New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రొమాంటిక్ బీస్ట్ – 3

రొమాంటిక్ బీస్ట్ – 3

రుద్ర అమూల్య వెళ్ళిపోయాక తన పాకెట్ లో సిగరెట్ తీసి వెలిగించుకుని స్మోక్ చెయ్యడం స్టార్ట్ చేశాడు అలా చూస్తూనే మొత్తం ఆ పెట్టీ అంతా కాళీ చేసేసి అక్కడి తన ప్యాంట్ కూడా విప్పేసి కేవలం బాక్సర్స్ మీదే నిద్ర లోకి జారుకున్నాడు రుద్ర 
ఇక్కడ తన రూమ్ లోకి వచ్చిన అమూల్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది 
అప్రయత్నంగా తన ఆలోచనలు గతం లోకి పరుగులు తీసాయి 
తన చిన్నప్పుడే తల్లి చనిపోతే తన మేనత్త దగ్గరుండి తన తండ్రికి రెండవ పెళ్లి చేసింది 
ఆమె ఏనాడైతే అమూల్య జీవితంలోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచే తన జీవితం తలకిందులుగా మారిపోయింది 
తన తండ్రి ముందు తనని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించే ఆవిడ తన తండ్రి లేనప్పుడు మాత్రం తనని పని మనిషి కంటే హీనంగా చూసేది 
••••••••
ఒసేయ్ ఎంతసేపని తింటావ్ ముందు పోయి గిన్నెలు తోము ఇంకా బట్టలుతకాలి ఇల్లు తడి గుడ్డ పెట్టాలి పెద్ద మహారాణివి కదా కూర్చొని మూడు పూట్ల పంది తిన్నట్టు తినడానికి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది తన సవతి తల్లి 
ఆవిడ మాటలకి నోటి దాక పెట్టుకున్నది కూడా తినబుద్ధి కాక ముందు పనులు చేయాలి అని టిఫిన్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి లేచి గిన్నెలు తోమడానికి వెళ్ళింది అమూల్య 
అదే అదునుగా భావించిన తన సవతి తల్లి తను చూడకుండా అమూల్య టిఫిన్ ప్లేట్ లో మట్టి తెచ్చి వేసేసింది 
ఇప్పుడు తినవే ఎలా తింటావో నేను కూడా చూస్తాను అనుకుంటూ క్రూరంగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది 
కొద్దిసేపటికి పనులు అన్ని పూర్తి చేసి అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉంటే టిఫిన్ తినడానికి కూర్చుంది అమూల్య 
పనులన్నీ అయిపోయాయా మహారాణి అడిగింది ఆవిడ అమూల్య వైపు చూస్తూ 
అయిపోయాయి పిన్ని గిన్నెలు తోమేశాను బట్టలు ఉతికి ఆరబెట్టేసాను ఇల్లు మొత్తం తడి గుడ్డ పెట్టేసాను అన్నం ఎసరు పడేసి ఇంకొక వైపు చారు పెట్టాను కొంచెం ఆకలిగా ఉంది తినేసి మిగతా పనులు చూస్తాను అంది అమూల్య 
తిను తల్లి మళ్ళీ నేనేదో నీకు తిండి కూడా పెట్టలేనట్టు ఊర్లో అందరూ అనుకోవడానికా నన్ను అడిగిమరీ తింటున్నావు ప్రతి పూట నన్ను అడిగే తింటున్నావా ఏంటి అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ మూతి తిప్పుకొని అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఆవిడ 
అమూల్య మూత తీసి చూసేసరికి ఉప్మాలో మొత్తం మట్టి ఉండడం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 
దేవుడా నీకు నేనేం పాపం చేశాను తండ్రి ఎందుకు నాకు ఈ జీవితం అనుకుంటూ బాధపడుతూ అది తినలేక డస్ట్ బిన్ లో పడేసి ఆ ప్లేట్లు కూడా తోమేసి వంట పని చూస్తూ ఉంది అమూల్య 
వంట మొత్తం అయిపోయాక ఐటమ్స్ అన్ని బాక్స్ లో కట్టి తన తండ్రి ఆఫీస్ దగ్గరికి బయలుదేరింది అమూల్య 
అమూల్య అలా వెళ్ళగానే తన ఇంటి ముందుకి వచ్చి ఆగింది ఒక పెద్ద పడవ లాంటి కార్ 
తన ఇంటి గుమ్మం ముందు ఆగిన కార్ వైపు చూస్తూ బయటికి వచ్చింది అమూల్య సవతి తల్లి 
కార్ లో నుంచి హుందాగా బయటకి దిగాడు మన రుద్ర బాబు 
రుద్ర వైపు చూస్తూనే అలా ఉండిపోయింది ఆమె 
రుద్ర మాత్రం గేట్ తీసుకొని లోపలికి వచ్చి అమూల్య మీ కూతురేనా అడిగాడు. సూటిగా ఆమె వైపు చూస్తూ 
అవును నా కూతురే ఏమైంది అడిగింది ఆమె అనుమానంగా 
ఇంట్లోకి రావచ్చా అడిగాడు రుద్ర 
రండి బాబు అంటూ రుద్ర లోపలికి రావడానికి అనుమతిని ఇచ్చింది ఆమె 
రుద్ర వచ్చి స్టైల్ గా సోఫాలో కూర్చుని ఎదురుగా ఉన్న ఆమె వైపు చూసాడు 
నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను దానికిగాను మీకు కోటి రూపాయలు ఇస్తాను 
జీవితంలో తనకి మీకు ఎలాంటి సంబంధాలు ఉండకూడదు అది మీకు ఓకే అనుకుంటే రేపు ఇదే టైం కి మళ్లీ వస్తాను మీ కూతుర్ని తీసుకొని వెళ్లడానికి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను ఎంతైనా సవతి తల్లివి కదా నీకు అమూల్య కంటే డబ్బే ముఖ్యమని నాకు తెలుసు నీ మొగుడిని ఆ అమూల్యని ఎలా ఒప్పించుకుంటావో నాకు తెలీదు రేపు ఈ టైంకి వాళ్ళు ఒప్పుకోవాలి నీకు చెప్పినట్టే కోటి రూపాయలు నీకు ఇస్తాను అన్నాడు రుద్ర 
రుద్ర నోటి వెంట కోటి రూపాయలు అనేసరికి నోట మాట రాలేదు ఆమెకి 
ఆమె కళ్ళల్లో డబ్బు ఆశ చూసిన రుద్ర సైడ్ స్మైల్ ఇచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు 
అబ్బా కోటి రూపాయలు అంటే ఎంత డబ్బులో ఏం చేస్తే అంత డబ్బులు వస్తాయి ఎలాగైనా ఆ అమూల్య నీ పంపించేయాలి దాని పీడ పోతుంది కోటి రూపాయలు వస్తాయి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఆమె 
————-Continues……….. 
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ