దరిచేరా రావే.. చెలి!! – 1
ఒక లగ్జరీయస్ రూమ్ సాఫ్ట్ గోల్డెన్ లైటింగ్స్ తో మెరిసిపోతుంది….
రాయల్ కింగ్ సైజ్ బెడ్ పై ఒక యువతీ పడుకుంది… కానీ తనకి నిద్ర పట్టడం లేదు….
మెల్లిగా లేచి ప్లష్ వెల్వేట్ హెడ్ బోర్డ్ కు ఆనుకుని… తన గుండెల పై ఓ చేయి వేసుకుని కళ్ళు మూసుకొని ఉంది..
మనసంతా గందర గోళంగా అనిపిస్తుంది
చిన్నగా కాళ్ళు చేతులు షివరింగ్ ఆయునట్టు గా అనిపిస్తుంటే..
లేచి చిన్నగా వాకింగ్ చేయాలని తన పాదాలను కింద పెట్టగానే సాఫ్ట్ ఫర్ రగ్ కార్పెట్ అదనపు సౌకర్యం గా అనిపిస్తుంది..
బెడ్ కి ఎడమ వైపు వాల్ లెంగ్త్ మిర్రర్ విత్ ఇంట్రీకేట్ గోల్డెన్ ఫ్రేమ్ లైటింగ్ లో మెరుస్తూ… తన అందమైన రూపాన్ని చూపిస్తుంది…
మెల్లిగా క్లోసట్ దగ్గరకు నడిచింది రిచ్ లుక్ తో చాలా అందంగా కనిపిస్తుంది..
బెడ్ కి కుడివైపు గ్లాస్ వాల్ విత్ ఆటోమేటెడ్ కర్టైన్స్ సిటీస్కేప్ వ్యూ తో లగ్జరీ ను ఇంకాస్త ఎలివేట్ చేస్తుంది…
బెడ్ పక్కన ఉన్న మార్బల్ బెడ్ సైడ్ టేబుల్ మీద బేబీ ఫస్ట్ అల్ట్రాసౌండ్ పిక్చర్ ఉంది… దాన్ని చేతుల్లోకి తీసుకొని తడిమి తన పొట్టపై చేతిని పెట్టి నిమిరింది..
మెల్లిగా అటు ఇటు కాసేపు నడిచి అలా బెడ్ పై కూర్చొని
హెడ్ బోర్డ్ కి అనుకోని సెల్ఫ్ రోటేట్ అయ్యే చాండ్లియర్ నుంచి పడే డిమ్ గోల్డెన్ రిఫ్లక్షన్స్ ని చూస్తుంటే కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది కానీ…
ఎంత స్ట్రాంగ్ గా ఉందామనుకున్న… అ ప్రయత్నం గా తన చేతులు తన కడుపు మీదకి చేరాయి…
తన బేబీ కదలికలు ఎక్కువగా అనిపిస్తుంటే.. కూర్చునే ఓపిక నశిస్తుంటే మెల్లిగా పడుకోవడానికి ప్రయత్నించింది…
కడుపు లో నొప్పి తో పాటు లోయర్ బ్యాక్ పెయిన్ మొదట కొంచెం గా అనిపించినా తరువాత ఎక్కువగా అనిపిస్తుంటే
మొండిగా ఆ నొప్పి ని భరిస్తూ డాక్టర్ ఇచ్చిన టైం ఇంకా ఉంది కదా అనుకుంటుంది
కానీ అంతకంతకు ఆ నొప్పి పెరుగుతుంటే.. అదే రూమ్ లో ఓ పక్కన పడుకొని ఉన్నా శారదమ్మ ని లేపింది
” ఆవిడ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వెంటనే తీసుకు రమ్మని చెప్పింది
కార్ డ్రైవర్ కి ఫోన్ చేసి కార్ తీయమని చెప్పింది
మెల్లిగా తనని లేపి కార్ దగ్గరికి నడిపించే లోపు డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి పెట్టాడు..
కార్ లో కూర్చోబెట్టి ఒక అతనికి ఫోన్ చేసింది… ” శారద
అతను ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే అంత బానే ఉంది కదా అని ఆతృత గా అడిగాడు..
హ సర్… కానీ మేడమ్ కి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి.. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నాం అని చెప్పగానే ఓకే అని కాల్ కట్ చేసి అతను కూడా స్టార్ట్ అయ్యాడు..
వాళ్ళు హాస్పిటల్ కి చేరుకునే వారికీ లేబర్ రూమ్ రెడీ చేసి డాక్టర్ వెయిట్ చేస్తుంది..
కార్ హాస్పిటల్ కి చేరుకున్న మరుక్షణం కార్ డోర్ తీసి ఆవిడ ని స్ట్రెర్చర్ పై పడుకో పెట్టి తీసుకెళ్తుంటే అతను వచ్చాడు
పెయిన్స్ కారణంగా తను విల విలలాడిపోవడం చూస్తున్న అతనికి ఏదోలా అనిపించి టెన్షన్ స్టార్ట్ అయింది…
లేబర్ రూమ్ లో ఆ అమ్మాయి పడుతున్న నొప్పులకి… అరుపులకి… కారిడార్ లో అటు ఇటు తిరుగుతున్నాడు అతను…
నొప్పి కి ఆయాసపడుతూ తడబడుతున్న ఆమె అరుపులు… ఓ పక్కా…
పుష్.. గట్టిగా ఊపిరి తీసుకొని పుష్ చేయ్ అంటూ డాక్టర్ అరుపులు మరో పక్క….
బడా బాబులనే తన కను సైగలతోనే శాసించే అతను ఒకమ్మాయి పెయిన్స్ వింటూ తట్టుకోలేక ఛైర్ లో కూర్చొని తన మొహాన్ని రెండు చేతుల్లో దాచుకుని బేబీ సవ్యంగా బయటకి వస్తుందా అనే భయం అతనిలో
తన శక్తిని మొత్తం పోగొట్టుకున్నట్టు సొమ్మ సిల్లీ పోతున్నట్టు అనిపిస్తుంటే గట్టిగా ఊపిరి తీసుకొని ఒక్కసారిగా పుష్ చేసేసరికి ఒకేసారి రెండు అరుపులు వినిపిస్తాయి
తల్లి అరుపులు ఆగిపోయి బిడ్డ అరుపులు మాత్రమే వినిపిస్తుంటే ఒక్కసారిగా తలెత్తిన అతని కళ్ళల్లో ఓ మెరుపు..
బయటకి వచ్చిన నర్స్.. కంగ్రాట్స్ సర్ మీకు కూతురు పుట్టింది అని చెప్తుంది…
ఫస్ట్ కొంచెం నిరుత్సాహ పడినా నెక్స్ట్ సెకండ్ వాటేవర్ తను నా రక్తం అనుకుంటాడు…
లోపల బేబీ ని క్లీన్ చేసి తెల్లటి పొడి గుడ్డతో తుడిచి మరో తెల్లని క్లోత్ తో తీసుకొచ్చి అతని చేతిలో పెడతారు..
మొదటి సారి తన బేబీ ని చూసిన అతనికి అదో కొత్త ఫీలింగ్.. బేబీ పింక్ కలర్ లో ఉన్న బేబీ ని చూస్తుంటే తెలియకుండా నే తన పెదవుల్లో చిరునవ్వు వస్తుంది…
బేబీ బయటకి వచ్చాక సొమ్మ సిల్లిన ఆమె ని మరో రూమ్ కి షిఫ్ట్ చేస్తారు..
మెలుకువ వచ్చిన ఆమె కి సిస్టర్ ఒకసారి బేబీ ని చూపిస్తారా అనిచాలా ఆశ గా అడుగుతుంది
@ ఇంకా ఉంది…
@ స్టోరీ చదివి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి….
Swipe left/right or tap the sides to turn pages