డియర్❤️🔥బీస్ట్ – 5
అయితే కొంతమంది ఇక్కడే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయిలకు ఇష్టం లేకుండా బలవంతంగా వాళ్ళ రూమ్స్ కి లాక్కువెళ్లారు..
ప్లీజ్ సార్ మీరు త్వరగా వచ్చి వారిని కాపాడండి అని దాని మీనింగ్.
సిటీ పార్క్ రిసార్ట్స్ లో పార్టీ అంటే అది ఏ లెవెల్ వేరే చెప్పక్కర్లేదు.
దేశ రాజధాని అయిన ఢిల్లీలో అమ్మాయిలు మీద అరాచకం. బయటకు వస్తే ఏ లెవెల్ లో ప్రెషర్ ఉంటుందో కూడా తెలిసిన పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు.
పర్మిషన్ తీసుకుని వెంటనే రిసార్ట్ మీద దాడి చేశారు.
దడ దడ మోగుతున్న డోర్ సౌండ్ కి బెడ్ మీద అడ్డంగా పడుకొని నిద్రపోతున్నా రుద్రా కు ఏమాత్రం సెన్స్ లేదు.
స్పేర్ కి తో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన శిఖర్ అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా వణుకుతూ ఫ్లోర్ మీదికి కుప్పకూలిపోయాడు.
సార పరిస్థితి దారుణంగా ఉంది..
లైఫ్ లో ఇటువంటి ఒక సిచువేషన్ లో రుద్ర ని చూడాల్సి వస్తుందని ఏమాత్రం ఐడియా లేని శిఖర్ తిరిగి నార్మల్ అవ్వడానికి నిమిషాల టైం పట్టింది.
ఫస్ట్ రుద్ర కి స్లీపింగ్ రాపర్ తగిలించి తన రూమ్ కి షిఫ్ట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన శిఖర్ కి అక్కడ సారా కనిపించక భయం ఆవహించింది.
అసలు ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూషన్ మధ్య ఫాస్ట్ గా రూమ్ క్లీన్ చేసి అక్కడే ఉన్న శిఖర్ రైడ్ చేసిన పోలీసులకి చాలా నార్మల్ గా నిద్ర కళ్ళతో ఆన్సర్ ఇచ్చి సిచువేషన్ తన కంట్రోల్ లోకి తీసుకున్నారు.
ఎక్కడ ఎటువంటి రాంగ్ ఇన్సిడెంట్స్ దొరకలేదు పోలీసులకి.
మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్న పార్టీ గురించి వచ్చిన ఫేక్ కాల్ వలన చివరికి ఫూల్స్ అయ్యారు.
అర్ధరాత్రి అర్థం పర్థం లేని రైడ్స్ ఏంటి ?? అని పెద్ద తలకాయలు సీరియస్ అవ్వడంతో.. జరిగింది చెప్పి క్షమాపణ అడిగారు ఎక్స్ట్రా ఫోర్స్ తో వచ్చిన ఆ ఏరియా ఇన్స్పెక్టర్.
సబ్బార్డినేట్ కి రిపోర్ట్ చేయమని సీరియస్ ఆర్డర్ ఇచ్చి వదిలేసారు.
రిపోర్ట్ చేయడంతో పాటు ఫేక్ కాల్ చేసిన వాడిని పట్టుకునే పని స్టార్ట్ చేశారు పోలీసులు.
అయితే ఫేక్ కాల్ వచ్చింది హోటల్ ల్యాండ్ లైన్ నెంబర్ నుంచి కావడంతో చేసిన పర్సన్ ఎవరో తెలుసుకోలేకపోయారు.
రుద్ర కూడా తనలోని మృగాన్ని నిద్ర లేపిన ఆ నైట్ గురించి, ఇంక సారా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోయాడు.
జస్ట్ హోటల్ వీడియో ఫూటేజ్ మాత్రమే వాళ్ల దగ్గర ఉంది. అందులో సారా ఉంది, శిఖర్ ఉన్నాడు, తను కూడా ఉన్నాడు.. దానికి ముందు వెనుక జరిగింది ఏమీ లేదు.
శత్రువుల అటాక్ అని సింపుల్గా తీసుకుని స్టేజ్ కాదు..
ఒక అమ్మాయి ప్రాణాన్ని మానాన్ని పణంగా పెట్టిన పరిస్థితి సాధారణమైనది కాదు.
సారా గురించి వెతికిస్తూనే ఉన్నాడు రుద్ర.
ప్రాబ్లం ఏదైనా సరే ఫేస్ చేయాలి, దానిని క్యూర్ చేయాలి అప్పటివరకు వదిలేదే లేదు. టైమ్ అండ్ మనీ ఇస్ నాట్ ఏ మ్యాటర్ టు మీ.
ఐ వాంట్ దా ట్రూత్ బిహైండ్ థట్ డార్క్ నైట్.
అప్పటివరకు ఎ ఒక్క దారిని వదలను.. అని డెసిషన్ తీసుకున్న రుద్ర విల్ పవర్ తెలియంది కాదు. తన సైడ్ నుంచి పూర్తి సపోర్ట్ గా నిలబడ్డాడు శిఖర్.
రుద్ర లోని రాక్షసుడు ఆ చీకటి గది దాటి బయటికి రాకుండా శిఖర్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇలా ఈ విషయం ప్రస్తుతానికి రుద్ర శిఖర్ మధ్యనే ఉండిపోయింది.
ఈ రాక్షసుడు ఆ చీకటి గదికి, ఆ రాత్రికే పరిమితమా..??
రుద్ర లోని మృగం మరొకసారి బయటకు వస్తే..??
ఏం జరగబోతుందో, ఏం మలుపు తిరగబోతుందో చూడాలి మరి..!!
యూకే.. లండన్ సిటీలోని బ్లూమ్స్ బెర్రీ.
సువిశాలమైన క్లాసిక్ అండ్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్.
లండన్ క్లాక్ టవర్ మోడల్ లో ఆ ఇంటి లివింగ్ రూమ్ లో ఉన్న క్లాక్ ఎర్లీ మార్నింగ్ నాలుగుని అందుకోవడానికి పరిగెడుతూ ప్రస్తుతం 3:46 దగ్గర నడుస్తుంది.
స్టెప్స్ కి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ రూమ్ నుంచి చిన్నచిన్నగా ఎవో సౌండ్స్ వస్తున్నాయి.
ఓపెన్ చేసుకుని వెళ్లే టైం కాదు గాని లోపల సీన్ నేను చెప్తా..
మినీ నైట్ వేర్ లో క్యూట్ రాబిట్ లో బెడ్ మీద నిద్రపోతుంది ఒక అమ్మాయి.
షేప్ చూస్తే ఖజరహో శిల్పంలా, కలర్ కి పాలరాతి శిల్పంలా ఉంది. ఫేస్ చూడడానికే పిల్లో అడ్డంగా ఉంది.
బెడ్ మీద బాడీ మాత్రం లేడీ రోబో లా అడ్డదిడ్డంగా మూవ్ అవుతుంది.
సింపుల్ గా మేటర్ ఏంటంటే డ్రీమ్ వరల్డ్ లో జరుగుతున్న సిచువేషన్ కి రియల్ వరల్డ్ లో రియాక్ట్ అవుతున్న ఈ వయ్యారి శిల్పం ముఖానికి పిల్లో అడ్డుపెట్టుకొని డైలాగ్స్ కొడుతుంది.
ఆ డైలాగ్స్ లేడీ డాన్ లా పంచ్ డైలాగ్సా, లేక వయ్యారి హంసల పిరికి డైలాగ్సా.. అనేది కాసేపటికి తెలుస్తుంది.
మరో 5 మినిట్స్ స్క్రూ లూస్ అయినట్టు ఇష్టానికి బాడీ పార్ట్స్ తిప్పేస్తున్నా ఈ వయ్యారి శిల్పం పిల్లోతో సహా డిటిఎస్ సౌండ్ లో అరుస్తూ లేచి కూర్చుంది.. డ్రీమ్ వరల్డ్ లో సిచువేషన్ బాగా సీరియస్ అయినట్టుంది.
రియల్ వరల్డ్ లో ఇంటి లైట్స్ ఆన్ అయ్యాయి.
నెక్స్ట్ మినిట్ బెడ్ మీద మోకాళ్ళతో లేచి పిల్లోతో ఫైట్ చేస్తున్న ఈ వయ్యారి శిల్పం భుజాలు నొక్కి పట్టి ఐరా ఐరా అని అరుస్తుంటే నిమ్మదిగా ఫైటింగ్ ఆపి కళ్ళు తెరిచింది ఐరా.
ππππππππππππππππππππππππππππππππππ
కామెంట్స్ మస్ట్.
వర్ణ.__
Swipe left/right or tap the sides to turn pages