New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️ అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం ❤️ – 13

❤️ అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం ❤️ – 13

ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రామ్ పడుకున్నాడు.

 

అలా ఇద్దరూ పడుకున్నాక, సీత నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న రామ్ నెమ్మదిగా తన దగ్గరికి జరిగి, తన మీద చెయ్యి వేసి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.

 

“నిన్ను చాలా అవమానించాను సీత. నిన్ను నేను ఎంత అవమానించినా, నువ్వు మాత్రం నా మీద ఎప్పుడూ కోపం చూపించలేదు. ఆ మాటలు ఇప్పుడు తలుచుకుంటుంటే, నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తుంది.

 

నీ మొహం చూసే ధైర్యం కూడా చేయలేకపోతున్నాను. కానీ, నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అన్న ఆలోచన వస్తే మాత్రం, ఒక్క క్షణం నా ప్రాణం పోతుందా అన్నంత బాధగా అనిపిస్తుంది.

 

నీ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డావు. మీ పిన్ని చేసే పనులకు నువ్వు బలవుతున్నావు.  నిన్ను చిన్నప్పటినుంచి బాధ పెడుతూ, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్లను నేను అస్సలు వదిలిపెట్టను. వాళ్లకు తగిన గుణపాఠం చెబుతాను.

 

నువ్వు ఇంత అమాయకురాలిలా ఉంటే, నిన్ను అందరూ ఇలాగే ఆడుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండాలి. జీవితంలో వచ్చే ప్రతి సమస్యను నువ్వు ఎదుర్కోవాలి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue