New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ చూపులే నా ఊపిరి💕 – 2

నీ చూపులే నా ఊపిరి💕 – 2

భాగం 💕 2

 

“కొన్ని కొన్ని సార్లు మన నుంచే వచ్చే చిన్న పదం అయినా, మనల్ని ఇష్టపడేవారి గుండెను ఘోరంగా పగిలేలా చేస్తుంది.”

 

గౌరమ్మ అన్న మాటలను తీసుకోలేక, “కంగ్రాట్స్ అండి మీకు వాటర్ తీసుకొస్తాను” అంటూ వణుకుతున్న గొంతు తోనే తన భుజం పై వేసిన అతని చేతిని బలంగా వెనక్కి తీసేసి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది మీనాక్షి. 

 

కోడలి బాధ అర్థం అవుతుంటే ఆ పెద్ద జంట కి కూడా ఆవిడ పై కోపం ఆగట్లేదు. 

 

వణుకుతున్న తన గొంతు లోనే తెలుస్తుంది తను ఎంతగా బాధ పడింది అనేసి. తన కంట్లో వచ్చిన చిన్న కన్నీటి బొట్టులకే అతని కంట నీరు చేరిపోయి వెళుతున్న తన వైపే బాధగా చూస్తూ వెంటనే గౌరమ్మ వైపు కోపంగా చూస్తూ, 

 

“నాకేం అర్థం కావట్లేదు అమ్మమ్మ నీ బాధ ఏంటి అసలు? నాకు ఇవాళ తేలిపోవాలి. తెలియట్లేదు నేను నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. నాదేమీ లవ్ మ్యారేజ్ కాదే నా ఇష్ట ప్రకారం జరిగినందుకు నేనే తెచ్చుకున్న నా లైఫ్ పార్ట్నర్ మీకు నచ్చలేదు అందుకే ఇలా దానికి సూటి పోటి మాటల ద్వారా టార్చర్ పెడుతూ హింస పెడుతున్నారు అనుకోవటానికి.

 

మీరు చూసిన సంబంధమే కదా ఇది. ఇన్ఫాక్ట్ నేను చూడమని కూడా చెప్పలేదు మీరే బలవంతంగా నేను లైఫ్ లో ఎదుగుతుండంగా నేను వద్దంటున్నా నాకు పెళ్లి చేశారు. 

 

నా రాత బాగుండో లేక ఇంకేంటో తెలియదు తను నా లైఫ్ లోకి అడుగు పెట్టిన వేళా విశేషం అప్పటి వరకు ఎంతో కష్టంగా సాగిపోతున్న నా ప్రొఫెషన్ లైఫ్ సాఫీగా నడవడం మొదలు పెట్టింది. 

 

నా హార్డ్ వర్క్ అనుకున్నాను కానీ అందులో తన లక్ కూడా కలిసిందని కొంత కాలం తర్వాతనే అర్థం అయింది. అది కాక తను నాపై చూపించే ప్రేమ అభిమానానికి నాకే తెలియకుండా తనతో ప్రేమలో పడిపోయాను.

 

పెళ్లి అయ్యాకనే తనని ప్రేమించాను. అసలు తను ఎవరో తెలీదు తన అభిరుచులు ఏంటో తెలియదు. ఏమీ తెలియకుండానే చేసుకుని ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్న నాకు ఇప్పుడు తనే ప్రాణం అయిపోయింది. 

 

తెలీదు నేను ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన ప్రతిసారి తన కళ్ళల్లో జీవం నాకెప్పుడూ కనిపించలేదు. దానికి కారణం ఏంటి అనేది కొంత కాలం వరకు నాకు అర్థం కాలేదు. కాలం గడిచాక అర్థమైంది అది నీ చలువ అని. 

 

అప్పటి నుంచి నీ మాటలు తనకి వినిపించకూడదు అనేసే నిన్ను నేను ఏమీ అనలేక తనని నేను ఉన్నంత వరకు కాపాడుకుంటూ వచ్చాను. ఇక నా వల్ల కాదు.

 

నీకు తెలియడం లేదు అది ఎప్పుడో నా పంచ ప్రాణాలు అయిపోయింది. ఇప్పుడు దానికి చిన్న దెబ్బనే కాదు దాని కంట ఒక్క కన్నీటి బొట్టు రాలినా ఇక్కడ నా ప్రాణం విల విల లాడుతుంది. 

 

ఇక నా వల్ల కాదు అమ్మమ్మా ఒక్కటే ఒక్క మాట అసలు నీ ప్రాబ్లం ఏంటి..? తన వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి..? ఎందుకని తనని ఒక శత్రువులా చూస్తున్నావు..? అంత కాని పని తను నీకు ఏం చేసింది..? లేక మేమిద్దరం సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా..? 

 

చెప్పు ఒకవేళ ఇష్టం లేకపోతే నేను వద్దంటున్నా కూడా నాకెందుకు పెళ్లి చేశారు..? ఇప్పుడు తీరా నా భార్యని, నా చేతులారా తాళి కట్టిన నా భార్యని ఎంతో ఇష్టంగా ప్రేమించి ప్రాణంలా చూసుకుందాం అనుకునే సమయానికి ఎందుకు మా మధ్య ఇటువంటి రచ్చలు రేపుతున్నావు..? పోనీ తనకి విడాకులు ఇచ్చేయనా..?”

 

అనగానే గౌరమ్మ మాటలకి మనసు విరిగిపోయిన మీనా సైలెంట్ గా లోపలికి వెళ్లి తన పని తాను చూసుకుంటూ అన్నం వంచుతుండగానే విన్ను మాటలు వినిపించి ఒక్క క్షణం గుండె ఝల్లుమని ఒక్క సారిగా చేతిలో ఉన్న గిన్నెని చేజార్చింది.

 

అంతే వేడి వేడి నీరు తన కుడి చేతి పై పడిపోయాయి. అది పడగానే, “అమ్మ” అంటూ కేక వేసేసింది. 

 

కొనసాగుతుంది…. 

 

ఇప్పుడు ఏమో జరగబోతుంది?

గౌరమ్మ వల్ల ఎంతగానో ప్రేమిస్తున్న భార్యని కోల్పోతాడా వినయ్?

అలా జరిగితే భర్త పైనే తన పంచ ప్రాణాలు పెట్టుకున్న మీనాక్షి పరిస్థితి ఏంటి?

 

తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే..

 

నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యరా.. అలాగే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..

 

నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…

 

ఇట్లు

మీ కీర్తి ప్రియ💕