పంచమ వేదం – 5
పంచమ వేదం -5
అందరికీ లంచ్ తీస్కొని వచ్చాడు అభి స్టేషన్ లో దిగి…. అందరూ తిందాం అని కూర్చున్నారు…
రేయ్… ఐదు నిమిషాలు వాష్రూమ్ వెళ్ళొస్తా అంటాడు సింహ…
వెళ్ళు రా వెళ్ళు… నాకు కావల్సింది అదే లే…. అనుకుంటాడు వంశీ మనసులో…. అలా అనుకోని కొంచం ఉప్పు తీసి సింహ ప్లేట్ లో ఉన్న పప్పు లో కలుపుతాడు….
రేయ్… ఏం చేస్తున్నావు రా… వాడే ఏం తింటాడు నువ్వు అలా చేస్తే అంటాడు అభి…
ఏ రా అభి… వాడు నన్ను బాత్రూమ్ లోకి పంపినప్పుడు నీకు తెలియలేదు రా… అప్పుడు మాట్లాడని నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావా?? నోరుమూసుకుని కూర్చో బే… అయిన ఏంటి రా ఆ సింహ గాడి మీద అంత ప్రేమ ఎక్కవ అయింది ఆ నీకు?? అంటాడు వంశీ…
ఆలోపు.. సింహ వచ్చి కూర్చొని తిందాం రా అంటాడు…
వంశీ అలా సింహ నీ చూస్తూ… తిను.. తిను.. అనుకుంటూ వుంటాడు మనసులో…
నువ్వు ఏంటి రా అలా చూస్తున్నావ్?? ఏదో చేత బడి చేసే వాడి లాగా…. అటు తిరుగు దిష్టి తగులుతుంది నాకు అంటాడు సింహ…
నువ్వు అయితే ముందు తిను రా అనుకుంటాడు వంశీ…
సింహ ఆ పప్పు నీ తీసి వంశీ ప్లేట్ లో వేసి… నాకు పప్పు నచ్చదు కదా రా నువ్వే తినెయ్యి… పొద్దున నిన్ను బాధ పెట్ట కదా… దానికి నా సారీ ఈ కర్రీ అంటాడు సింహ….
ఛా… ఉప్పు కలిపే తొందరలో వీడికి నచ్చిన కూర లో కలిపేసా అనుకుంటాడు…
తిను నాన్న వంశీ… అలా చూస్తున్నావ్ ఏంటి అంటాడు ధ్రువ….
వంశీ వాడిని చంపేసా లాగా చూస్తాడు…
అరవింద నవ్వుకొని… ఆపండి రా బాబు… తినండి… తినేసి,, నిద్రపోయి లేస్తే ఊరు వస్తుంది…
రేయ్,, ఎప్పడూ నిద్రే నా?? అభి వాళ్ళ ఊరు గురించి తెలుసుకుందాం అంటాడు ధ్రువ…
అవును అభి… మీ ఊరి గురించి చెప్పు అంటాడు సింహ కూడా…
మా ఊరి గురించి చెప్పాలి అంటే… ఒక పెద్ద అడవి ఉంది… ఆ అడవి మొత్తం తిరగాలి అంటే దాదాపు ఒక రోజు పడుతుంది… మామూలు గా అయితే… ఆ అడవి లోకి పెద్దగా ఎవరు పోరు… ఒకవేళ పోయిన కొంచం దూరం పోయి వెన్నకి వచ్చేస్తారు… అడవి లోపలికి కి అసలు పోరు…
ఎందుకు రా అంటాడు అరవింద్…..
ఆ అడవి మధ్యలో ఒక గుడి ఉంది అంట… మా ఊరిలో ఎవరూ కూడా ఆ గుడికి పోరు… సుమారు ఒక వంద సంవత్సరాలు నుండి ఎవరు అటు వైపు పోలేదు కూడా… ఎందుకు అంటే ఆ గుడికి పోవద్దు అని మా ఊరిలో వాళ్ళు అదే మా తాత ముత్తాతలు… వాళ్ళ తరువాత తరాల వాళ్ళకి చెప్తూ వచ్చారూ…. అందుకే వంద సంవత్సరాల నుండి అటు వైపు మనిషి జాడ కూడా లేదు…
కొంప తీసి… ఇప్పుడు నువ్వు ఒకడివే అక్కడకి పోలేక… నువ్వు మమ్మలిని అందరినీ ఆ ఊరికి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత మెల్లగా ఏదో ఒకటి చెప్పి ఆ గుడి దగ్గరకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నావా ఏంటి?? అంటాడు వంశీ…
అమ్మో,, కనిపెట్టేసాడు ఏదో ఒకరి కవర్ చేయాలి అని అనుకుంటూ అభి… అది ఏం లేదు రా…. మామూలు గా చెప్ప…
నీ వాలకం చూస్తు ఉంటే ఏదో తేడా గా అనిపిస్తుంది అంటాడు అరవింద్ కూడా…
ఊరి గురించి చెప్పమంటారు… చెప్పిన తర్వాత ఇలా మాట్లాడతారు… ఇంకా నేను ఏం చెప్పను పోండి అని అంటాడు అభి…
రేయ్… నువ్వు ఏం అయిన కొత్త కోడలివి అనుకుంటున్నావా అలుగుతున్నావ్?? అంటాడు ధ్రువ…
హ్మ్మ్… సరిపోయింది… చెప్పమంటారు చెప్తే ఇలా అంటారు… అంటాడు సింహ…
నీకు ఏంటి రా వాడి మీద ప్రేమ పెరిగిపోయింది అంటాడు అరవింద్…
మరి లేకపోతే,, వాడి మొహం చూస్తే మనల్ని ప్రమాదం లోకి నెట్టే వాడిలాగా కనిపిస్తున్నాడు ఆ వాడు మీకు?? బంగారం రా అభి అంటాడు సింహ…
వంశీ వాడి వైపు అదోలా చూడ్డం గమనించి…. వచ్చే స్టేషన్ లో తినడానికి తెస్తాడు అని అంటాడు సింహ…
ఛీ ఎదవ… అంటాడు అభి….
సింహ నవ్వుతూ… అలా కాదు లే రా… నువ్వు మమ్మలిని ఎందుకు అక్కడకి తీసుకొని వెళ్తావు చెప్పు… వీళ్ళు ఊరికే డౌట్ పడుతున్నారు….
ఇది ఏం అయిన ఈ అభి గాడితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు వంశీ…
ఏంటి రా ఆలోచిస్తున్నావు అంటాడు ధ్రువ…
ఏం లేదు…. ఇంకా ఎంతసేపు అని??
అయిపోయింది ఇంకో రెండు గంటలు లే అంతే…
ఫస్ట్,, వీళ్లలో ఎవడిని ఒప్పించి గుడికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అభి…
To be continued….
don’t forget to leave a comment and follow….
Swipe left/right or tap the sides to turn pages