ఆరటి చెట్టుని చూస్తూ.. అయ్యో శుభకార్యం కోసం వెళ్తుంటే ఒకటే కాపు కాసే అరటి చెట్టు కనిపించింది ఏంటి..! ఒంటికన్ను ఉన్న మనిషి,ఒక బిడ్డ ఉన్న తల్లి,ఒకటే కాపు కాసే అరటి చెట్టు ఆ శుభం కదా…! అని నిష్ఠూరంగా అనుకొని అక్కడే కూర్చుని మళ్లీ డబ్బాలో ఉన్న కాసిన్ని నీళ్లు తాగి కాసేపటికి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది.