New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

జ్వాల W/O శక్తి 🏆Winner · 1st Place

26 stories Completed 🏆Winner · 1st Place Inspirational Suspense Crime

రాత్రి కురిసిన అకాల వర్షానికి వాతావరణం అంతా దట్టమైన పొగమంచుతో, విపరీతమైన చలితో నిండిపోయింది. సమయం తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటల పదిహేను నిమిషాలు అవుతోంది. నగర శివార్లలోని అత్యంత విలాసవంతమైన జె.ఎస్. నివాసం "లావెండర్ విల్లా" ఒక నిశ్శబ్ద సముద్రంలా ఉంది. చుట్టూ ఉన్న చెట్లు గాలికి నెమ్మదిగా కదులుతున్నాయి. ఆ బంగళాలోని ప్రధాన పడకగదిలో మసక వెలుతురు ఉంది. అక్కడ జ్వాల గాఢ నిద్రలో ఉంది. సాధారణంగా ఆమె ముఖంలో ఒక అమాయకత్వం, ప్రశాంతత కనిపిస్తాయి. కానీ ఈ రాత్రి ఆమె అంతఃచేతనలో ఏదో తెలియని అశాంతి, ఒక రకమైన ఆందోళన ఆమెను నిద్రలోనే వెంటాడుతున్నాయి.సరిగ్గా అదే సమయంలో, బెడ్ పక్కనే ఉన్న సైడ్ టేబుల్ మీద ఉన్న ఐఫోన్…

Browse Stories

జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 11

జేఎస్ కార్పొరేషన్ ఆఫీస్ లో ప్రసాద్ ను అవమానించి బయటకు పంపించిన తర్వాత గాని జ్వాల మనసులో ప్రశాంతత   అనేది లేదు. శక్తి లేని ఆ చైర్మన్ సీటు, ఆ క్యాబిన్ ఆమెను  వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి. గోడకు ఉన్న శక్తి ఫోటో వైపు చూస్తూ జ్వాల కన్నీళ్లు పెట్టుకుంది. “శక్తి.. ఈ ఐదేళ్లూ నన్ను మానసికంగా చంపినా నీకోసం భరించాను. కానీ నా ప్రపంచమైన నిన్నే నా నుండి దూరం చేశారు. నిన్ను చంపిన ఆ రాక్షసులను […]

6 min 24 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 12

జేఎస్ కార్పొరేషన్ సామ్రాజ్యంపై జ్వాల తన తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుని, ప్రసాద్ మరియు రుద్రప్పలను సముద్ర తీరంలోని ఆ పాడుబడిన పెంకుటింట్లో సజీవ దహనం చేసిన తర్వాత అంతా ముగిసిపోయిందని భావించింది. ప్రతీకారం తీరిందని, శక్తి ఆత్మకు శాంతి చేకూరిందని ఆమె నమ్మింది. కానీ, వ్యాపార ప్రపంచంలోనూ, ఆ కుటుంబంలోనూ కుట్రలు అంత సులభంగా ముగిసిపోవు. జ్వాల, విక్రమ్‌లకు తెలియని అత్యంత భయంకరమైన నిజం ఏమిటంటే.. శక్తికి ఒకరు కాదు, ఇద్దరు అన్నలు ఉన్నారు. మొదటి అన్న […]

6 min 17 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 13

ఆనంద్ భయంతో వెనక్కి తగ్గుతూ ఒక ఇనుప పైపును తీసుకుని విక్రమ్ పైకి దూకాడు. కానీ విక్రమ్ ఒకే ఒక్క పంచ్‌తో ఆనంద్ ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆనంద్ నోటి నుండి రక్తం వస్తూ కింద పడిపోయాడు. విక్రమ్ ఆనంద్‌ను కాలర్ పట్టుకుని లాక్కొచ్చి జ్వాల కాళ్ల ముందు పడేశాడు. జ్వాల ఆనంద్ వైపు అసహ్యంగా చూసింది. “ఆనంద్.. నువ్వు లండన్ లో కూర్చుని చాలా పెద్ద ప్లాన్ వేసావు. ప్రసాద్‌ను, రుద్రప్పను ముందు పెట్టి […]

6 min 21 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 14

జేఎస్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. శక్తి రెండవ అన్న ఆనంద్ వేర్‌హౌస్ మంటల్లో కాలి బూడిదై మూడు నెలలు గడిచాయి. జ్వాల ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, ఆమె కన్ను అంతర్జాతీయ మార్కెట్ పై పడింది. వాళ్ళ కంపెనీ లీగల్ లాయర్  రఘు రామ్. అందించిన నివేదికల ప్రకారం, జేఎస్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఐరోపా ఖండంలోకి విస్తరించడానికి సిద్ధంగా ఉంది. చైర్మన్ సీట్లో కూర్చున్న జ్వాల నుదుట […]

6 min 11 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 15

లండన్ నగరంలోని ప్రతిష్టాత్మక ‘రోయల్ కాన్ఫరెన్స్ హాల్’ అంతర్జాతీయ బిజినెస్ మేగ్నెట్స్, ఐరోపా ఖండపు లీడింగ్ ఇన్వెస్టర్లు, మరియు వివిధ దేశాల ప్రతినిధులతో కిక్కిరిసిపోయింది. ఐదు వేల కోట్ల రూపాయల విలువైన గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ కాంట్రాక్ట్ తుది టెండర్ ప్రక్రియ ఇక్కడే జరగబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఏ కంపెనీకి దక్కితే.. రాబోయే దశాబ్ద కాలం పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను ఆ సంస్థే శాసిస్తుంది. జేఎస్ కార్పొరేషన్ తరఫున జ్వాల ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి లండన్ […]

6 min 16 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 16

సరిగ్గా రాత్రి 10 గంటలకు, ఆ చీకటిని చీల్చుకుంటూ జ్వాల నడుపుతున్న నల్లటి లగ్జరీ కారు షిప్‌యార్డ్ లోపలికి ప్రవేశించింది. కారు హెడ్‌లైట్ల వెలుతురులో, ఒక పెద్ద క్రేన్‌కు తలకిందులుగా కట్టేసి ఉన్న విక్రమ్ కనిపించాడు అతని శరీరం మొత్తం రక్తసిక్తమై ఉంది. ముఖంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న విక్రమ్‌ను కార్లోస్ అంతర్జాతీయ నెట్‌వర్క్ ఎంత పకడ్బందీగా కిడ్నాప్ చేసి, లండన్ మాఫియా కేంద్రానికి చేర్చిందో ఈ దృశ్యం చూస్తేనే అర్థమవుతోంది.     […]

6 min 17 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 17

లండన్ షిప్‌యార్డ్‌లో కార్లోస్ బోట్ పేలిపోయిన మంటలు నది నీటిపై ఎర్రటి రక్తంలా ప్రతిబింబిస్తున్నాయి. ఆ చలి రాత్రిలో జ్వాల శరీరం మంటల వేడికి కాదు, విక్రమ్ చెప్పిన ఆ నమ్మశక్యం కాని నిజానికి గడ్డకట్టుకుపోయింది. ఐదేళ్ల పాటు తన అన్నంలో స్లో పాయిజన్ కలిపి, తన మాతృత్వాన్ని కాలరాసి, చివరకు తన భర్త శక్తి మరణానికి కారణమైన ఆ క్రూరమైన  ప్రమీల బతికే ఉందా? సముద్ర తీరంలోని ఆ సేఫ్ హౌస్ మంటల్లో ప్రసాద్‌తో పాటు […]

6 min 22 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 18

రాయల్ హాల్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. శత్రువును చట్టం ముందు నిలబెట్టడంతో పాటు, శారీ కట్టుకుని కూడా తుపాకీ పట్టి శత్రువును మట్టికరిపించిన జ్వాల ధీరత్వం చూసి విదేశీయులు నోరెళ్లబెట్టారు. వెంటనే విక్రమ్ మరియు లండన్ పోలీసులు హాల్లోకి దూసుకొచ్చారు. ఇంటర్‌పోల్ అధికారులు ప్రమీల చేతులకు బేడీలు వేశారు. జ్వాల రక్తం కారుతున్న ప్రమీల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి, ఆమె కళ్లల్లోకి చూసి అంది, “ప్రమీలా.. నా గర్భాన్ని నాశనం చేసినప్పుడు, నా భర్తను చంపినప్పుడు […]

6 min 24 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 19

      పాప ను సేఫ్ ప్లేస్ లో ఉంచి జ్వాల శేషావతారం దగ్గరకు నడుచుకుంటూ వెళ్లింది. వాడు నొప్పితో కింద పడి వెనక్కి దొర్లుతున్నాడు. జ్వాల వాడి కాలర్ పట్టుకుని గట్టిగా పైకి లేపి, ఫౌండేషన్ పిల్లల సాక్షిగా వాడి ముఖంపై వరుసగా పంచ్‌లు కొట్టింది. వాడి పళ్ళు రాలి రక్తం బయటకు వచ్చింది.   జేఎస్ ఫౌండేషన్ లోపల ఆడిటోరియం స్తంభానికి శేషావతారం గట్టిగా కట్టేసి ఉన్నాడు. ఒకప్పుడు ఇల్లీగల్ మాఫియాను, దారుణమైన కెమికల్స్ […]

6 min 16 views
జ్వాల W/O శక్తి Premium

జ్వాల W/O శక్తి – 20

శేషావతారం అంతంతో భారతదేశంలో ఫిజికల్ మాఫియా నెట్‌వర్క్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జేఎస్ ఫౌండేషన్‌లోని అనాథ పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. కానీ, జ్వాలాకు విశ్రాంతి దొరకలేదు. శత్రువు ఈసారి తుపాకీలతోనో, బాంబులతోనో రాలేదు. కంటికి కనిపించని డిజిటల్ ప్రపంచంలో, సరిహద్దులు లేని ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా జేఎస్ సామ్రాజ్యంపై దాడి ప్రారంభమైంది. లండన్ జైలులో ఉన్న ప్రమీల జైలుకు వెళ్లే ముందే యూరప్‌లోనే అత్యంత ప్రమాదకరమైన, డార్క్ వెబ్  కింగ్, సైబర్ క్రిమినల్స్ హెడ్ ‘రాగ్నర్’ కు భారీ […]

6 min 15 views