బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేసిన శ్రీపాద చెయ్యి మూతి కడుక్కొని దానిని శైలు దుపట్టాకే తుడిచి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసాడు.. భర్తని చిరునవ్వుతో చూసి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దేసి ప్లేట్లు తీసుకువెళ్లి సింక్లో వేసింది శైలు.
రఘు రామయ్య గారు వచ్చి..”శైలు కొన్ని నీళ్లు ఇవ్వమ్మా.” అని అల్లుడు పక్కన కూర్చున్నాడు.
“అయిపోయిందా మావయ్య గారు బయట పని.” అని అన్నాడు శ్రీపాద.
“పనివాళ్ళకి మనం పని పురమాయించినప్పుడు అయిపోయింది అనే అనిపిస్తుంది.. కానీ మనం లేకపోతే పనులు సరిగ్గా జరగవు అల్లుడుగారు.” అని అన్నాడు కూతురు తీసుకువచ్చిన నీళ్లు అందుకుంటూ రఘురామయ్య.