New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆమె మనసులో.. సీత కథ

20 stories Ongoing Love Family Drama

ఆ రాత్రి, విజయవాడలోని వారి చిన్న ఇంటి బెడ్‌ రూమ్‌ లో, చంద్రకాంతి వెన్నెల వెండి కిరణాలు జాలువారుతూ కిటికీ గుండా చొచ్చుకుపోతున్నాయి. గదిలోని గాలి మందంగా, మధురమైన గులాబీల సువాసనతో నిండిపోయింది.సీత.. పేరుకు తగ్గట్టు సౌమ్యత, సహనం, ప్రేమ అన్నీ.. ఆ సీతమ్మ తల్లిలోని అన్ని లక్షణాలను పుణికి పుచ్చుకుంది. ఆమెకు 30 ఏళ్ల వయసు, కానీ ఇంకా 18 ఏళ్ల అమ్మాయిలా కాంతివంతంగా, మృదువుగా కనిపిస్తుంది. ఆమె పక్కనే రవి.. తన భర్త. అతని వయసు 35 ఏళ్లు. బలమైన శరీరం, కళ్లలో సౌమ్యత, సహనం, ప్రేమ అన్నిటికంటే ఆమె పట్ల అపారమైన ప్రేమ, ఆప్యాయత.రవి పక్కనే పడుకుని ఉంది సీత. రవి ఆమెను మెల్లగా తన ఒడిలోకి లాక్కున్నాడు.…

Browse Stories

ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 20

సీత దుర్గ ను, వాళ్ళ అమ్మమ్మ ను తల్లిగా అనుకుని అమాయకంగా ఉంటున్న సమయంలో పక్కింటి నుంచి విషం చిమ్మడంతో తనలో కొత్త కొత్త అనుమానాలు కలిగి వాళ్ళ అమ్మమ్మను అడిగి ఏడ్చింది  ఇంతలో దుర్గ అక్కడికి వచ్చి తనకంత అర్థమయ్యేలా చెప్పేసరికి చివరగా తన అడిగిన ప్రశ్నకి అందరితోపాటు దుర్గ కూడా షాక్ అయింది.    ***   దుర్గ చెప్పింది అంతా విన్న తర్వాత సీత నవ్వుతూ ఆమె గట్టిగా కౌగిలించుకుంది. కాసేపటి తర్వాత.. […]

3 min 6 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 19

లక్ష్మీ తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రోజురోజుకీ బాధ్యత హీనంగా తయారవుతున్న భర్తను మార్చుకోవడానికై కూతురు కు దూరంగా ఉన్నా సరే పుట్టింటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాలంతో పాటే సీత కూడా ఎదుగుతూ వచ్చింది.    ***   సీత ఆ పక్కింటి ఆంటీ చెప్పినది అంతా తన అమ్మమ్మ కి ఏడుస్తూ చెప్పింది. సీత మాటలు విన్న ఆవిడ మనసులోనే అమ్మనా బాతులు తిట్టుకుంది ఆ పక్కింటి ఆంటీ ను..   అంత […]

3 min 10 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 18

దుర్గ కి వాళ్ళ తల్లికి జరుగుతున్న ఘర్షణలో అనుకోకుండా ఒక్కసారిగా ఉయ్యాల దగ్గరికి వెళ్లి, సీత అని పిలిచేసరికి అందరిలో లేనిపోని అనుమానాలు కలిగాయి. చివరికి దుర్గ అమ్మ నే లక్ష్మీ అత్తగారి చెప్పిన వాటిని వివరిస్తూ సీత అనే పేరుకి అర్థం చెప్పేసరికి అందరూ చూస్తూ ఉండిపోయారు.    ***   అలా విధి వల్ల, విధాత రాసిన రాత వల్ల అనుకోకుండా తన తల్లి నుంచి తనను దూరం చేయడమే కాకుండా.. తోడబుట్టిన వాడి […]

3 min 13 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 17

లక్ష్మీ కూతురు సీతకి తల్లి తండ్రి ఎదురుగా ఉన్నా కూడా పిన్ని దుర్గ, అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరగాల్సి వచ్చింది. తన బాధ్యతను దుర్గ తీసుకొననే సరికి మిగిలిన అక్క చెల్లెలు ఏదో అనుమానం వ్యక్తం చేయబోతే వారిలో పెద్ద కూతురైన ఆమె తెలివిగా ఏమీ లేదన్నట్టు మాట మార్చింది ఆ నిమిషానికి ఆ విషయాన్ని మరిచిపోయి అందరూ ఆ పాప సంబరంలో పండగ చేసుకుంటుండగా మధ్యలో లక్ష్మీ వాళ్ళ అమ్మ వచ్చి అసలు ఏం జరిగిందో […]

3 min 13 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 16

ఆ పాపకి పేరు పెట్టే సమయానికి ఇంట్లో చిన్న రభస లాంటిది జరుగగా.. చివరికి లక్ష్మీ చెల్లి గబగబా వెళ్లి పాపకు సీత అని పేరు పెట్టింది. ఆ పేరు వినేసరికి అందరూ షాక్ అయ్యారు. లక్ష్మి ఇదేంటి అని అడిగేసరికి తనను ఒక పక్క తిడుతూనే.. మళ్ళీ నీకు భయం లేదన్నట్టు భరోసానిచ్చారు తండ్రి కూతుర్లు. అది చూసి మిగిలిన వారందరికీ కొత్త అనుమానాలు కలిగాయి.    ***   వాళ్లందరూ అడుగుతూ మధ్యలో ఆగిపోయిన […]

3 min 11 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 15

లక్ష్మికి కాన్పు విషయంలో సీరియస్ అవడంతో.. అప్పుడే పుట్టిన పసికందును ఆమె తల్లిదండ్రులు తమ వద్ద నే ఉంచుకోవాలి అని అనుకున్నారు. పాప కి పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఇంట్లో కొద్ది పాటి గొడవ జరగగా.. ఆ బుడ్డాగాడి అల్లరితో మళ్ళీ అందరూ నార్మల్ అయిపోయారు.   ***   ఉన్నట్టుండి ఆమె, ఆ పాపకి సీత అని పేరు ఎందుకు పెట్టిందొ ఎవ్వరికి అర్థం కాలేదు. అడగాలి అంటే భయం.. తండ్రి ఎటూ ఆమెను […]

3 min 14 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 14

లక్ష్మీ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నీరసంగా ఉండే సరికి, చిన్న పాపను ఎలా చూసుకుంటుంది అనే ఉద్దేశంతో లక్ష్మి తల్లిదండ్రులు, ఆ ఇంటిలో పెళ్ళి చేసుకోకుండా ఉన్న ఆ అమ్మాయి కలిసి ఆ పుట్టిన పసికందును వాళ్ళే పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు.   ***   లక్ష్మీ తల్లిదండ్రులు అందరికీ పెళ్లిళ్లు చేస్తున్నపుడు వాళ్ళ కష్టం గమనించి.. చివరగా ఉన్న తమ్ముడు చేతికి అందివచ్చే వరకు తాను ( లక్ష్మి చెల్లి ) […]

3 min 14 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 13

కొన్ని రోజులకు లక్ష్మి ని, పాప ను తీసుకొని ఇంటికి చేరుకున్నారు లక్ష్మీ కుటుంబం అంతా.. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక వైపు పసిపాప ఆలనా పాలనలో రోజులు గడుస్తుంటే.. మరొకవైపు ఆ పసిపాప అన్న బుడ్డ గాడి ఊసులతో ఇల్లంతా సందడిగా మారింది. ఇంతలో అనుకోకుండా లక్ష్మికి సీరియస్ అవడంతో అనుకోకుండా ఆమెకు ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది..   ***   ఆపరేషన్ అయిన తర్వాత కూడా లక్ష్మీ చాలా నీరసంగా ఉంది. అందుకే ఇంక […]

3 min 10 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 12

లక్ష్మీ తల్లి దండ్రులు ఎదురు తిరిగి మాట్లాడేసరికి.. రాము వాళ్ళ అమ్మ శాపనార్ధాలు, శోఖాండలు పెడుతూ.. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంక వీళ్ళు అంతా సంతోషంతో ఊపిరి తీసుకున్నారు. ఆ బుడ్డాగాడి ఊసులతో అందరూ రాము వాళ్ళ అమ్మ మాటలను పట్టించుకునే స్థితిలో లేరు..   ***   మన బుడ్డాగాడు అందరితో సంతోషంగా ఉండటమే కాకుండా.. ఎవరు ఏది తినమని ఇచ్చినా కూడా తీసుకుని.. “మా చెల్లికి ఏది?” అని అడిగేవాడు.   “ఓరి బడవా! […]

3 min 15 views
ఆమె మనసులో.. సీత కథ Premium

ఆమె మనసులో.. సీత కథ – 11

అప్పుడే పుట్టిన పసికందును చూసి రాము వాళ్ళ అమ్మ అంటున్న మాటలు అప్పుడే అక్కడికి వస్తున్న లక్ష్మీ వాళ్ళ నాన్న చెవిన పడ్డాయి.. ఆ పెద్దాయన అప్పటి వరకు ఆపుకున్న కోపమును ఇంక ఒక్క నిమిషం కాదు కదా ఒక్క సెకండ్ కూడా ఆ మాటలను, ఆ మనిషిని చూస్తూ ఉండలేకపోయాడు. అందుకే లక్ష్మీ తల్లి దండ్రులు ఇద్దరూ ఆవిడను గట్టిగానే నిలదీశారు..   ***   రాము వాళ్ళ అమ్మ అడిగిన ప్రశ్నకు లక్ష్మీ తల్లి […]

3 min 10 views