భగవంతుడా… ఈయనా మారడు వాళ్లు మారరు అని ఆ హాల్లో ఉన్న సోఫాలో కూలబడింది శైలు తల పట్టుకొని.
రూమ్ లోకి వెళ్లిన శ్రీపాద లగేజ్ అంతా సర్దేసి తలని చేతుల్లో పెట్టుకొని కూర్చున్న శైలుని ఒకసారి చూసి,బయటకి వెళ్లి కార్ డాష్ బోర్డులో ఉన్న ఆయింట్మెంట్ తీసుకొని జేబులో పెట్టుకొని మళ్ళీ మెయిన్ డోర్ లాక్ వేసి సోఫాలో కూర్చున్న శైలుని చేతుల్లోకి తీసుకొని బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లాడు ఏలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా.
“నువ్వు మర్యాదగా వదిలేయ్ నన్ను..” అని అంది కోపంగా శైలు.
“హో….అవ్చ్… బుజ్జి కుక్కపిల్లకి కోపం వచ్చిందా…!” అని అన్నాడు శైలుని బెడ్ మీద కూర్చోబెట్టి టక్కున టాప్ తీసేస్తూ శ్రీపాద.