వివేక్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి జీప్ స్టార్ట్ చేస్తాడు…
మహి పాపను ఎత్తుకొని జీప్ ఎక్కుతాడు ఏసిపి అబ్బాయి…
ఏ సి పి అబ్బాయికి లోపల చాలా టెన్షన్ గా అనిపిస్తుంది తానే కానీ వివేక్ తో సారీ చెప్పమని పంపించకుండా ఉండి ఉంటే ఇప్పుడు మహికి సిచువేషన్ వచ్చేది కాదు అంతా తన వల్లే ఏమో అని ఫస్ట్ టైం గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది ఏసిపికి…
వివేక్ నువ్వెందుకు రా డాల్ ని కిందకి పంపించావు నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది కదా బావ ఇప్పుడు తనకు ఏదైనా జరిగితే అంటూ జీప్ ని ఇంకా వేగంగా రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు…