గేట్ ఓపెన్ కాగానే ఫాస్ట్గా కారుని లోపలకి పోనిచ్చాడు శ్రీపాద.
లోపలకి వెళ్ళిన కారులో నుంచి ఇంటి ముందు ఉన్న గార్డెన్ ఏరియా ఇల్లు చూస్తూ ఉంది.. తను ఫస్ట్ టైం ఆ ఇంటిని చూడడం మరి కొత్తగా ఉంది ఆ ప్లేస్ తనకి.
పార్కింగ్ ప్లేస్ లో కారుని ఆపి..”దిగు..” అని అన్నాడు డోర్స్ అన్లాక్ చేస్తూ శ్రీపాద.
“ఇక్కడకి ఎందుకు వచ్చాం మనం.” అని అడిగింది శ్రీపాదని చూస్తూ శైలు.