New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
దరిచేరా రావే.. చెలి!! – 3

దరిచేరా రావే.. చెలి!! – 3

భానుమతి గారు తన రూమ్ కి వెళ్లి ఎవరికో కాల్ చేశారు.. కానీ ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..

మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నా నో రెస్పాన్స్…
అక్కా పాప అచ్చం మన చిన్నా లాగే ఉంది కదా… అంది సరస్వతి…
అవును సరు పాప కి డ్రెస్ చేంజ్ చేద్దాం రా అంటూ ఇద్దరు తోడికోడళ్ళు ఒక దగ్గర కూర్చొని… గోరు వెచ్చటి నీళ్లతో ఒకరు స్పాంజ్ బాత్ చేయిస్తే.. మరొకరు డ్రెస్ వేస్తారు
సావిత్రి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు భానుమతి గారు
పైన తన రూమ్ కి వెళ్ళాడు అత్తయ్య…
సరే అని  భానుమతి గారు కూడా పైకి వెళ్లేసరికి వాష్ రూమ్ లో ఫ్రెష్ అవుతూ ఉంటాడు రిధ్విక్..
బాల్కనీ లో కి వెళ్లి ఛైర్ లో కూర్చొని మనవడి కోసం వెయిట్ చేస్తున్నారు..
ఒక పది నిమిషాలకి బయట కి వచ్చిన రిధ్విక్… భానుమతి గారిని చూసి నువ్వెంటి నానమ్మ ఇక్కడ అంటూ అడుగుతాడు..
నీతో మాట్లాడాలని వచ్చారా…
చెప్పు నానమ్మ..
నాకు నిజం కావాలి చిన్నా…
ఏం నిజం నానమ్మ…
స్వీటీ నీతో ఎందుకు రాలేదు
రీసన్ చెప్పాను కదా నానమ్మ…
” రిధ్విక్..  ఇలాంటి రీసన్స్ వెళ్లి మీ అమ్మ కి చెప్పు నాకు కాదు..” అని ఆగ్రహం గా అన్నారు భానుమతి గారు 
కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు రిధ్విక్
” నాకు నిజం మాత్రమే కావాలి… వెంటనే స్వీటీ ఇక్కడికి రావాలి… ” అన్నారు ఆవేశం గా భానుమతి గారు
నానమ్మ మాటలకి కోపం వస్తున్నా… ఆ కోపం తనపై చూపించలేడు కాబట్టి ఫేస్ లో కోపం కనిపించకుండా నార్మల్ గా ఉంటూ ఇన్ఫోర్మ్ చేస్తా నానమ్మ అంటాడు
ఇన్ఫోర్మ్ చేయడానికి తనేం నీ ఆఫీస్ లో ఎంప్లొయ్ కాదు రిధ్విక్.. తను నీ భార్య… అని వత్తి పలుకుతూ ఫోన్ చేయ్ ముందు అన్నారు
అలాగే నానమ్మ అంటూ రూమ్ లోకి వెళ్లి ఫోన్ తీసుకొచ్చి భానుమతి గారి ముందే కాల్ చేశాడు
రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు…
చూసావా నానమ్మ… తనకి ఎంత పొగరో… నేను కాల్ చేస్తుంటే అవాయిడ్ చేస్తుంది… ఆలోచన రహితం గా అనేస్తాడు
@
హాస్పిటల్ నుండి ఆటో లో శారదమ్మ ఇంటికి చేరుకున్న శ్రేయ ని బయటే నిలబెట్టి… నువ్వు ఇక్కడే ఉండు శ్రేయ నేను ఇప్పుడే వస్తా అంటూ ఫాస్ట్ గా ఇంట్లోకి వెళ్లి ఎర్ర నీళ్లు దిష్టి గా తీసుకొచ్చింది
నా చేతిలో బిడ్డ లేదు ఎందుకు ఇప్పుడు దిష్టి తీయడం… నేను బిడ్డని కన్న గొడ్రాలిని శారదమ్మ అని కన్నీళ్లతో ఇంట్లోకి వెళ్తుంది..
బిడ్డ ఉంటేనే దిష్టి తీయాలా… బిడ్డ ని కన్న తల్లికి తీయకూడద అని ఏంటో ఈ కాలం పిల్లలు అని తనలో తనే అనుకోని అవి ఓ చెట్టు మొదట పాడబోసింది
కుమిలి కుమిలి ఏడుస్తున్న శ్రేయ దగ్గరికి వెళ్లి ” వేడి నీళ్లతో స్నానం చేసి రా .. శరీరం లో ఉండే నొప్పులు తగ్గుతాయి ” అని బాత్ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది
శారదమ్మ దే ఓ చీర తీసి ఇచ్చి ఈ రోజుకి ఇవి కట్టుకో శ్రేయ రేపు కొత్తవి కొనుక్కోస్తాను అంటుంది
పర్లేదు ఇవి చాలు కొత్తవి వద్దు అంటుంది
వేడి నీళ్లతో స్నానం చేసి వచ్చే సరికి కొంచెం రిలాక్స్ గా అనిపించి కాసేపు పడుకుంటాను అంటుంది
శ్రేయ… మీ వాళ్ళ కి ఎవరికైనా ఫోన్ చేయాలి అనుకుంటే చేయమ్మా…
నా వాళ్ళు అని విరక్తి గా నవ్వి నాకెవరు లేరు శారదమ్మ నేను నా అనేవాళ్ళు లేని ఏకాకి ని అని రూమ్ లో కి వెళ్తుంది
అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఏంటో…!! ఏమి అర్థం అవ్వట్లేదు అనుకుంది శారద 
@
స్వీటీ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు రిధ్విక్ అని అడుగుతారు భానుమతి గారు
” నన్ను నా బిడ్డ ని వద్దు అనుకున్నాక తన గురించి నాకు అనవసరం నానమ్మ.. ప్లీజ్ తనెందుకు ఇలా చేసింది అనే బాధ లో ఉంటే నువ్విలా గుచ్చి గుచ్చి అడిగి.. తను అలా ఫోన్ లిఫ్ట్ చేయక నా బాధని మరింత పెంచుతున్నారు ” అని ఫేస్ ని చాలా బాధగా పెడతాడు రిధ్విక్
మనవడి మాటలు అబద్దం అనిపిస్తుంటే కానీ తన బాధ నిజం అనేలా ఉన్న ఫేస్ ఎక్సప్రెషన్స్ కి నమ్మాలో లేదో తెలియని సందిగ్ధం లో పడతారు ఆవిడ..
అక్కడే ఉంటే ఇంకేం క్వశ్చన్స్ చేస్తుందో అని చల్లగా జారుకుంటాడు అక్కడి నుండి
కిందికి వచ్చేసరికి పాప ఏడుపు వినిపిస్తుంటే ఆ పాప ని ఎత్తుకొని సావిత్రి గారు ఊరడిస్తుంటే… సరస్వతి గారు ఫార్ములా మిల్క్ కలుపుతారు…
పాప ఏడుస్తుంటే సావిత్రి గారి కళ్ళల్లో కన్నీళ్లు.. ఏడుస్తూనే  ” పాపిష్టి దానికి  మనసెలా ఒప్పిందో… పసి పాప ని ఎలా వదిలేయాలనిపించిందో ” అంటూ తిడుతూనే పాప కి పాలు పడుతుంటే ఆకలి కి ఆ పాలు తాగి పడుకుంటుంది బుజ్జిది
@ ఇంకా ఉంది…
@ స్టోరీ చదివి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి….