సీత మొహంలో సంతోషాన్ని చూస్తుంటే ఆవిడ మనసు మండిపోతూ ఉంటుంది. నా కూతురు ఉండాల్సిన స్థానంలో ఈ సీతను తీసుకొచ్చి పెట్టారు.
రోజురోజుకు అందరూ దీని మాయలో పడిపోతున్నారు. ఎలాగైనా ఏదో ఒకటి చేసి దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. అనుకుంటూనే కడుపునిండా తిని వెళ్లిపోతుంది.
రామ్‌ను పిలవడానికి సీత పైకి వెళ్తుంది.
తలనొప్పి తగ్గడంతో రామ్ చిన్నపిల్లాడిలా హాయిగా నిద్రపోతూ ఉంటాడు.
అలా పడుకున్న రామ్‌ను చూసి సీత దగ్గరికి వెళ్లి నెమ్మదిగా లేపుతుంది.
రామ్ నిద్ర లేచి, “ఏంటి?” సీత అని అడుగుతాడు.
సీత మొహమాటంగానే, “భోజనం టైం అయింది. భోజనం తిన్న తర్వాత పడుకుందురుగానీ. అలా పడుకుంటే నిద్ర పట్టదు. మధ్యరాత్రి వేళ ఆకలేస్తుంది” అంటుంది.