New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ చూపులే నా ఊపిరి💕 – 3

నీ చూపులే నా ఊపిరి💕 – 3

భాగం 💕 3

 

“మనసారా ప్రేమించిన వారికి చిన్న దెబ్బ తగిలినా మన మనసు పడే వేదన భరించలేము.”

 

గౌరమ్మ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవటం కోసం వినయ్ విడాకుల టాపిక్ తీసుకొస్తాడు. కానీ అప్పటికే బాధలో ఉన్న మీనా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్త మాట వినగానే గుండె పగలగొట్టుకుంటుంది.

 

అంతే కిచెన్లో లోపల అన్నం వంచుతూ ఒక్కసారిగా విన్న మాటలకి చెయ్యి వనకటంతో వేడి వేడి నీరు తన కుడి చేతి పై పడిపోయాయి. అది పడగానే, “అమ్మ” అంటూ కేక వేసేసింది. 

 

తన అరుపు వినగానే గుండె పగిలి, “మిన్ను” అంటూ పరుగున వెళ్లిపోయాడు వినయ్ లోపలికి.

 

తన వెంటే అత్త మామలు. 

 

గౌరమ్మ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉలుకు పలుకు లేకుండా అలానే నిల్చుని ఉంది. 

 

తను లోపలికి వచ్చినది గమనించి గాబరాగా గిన్నెని సరిగ్గా లేపి పెట్టి ఏం మాట్లాడాలన్నా నోటి వెంట మాట రాక తను విడాకులు అన్న మాటనే మెదడులో గిర్రునా తిరుగుతుంటే ఒక్క క్షణం టైం ఇస్తే ఎక్కడ గుండె ఆగిపోతుందో ఏమో అన్న భయంతో అలానే ఉండిపోయింది.

 

మీనా దగ్గరికి వచ్చిన విన్ను ఎర్రగా కందిపోయిన తన చేతిని చూడగానే కళ్ళల్లో నీరు చేరటం ఆలస్యం, “హే… చూసుకోవా రా చూడు ఎంతలా కాలిపోయిందో” అంటూ తన పాటికి తను మీనా చేతిని ట్యాప్ కింద పెట్టి టాప్ ఆన్ చేస్తూ చిన్నగా రుద్దుతుంటే, 

 

మీనా మాత్రం ఈ లోకంలో లేదు దగ్గరకొచ్చిన తన భర్తనే కళ్ళ నీళ్లతో చూస్తూ అప్పటికే కాస్త ఊపిరి భారమవుతుంటే కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ, “ఏమండీ” పిలుపు బయటకు రాలేదు బాధతో గొంతు గూడుపుపోయింది. 

 

తన గొంతు రవ్వంత కూడా బయటికి రాలేదు అన్న విషయం తనకే అర్థమై కాస్త స్థిమిత పడి మెల్లిగా, “ఏమండీ నన్ను వదిలేస్తారా?” 

 

ఏడుపు గొంతుతోనే అడిగిన తన మాటకి కళ్ళనీళ్ళతో తన వైపే సూటిగా చూశాడు. 

 

కన్నీళ్లు నిండిన కళ్ళల్లో ఎక్కడ తనని వదిలేస్తాడో ఏమో, తన ప్రాణం ఇక్కడితో అంతమైపోతుంది ఏమో అన్న భయం కొట్టొచ్చినట్టు కనపడుతుంది వినయ్ కి. 

 

అది అర్థం అవ్వగానే ఎడమ చేతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి బలంగా. 

 

ఈ మాట తన నోటి వెంట కల్లో కూడా వింటాను అని తను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కేవలం తన అమ్మమ్మ ద్వారా ఇంత రచ్చ జరిగిందని తనకు తెలియకుండానే తన ప్రాణాన్ని బాధ పెట్టానా అనుకోగానే అతని మనసు బీభత్సంగా మెలిపెట్టేసింది. 

 

కోడలి మాట వినగానే అత్త మామలు ఇద్దరు ఆశ్చర్యపోయారు. 

 

“చెప్పండి నన్ను వదిలేస్తారా” ఎటువంటి రెస్పాన్స్ లేక అలానే ఉన్న తననే పట్టి చూస్తూ మళ్లీ అడుగుతుంటేనే, 

 

తన మాట పూర్తి కాకముందే తన చేతిలోని క్లాత్ పక్కన పెట్టేసి ఇంకో చెయ్యి పట్టుకొని స్పీడ్ గా బయటికి తీసుకెళ్లిపోయాడు.

 

అంత కోపంగా బయటికొస్తున్న మనవడిని చూసి తన వెంటనే మౌనంగా వెళుతున్న మనవరాలు కనిపించగానే ముఖం చిట్లించి మనవడి అడుగులు తన వైపు కాక డోర్ వైపుగా పడటం గమనించి, “రేయ్! ఈ టైంలో ఎక్కడికి రా?” అంటూ తన మాట పూర్తిగా అడగక ముందే ముందుకు వేసే అడుగులని ఆపేసి భగ భగమంటూ మండే కళ్ళతో వెనక్కి తిరిగి, 

 

“నా పెళ్ళాంతో నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అలా అడిగే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. ఇంకోసారి మా విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. అలాగే అమ్మ ఈ విషయం ఒక మనవడిగా నేను చెప్పకూడదు కానీ చెప్పక తప్పట్లేదు ఈవిడ అసలు మన ఇంట్లో ఎందుకు ఉంది? 

 

ఈవిడ అనే మాటలకి నా భార్య అయితే తట్టుకోగలిగింది అదే రేపు చిన్నోడికి పెళ్లి అయ్యాక తన గతి కూడా ఇదే అయితే వాడు మాత్రం నాలాగా ఇంత సమయం తీసుకోడు ఎప్పుడో తెగతెంపులు చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. 

 

అందుకే మీ బిడ్డల కోసమైనా మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారు అని ఆశిస్తున్నాను. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నాను అని అడగకండి నా ప్రాణంతో నేను కాస్త ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నాను. ఆ ఏకాంతం నాకు ఈ కొంపలో లభించదు అని అర్థమైంది అందుకే నన్ను డిస్టర్బ్ చేయకండి. 

 

వీలైనప్పుడు నేనే వస్తాను ‘ఈ ఇంటి దీపంతో’” అంటూ తను చెప్పాల్సింది అంతా ఎంతో స్థిరంగా చెప్పేసి మరుక్షణం కూడా అక్కడ ఉండకుండా మీనాని తీసుకుని వెళ్ళిపోయాడు బయటికి. 

 

కొనసాగుతుంది…. 

 

ఇప్పుడేం జరగబోతుంది?

మీనాని వినయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు?

తనకు నిజంగానే డివోర్స్ ఇస్తాడా?

 

నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యరా.. అలాగే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..

 

నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…

 

ఇట్లు

మీ కీర్తి💕