డియర్❤️🔥బీస్ట్ – 3
అలవాటు పడిన న్యూస్ చానల్స్ ఎప్పటిలా స్క్రోల్ చేస్తున్న అతను ఒక చానల్ స్క్రీన్ మీద సింహం గాంబీర్యం పునికి పుచ్చుకున్న సన్నటి చిరునవ్వుతో వెలిగిపోతున్న రుద్ర పేస్ చూడడమే ఆయన కళ్ళల్లో ఒక తీక్షణత.
రుద్ర ముఖంలోని సహజమైన దర్పం అతని కళ్ళను కట్టేసింది. ఏదో ఆకర్షణ అతని మస్తిష్క లోతుల్లోకి చొచ్చుకుపోతూ గత మూలాలలోకి నెట్టేస్తుంటే.. పరిచయమున్న వ్యక్తిని చూసిన ఫీలింగ్ అతనిలో.
రుద్రాన్ష్ మెహతా గురించి అప్పటికే చాలానే విన్న ఆ వ్యక్తి మొదటిసారిగా రుద్రా ను ఇలా స్క్రీన్ మీద చూడడం..
అవకాశం ఉంటుందా అని తర్కించుకుంటూనే రుద్ర కొసం న్యూస్ మొత్తం చూసిన అతని పెదవుల మీద ఒక అర్థవంతమైన నవ్వు.
సాధించడంలో వీడిని మించిన వాడు లేడు, గట్టి పిండమే అని మెచ్చుకోకుండా ఉండలేకపోయినా అతని ఆలోచనలు గతాన్ని తవ్వడం మాత్రం ఆపలేదు.
ఎందుకు అంత స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది అర్థం కావడం లేదు.
గత అన్వేషణకు బ్రేక్ వేస్తూ ఫోన్ రింగ్ అవ్వటంతో చూసిన అతనికి స్క్రీన్ మీద మయూరి అని కనిపించటమే టీవీ ఆఫ్ చేసి ఫోన్ తీసుకొని రిలాక్స్ గా బయటకు నడుస్తాడు.
మయూరి డాక్టర్ చెకప్ అయిపోయిందా అని ఎంతో ప్రేమగా బాధ్యతగా ప్రశ్నించిన అతనిలో ఇప్పుడు ఎటువంటి ఆలోచన లేదు.
ఆ సాయంత్రం కాలం వాలి లోని ప్రెసెంట్ వెథర్ ని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు మయూరి తో మాట్లాడిన అతని మాటల్లో మనసులో మెదడులో పూర్తిగా మయూరి ఆక్రమించేసింది.
ఢిల్లీ…
దేశం మెచ్చుకోదగ్గ యువ పారిశ్రామికవేత్తలలో అత్యున్నత స్థానాన్ని సంపాదించిన రుద్రాన్ష్ మెహతా.
ఈరోజు దేశం తలెత్తి చూస్తున్న ఈ ఘనమైన సన్మానానికి అన్ని విధాల అర్హుడు.. అని గొంత్తెత్తి పొగుడుతున్న గొప్ప వాళ్ళ మధ్య సగర్వంగా కూర్చున్నాడు రుద్రాన్ష్ మెహత.
VVIP గ్యాలరీలోని ఫస్ట్ రోలో వినోద్ రంజని ఇంకా వేద్ తో పాటు శిఖర్ కూడా కూర్చున్నారు.
నేషనల్ లెవెల్ మినిస్టర్స్ ఇన్వాల్వ్ అయిన ఆ సర్మని ని కొన్ని చానల్స్ లైవ్ ఇస్తున్నాయి.
ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు స్క్రీన్స్ మీద రుద్ర ను గొప్పగా
చూస్తున్నారు మరి కొంతమంది కుళ్ళుకుంటున్నారు, ఇంకా కొంతమంది దక్కించుకోవాలన్న ఆశతో చూస్తున్నారు.
మరి కొంతమంది పడగొట్టాలన్న కసితో రగిలిపోతున్నారు.
ఏదైనా ఈ 2 ఇయర్స్ లో ఫేమస్ పర్సనాలిటీ హిట్ లిస్టులో చేరాడు రుద్రాన్ష్ మెహతా.
ఎదురుగా ఉన్న వేదికలలో ఎటువంటి హ్యాపీనెస్ లేదు, బయటికి కక్కలేని అసూయను దాచుకుంటున్న ఇరిటేషన్ తప్ప.
సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చేతుల మీదుగా అవార్డు ప్రజెంటేషన్.. రిక్వెస్ట్ చేసి తల్లి చేతుల మీదుగా తీసుకోవాలన్న తన కోరికని సవినయంగా సభ ముందు తెలిపాడు రుద్ర.
అది వింటున్న రంజని భరించలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయితే అవార్డు తీసుకుంటున్నా రుద్ర ముఖంలోని స్వచ్ఛమైన సంతోషాం.
ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది.
దీనిని ఎలా ఖండించాలి అని ప్రశ్నించుకున్న వినోద్ ముఖం కల తప్పింది.
ఇంద్రస్థానాన్ని చేరుకున్నప్పుడు ఇరుగుపొరుగు వారే ఏడుస్తారు.
అధిష్టాన్ని చేజిక్కుంచ్చుకున్నప్పుడు అయిన వారే శత్రువులుగా మారతారు. ఇది సర్వసాధారణం.
రుద్ర విషయంలో కూడా అదే జరిగింది..
ఎవరికి కన్ను కుట్టిందో.. కసితో రగులుతున్న ఎ గుండె కంకణం కట్టుకుందో.. డౌన్ టు ఎర్త్ ఉండే రుద్ర మహోన్నతమైన వ్యక్తిత్వానికి బురద రాసి పాతాళానికి లాగేయడానికి పాచిక వేశారు.
అవార్డు సెరమని అనుకోకుండా వచ్చింది.
రుద్ర కు సంబంధించినంతవరకు అవార్డు తీసుకోవడం కన్నా గొప్ప విషయం కుటుంబం.
చాలా సెన్సిటివ్ గా ఉంటాడు కుటుంబం విషయంలో.
సెర్మని నెక్స్ట్ వీక్ వేదాన్ష్ పెళ్లి.
కాలేజ్ టైం నుంచి వెద్ ప్రేమించిన నేహా శర్మతో.
కుటుంబ బాంధవ్యాలను మరో మెట్టు ఎక్కించే వివాహం.
ఢిల్లీలోని ప్రముఖులు, ముఖ్యులు, బడబాబులు, సినీ ప్రముఖులు, చెప్పుకోదగ్గ వ్యక్తులు, ఇంకా ఇరువైపులా కుటుంబంలోని అందరి మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది నేహా వేద్ ల పెళ్లి.
మ్యారేజ్ రిసెప్షన్, అవార్డు సెర్మని అచీవ్మెంట్ పార్టీ రెండు కలిపి అరేంజ్ చేశారు వినోద్ మెహతా.
రుద్ర కి జనరల్ గా ఇటువంటి పార్టీ సైడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కుటుంబం సంతోషం పెరుగుతుంది అంటే కాదనడు.
రెండిటికీ కలిపి అరేంజ్ చేద్దామని ఐడియా ఇచ్చిన శిఖర్ షోల్డర్ మెత్తగా నలిపి గ్రేట్ ఐడియా అని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్లిపోయాడు రుద్ర.
బిక్క మొహంతో నొప్పికి రంజని గారిని చూశాడు శిఖర్.
వాడి గురించి తెలుసుగా అందరికోసం అంటే ఏదైనా చేస్తాడు. వాడి కోసం అంటే వద్దంటాడు. వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళు.
ఇద్దరినీ అలా గొప్పగా చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది శిఖర్ అన్నారు రంజిని ఎంతో కృతజ్ఞత చూపిస్తూ.
ఐ నో ఆంటీ.. యాక్చువల్లీ ఇట్స్ మై ప్లెషర్. బట్ దానికన్నా ఫస్ట్ ఈ షోల్డర్ కి హాట్ పాక్ అప్లై చేయాలి.
మెత్తగానే ఇంత గట్టిగా నొప్పి ఇచ్చాడు,
అది చెయ్యా ఇంకేమన్నానా..?? అని చాలా జోవియల్ గా తీసుకున్నా శిఖర్ వీడికి లైఫ్ పార్ట్నర్ ని వెతకాలంటే మనం ఎన్ని దేశాలు తిరగాలో అని వాపోయాడు.
ఢిల్లీలోని టాప్ మోస్ట్ ఫేమస్ అయిన ‘సిటీ పార్క్ రిసార్ట్స్’ అతిథులకు గ్రాండ్ గా ఆహ్వానం పలుకుతుంది.
అయితే ఇక్కడే నిద్ర అవస్థలో ఉన్న రుద్ర లోని మృగం మేల్కొంటుందని అతని జీవితాన్ని శాసిస్తుంది అని ఎవ్వరి ఊహకి అందని విషయం.
ఇది లేదు అని చెప్పడానికి వీలు లేని విధంగా తమ స్టేటస్ ఇంకా కుటుంబ సంతోషం తెలిసే విధంగా ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాడు వినోద్ మెహతా.
ఫంక్షన్ మొత్తం ఒక ఎత్తు అయితే రుద్ర ఒక్కడే ఒక ఎత్తు.
నవ దంపతులు అయిన వేద్ నేహాలతో సరి సమానమైన అట్రాక్షన్ రుద్ర సొంతం.
ππππππππππππππππππππππππππππππππππ
కామెంట్స్ మస్ట్.
వర్ణ.__
Swipe left/right or tap the sides to turn pages