా.
“నేను శ్రీమంతమయ్యే వరకు గార్డెన్ లో ఉంటాను పిన్ని.” అని అంది తల ఎత్తకుండా శైలు.
తన మనసు గాయం అయ్యింది అని అర్థమవుతుంటే,ఆ గాయం చేసింది తన ఇంటి మనిషే అని మనసు చెబుతుంటే… ఈ క్షణం తనకి కాసింత సమయం ఇవ్వాలి అని బుద్ధి చెప్పింది,వెంటనే శైలు ని చూస్తూ… “గార్డెన్లో వద్దు… ఇంకా పూజ పూర్తి కాలేదు,నేను ఇక్కడ గాజులు తెమ్మని అడిగితే వచ్చేసాను నువ్వు వెళ్లి పూజ గదిలో పూజ పూర్తి చెయ్యి.” అని అంది దైవారాధనకు మించిన థెరపీ ఇంకొకటి ఉండదు తన మనసుకి అని అనిపించడంతో కస్తూరి.
అలాగే పిన్ని అన్నట్టుగా తల ఊపి పూజ గది వైపు వెళ్ళిపోయింది శైలు.
మనసు నొచ్చుకుంటూ ఉండగా శైలు వెళ్తున్న వైపు చూసింది కస్తూరి.
గదిలోకి వెళ్లిన పెద్దావిడ మనవరాలిని ప్రేమగా చూసి చేతులు చుట్టూ తిప్పి మొటికలు విరిచి..” నా దిష్టే తగిలేలా ఉంది నా బంగారు తల్లికి.” అని మురిసిపోయింది.
ఆవిడని చూస్తూ..”అత్తయ్య.. కస్తూరి,శైలు ఏరి.” అని అడిగింది నవ్వుతూ కౌసల్య.
ఇక ఉంటాను 
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️