రాక్షసప్రేమ-11 “హా పెళ్లి చేసుకుందామని తీసుకొని వెళుతున్నాను” అని శౌర్య వెటకారంగా చెప్పడంతో, అప్పటివరకు ఉన్న కోపం అంతా కూడా దూదిపింజలా ఎగిరిపోయి నిజంగానా అని తన చేతిలో ఉన్న బాల్ ని తన టీమ్ మెట్ అయిన విజయ్ కి క్యాచ్ వేసి తను శౌర్య భుజం చుట్టూ చేతిని వేసే దగ్గరకు లాక్కొని “ఏ గుడికి వెళ్దాం” అని సరదాగా అడిగాడు. “గుడికి కాదు చర్చికి వెళ్దాం” అని మూతి తిప్పుతూ శౌర్య అంటే, …