రాక్షసప్రేమ-10 రూమ్ లోకి వచ్చిన విరాట్ బాధగా బెడ్ మీద కూర్చుని తన భార్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని నేను నా స్వార్థం కోసం ఆలోచించడం వల్లే కదా ఇలా శౌర్య జీవితం అయిపోయింది రౌద్రా కూడా మరీ ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నాడు రాక్షసంగా తయారయ్యాడు నా స్వార్థం వల్లే కదా అని అన్నాడు.. “కరెక్ట్ గా మీ స్వార్థం అని చెప్పలేను, మీరు స్వతంత్రం కోరుకున్నారు పంజరంలో నుంచి స్వేచ్ఛగా ఎగరాలి అని అన…