New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దరిచేరా రావే.. చెలి!! – 2

దరిచేరా రావే.. చెలి!! – 2

బేబీ బయటకి వచ్చాక సొమ్మ సిల్లిన ఆమె ని మరో రూమ్ కి షిఫ్ట్ చేస్తారు..

మెలుకువ వచ్చిన ఆమె కి సిస్టర్ ఒకసారి బేబీ ని చూపిస్తారా అనిచాలా ఆశ గా అడుగుతుంది

బిడ్డ పుట్టిన మరుక్షణం ఆ బిడ్డ ని చూసాక అప్పటి వరకు పడిన నొప్పి ని నిమిషాల్లో మర్చిపోతారు…  తల్లిగా మారిన ఆ అనుభూతి ఆ బాధ కంటే చాలా గొప్పది..

బేబీ సర్ దగ్గర ఉంది మేడమ్ అంటుంటే.. అప్పుడు గుర్తొస్తుంది తనకి బేబీ ని చూడకూడదు అన్న మాట..

ఒక తల్లి కి డెలివరీ నొప్పిని మించిన బాధ లేదు… కానీ ఆ బాధను మరచిపించేదే తన బిడ్డ…  అలాంటి తల్లికి… ఆ బిడ్డను చూపకుండా దూరం చేస్తే…  అది మరోసారి ఆమెకు మృత్యువుతో సమానం.. !

పుట్టిన బేబీ ని తీసుకొని తనతో పాటు ఒక నర్స్ ని.. ఆ బేబీ కి కావాల్సినవి తీసుకొని హాస్పిటల్ నుండి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు…

తన ప్రైవేట్ జెట్ లో ఓ గంటన్నర సమయంలో హైదరాబాద్ కి చేరుకుంటాడు…

అతను ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అతని కోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తోంది ఓ కార్

కార్ ఎక్కిన మరో గంట కి తన మాన్షన్ ముందు నిలబడ్డాడు…

నానమ్మ అని అరిచాడు అతను…

అతని అరిచిన అరుపుకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకి వచ్చేసారు

ఇంటి ముందు అరచేతుల్లో పాప ని పట్టుకొని నిలబడి ఉన్న అతన్ని చూస్తుంటే..

ఎవరికీ ఏం అర్ధం కాకుండా అయోమయం గా చూస్తున్నారు అందరూ..

” రిధ్విక్…. ఎవరు తను ” అని గంభీరంగా అరిచారు భానుమతి గారు.

ఈ పాప నా కూతురు నానమ్మ అంటూ ఆవిడ చేతుల్లో పెట్టాడు ఆ పాప ని…

అందరికి ఆశ్చర్యం గా అనిపించి బొమ్మల్లా ఎక్కడి వారు అక్కడ నిలబడి పోయారు

పాప ఏడుపుతో అందరిలో కదలిక వస్తుంది 

కుటుంబాన్ని విడిచి ఒంటరిగా మూడు సంవత్సరాలుగా బెంగళూరు లో ఉంటున్నాడు

ఇప్పుడు వచ్చి ఈ చిన్న పాప నా కూతురు అంటుంటే అందరికి చిన్న పాటి షాక్ తగిలింది…

కానీ ఆ షాక్ ఎందుకంటే… పాప తో పాప తల్లి రానందుకు…

రిధ్విక్ అమ్మాయి ఎక్కడ… ?

తను రాలేదు నానమ్మ.. !

రాలేదు అంటే ఎందుకు… అని తిరిగి ప్రశ్నించారు భానుమతి గారు

హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఆమె మెల్లిగా లేచి అడుగు లో అడుగు వేస్తూ రూమ్ నుండి బయటకి వచ్చింది…

ఆ కారిడార్ లో ఎవరు లేరు.. నిశ్శబ్దం గా ఉన్న ఆ కారిడార్ కూడా ఒక రకమైన భయాన్ని పుట్టిస్తుంటే… కన్నీళ్లని అదుపు చేస్కుంటూ బయటకి వస్తుంటే…

శ్రేయ ఎక్కడికమ్మా వెళ్తున్నావ్… అంటూ తన వెనకే పరుగు తీస్కుంటూ వచ్చింది శారద..

ఇక్కడ నా అవసరం తీరిపోయింది శారదమ్మ…

అలా అని ఎక్కడికి వెళ్తావ్… !

తెలియదు కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండకూడదు

కానీ నువ్విప్పుడు బాలింత వి… జాగ్రత్త గా ఉండాల్సిన సమయం ఇది..

శారద గారి వైపు చూసి చేతులెత్తి దండం పెట్టి ఇన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా కాచుకున్న మీకు ఇంతకంటే ఏం ఇవ్వలేను అని కన్నీళ్లు పెట్టుకుంది శ్రేయాన్షిక 

పదా మా ఇంటికి వెళ్దాం… ఇన్ని రోజులు చూసుకున్న నేను ఇలాంటి సమయంలో వదిలేయలేనమ్మా…

ఇక్కడ నాకు మీరు తప్ప మరో వ్యక్తి కూడా నాకు తెలియదు అని ఆవిడ వేంటే మెల్లిగా హాస్పిటల్ దాటుతుంది..

” ఆడపిల్ల పుట్టిందని తనకి ఈ కూతురు వద్దు అంది.. నీ పెంపకం లో పెరిగిన నేను నా రక్తాన్ని వదులుకోలేక తనని వదిలేసి వచ్చేసాను నానమ్మ ”  అంటాడు

ఆ మాట విన్న సావిత్రి గారు ఆవేశం తో ” ఛీ అది ఆడదేనా అసలు… ” అంటారు

సావిత్రి నిజానిజాలు తెలియకుండా మాట్లాడకు అంటారు  సుధాకర్ గారు…

ఇంకేం నిజాలు తెలియాలి… పురిటి లొనే బిడ్డ ని వదిలేసిన అది ఈ జన్మ కి బాగుపడదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు

ఊరుకో అక్క ఆ పసి దానికి ఏం కావాలో చూద్దాం పదా అంటూ ఓదార్చారు సరస్వతి గారు 

గబ గబ లోపలికి వెళ్లి హారతి సిద్ధం చేసి  చిన్నా పాప ని తీస్కో అంటారు సావిత్రి గారు

నానమ్మ చేతుల్లో నుండి పాప ని తీస్కొని హారతి ఇచ్చాక పాప తో సహా ఇంట్లో కి అడుగు పెడతాడు రిధ్విక్…

రిధ్విక్ చేతుల్లో నుండి పాపని తీసుకున్నారు సావిత్రి గారు

రిధ్విక్ అక్కడి నుండి తన రూమ్ కి వెళ్ళిపోయాక…

భానుమతి గారు తన రూమ్ కి వెళ్లి ఎవరికో కాల్ చేశారు.. కానీ ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..

మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నా నో రెస్పాన్స్…

అక్కా పాప అచ్చం మన చిన్నా లాగే ఉంది కదా… అంది సరస్వతి…

@ ఇంకా ఉంది…

@ స్టోరీ చదివి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి….