New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనమే ని భాష

48 stories Ongoing Love Family Drama Suspense

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్‌గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.కిటికీ తెరలు జరిపి బయటకు చూసింది. తెల్లవారుజామున వచ్చే ఆ చల్లటి గాలి శ్రావణి ముఖాన్ని తాకినప్పుడు ఆమె పెదవుల మీద ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది. అది కేవలం ఆమెకు, ఆ ప్రకృతికి మాత్రమే తెలిసిన రహస్యం. గది మూలన ఉన్న చిన్న అల్మారాలో…

Browse Stories

మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 18

బెంగళూరు హోటల్ గదిలో ఆ రాత్రి వంశీకి నిద్ర పట్టలేదు. శ్రావణి డైరీలోని ఆ అక్షరాలు అతని కళ్లముందు కన్నీటి చుక్కల్లా మెరుస్తున్నాయి.    ఆ బావ పెట్టిన హింస, చదువుకోవాలనే ఆమె తపన.. అన్నీ చదివాక అతని గుండె బరువెక్కింది.    ఆ రాత్రికి డైరీ మూసివేసి, ఆమె జ్ఞాపకాలను గుండెల్లో అదిమి పట్టుకుని నిద్రలోకి జారుకున్నాడు.   తర్వాతి పది రోజులు బెంగళూరులో వంశీకి చాలా బిజీగా గడిచాయి. పగలు ఆఫీస్ పనులతో తీరిక […]

3 min 81 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 17

అలా కాసేపు మాట్లాడుకుని ఇద్దరూ ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. శ్రావణి తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది.   ఈ ఇల్లు కొత్తదైనా, లోపల ఉన్న మనిషి పాతదే, ఆ మనిషి మోస్తున్న బాధ కూడా పాతదే.    తన కొత్త డైరీ తీసి, ఆరోజు జరిగిన విశేషాలను రాసుకుంటూ నిద్రకు ఉపక్రమించింది.   బెంగళూరు నగరం వర్షంలో తడిసి ముద్దవుతోంది. కిటికీ అద్దాల మీద పడుతున్న వర్షపు చుక్కలు నిశ్శబ్దంగా జారిపోతున్నాయి.    హోటల్ గదిలోని […]

3 min 82 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 16

శ్రావణికి ఒక మంచి భవిష్యత్తు దొరికే అవకాశం వచ్చినా, ఆ దుర్మార్గులు దాన్ని కాజేశారని అర్థమైంది.   పార్కులో చీకటి పడుతోంది. వంశీ ఆ డైరీని గుండెలకు హత్తుకున్నాడు. శ్రావణి చిన్నప్పుడు అనుభవించిన ఈ నరకం, ఆమెను ఇప్పుడు ఎంతలా మార్చి ఉంటుందో అతనికి అర్థమైంది.   ఎక్కడున్నావు శ్రావణీ? నీ గతాన్ని నేను మర్చలేను కానీ, నీ వర్తమానాన్ని నేను మార్చగలనా? అని ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్చాడు.   పార్కులో చీకటి గాఢమవుతోంది. ఆకాశంలో […]

3 min 86 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 15

ఆరోజు వంశీకి ఆఫీసులో అస్సలు ఏకాగ్రత కుదరలేదు. ఎప్పుడెప్పుడు ఆ డైరీని తెరుద్దామా, ఆ శ్రావణి జీవితంలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం అని అతని మనసు ఉవ్విళ్లూరుతోంది.   కానీ బ్యాగ్ లో ఉన్న ఆ పుస్తకాన్ని తీయడానికి ఒక్క క్షణం కూడా ఖాళీ దొరకలేదు.   ఆఫీస్ వర్క్ ఒత్తిడి ఒకవైపు, తన చుట్టూ ఉండే కొలీగ్స్ హడావిడి మరోవైపు.మధ్యాహ్నం లంచ్ టైమ్ అయింది.   హమ్మయ్య.. ఇప్పుడు చదువుకోవచ్చు అనుకుని వంశీ […]

4 min 86 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 14

ఆఫీసులో కీబోర్డ్ శబ్దాలు, ఫైళ్ల హడావిడి మధ్య శ్రావణి మనసు మాత్రం నిలకడగా లేదు.    ఇంటి ఓనర్ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పక్కనే కూర్చున్న స్నేహకు శ్రావణి ముఖంలో కనిపిస్తున్న దిగులు అర్థమైంది.   ఏమైంది శ్రావణి,ఇంకా ఆ ఇల్లు గురించే ఆలోచిస్తున్నావా. నేను కూడా వెతుకుతున్నాను, కానీ ఆఫీస్ కి దగ్గర్లో ఏదీ దొరకడం లేదు అంది స్నేహ ఆందోళనగా.   శ్రావణి ఒక నిట్టూర్పు విడిచి, అవును […]

3 min 86 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 13

గదిలో ఒంటరిగా కూర్చున్న శ్రావణి చేతిలో ఉన్న ఆ కొత్త డైరీ తెల్లటి పేజీలు తనని వెక్కిరిస్తున్నట్టు ఉన్నాయి.   పాత డైరీ పోయిన బాధ తనని లోలోపల కలిచివేస్తోంది. కళ్లు మూసుకోగానే ఆ పాత డైరీలోని అక్షరాలు, తన తల్లిదండ్రుల జ్ఞాపకాలు ఒకదాని తర్వాత ఒకటి కళ్లముందు కదలాడుతున్నాయి.    కానీ ఆ జ్ఞాపకాల పొరల మధ్య నుండి ఒక కొత్త వ్యక్తి జ్ఞాపకం వస్తోంది.నెమ్మదిగా పెన్ను పట్టి ఆ కొత్త డైరీలో ఇలా రాయడం […]

4 min 82 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 12

మాధవ్ తో ఆ సాయంత్రం జరిగిన చర్చ తర్వాత వంశీ ఇంటికి చేరుకున్నాడు.    ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. వంటగదిలో వాళ్ళ అమ్మ సరస్వతి గారు ఏదో పనిలో నిమగ్నమై ఉన్నారు.   తండ్రి, తమ్ముడు ఏదో పని మీద బయటకు వెళ్ళారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వంశీకి కలిసి వచ్చింది. అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్లి, తలుపు వేసుకున్నాడు.   వంశీకి ఇప్పుడు ఆ డైరీని చదవడం ఒక బాధ్యతగా, ఒక మధురమైన […]

4 min 86 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 11

సంధ్యా సమయం ఆకాశం మెల్లగా రంగులు మారుతోంది. వంశీ, మాధవ్ ఇద్దరూ ఒక చెరువు గట్టు పక్కన కూర్చుని ఉన్నారు.    వంశీ మనసంతా ఆ గదిలో వదిలేసి వచ్చిన ఆ పాత డైరీ మీదనే ఉంది.మాధవ్ తన స్నేహితుడి ముఖంలో ఉన్న గాంభీర్యాన్ని చూసి మెల్లగా అడిగాడు.   అవును వంశీ. ఇంతకీ ఆ డైరీలో ఆ అమ్మాయి పేరు ఏం రాసుకుంది,అసలు తను ఎవరు..   వంశీ నిట్టూర్పు విడిచి, అదే పెద్ద సమస్య […]

3 min 84 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 10

నాన్న  నీకు కవిత్వం అంటే ఇష్టం కదా, నీ కూతురు రాసిన ఈ మాటలు బాగున్నాయని ఒక్కసారి నా కలల్లోకి వచ్చి చెప్పవా….   వంశీ ఆ అక్షరాలను చదువుతుంటే అతని కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ డైరీ పేజీ మీద ఆమె చిన్నప్పుడు పెన్నుతో వేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు,    ఆమె వేదన చూస్తుంటే వంశీకి ఆమెను ఇప్పుడే వెళ్లి గట్టిగా హత్తుకుని నేనున్నాను నీకు తోడుగా అని చెప్పాలనిపించింది.   ఎంతటి ధైర్యం […]

3 min 92 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 9

మరుసటి రోజు వంశీ ఆఫీస్ కి వెళ్ళాడు.కానీ వంశీకి ఆ రోజు ఆఫీసులో మనసు అసలు కుదురుగా లేదు. తన టీమ్ మెంబర్స్ ఏదో అడుగుతున్నా,     బాస్ ఏదో చెప్తున్నా అతని కళ్ల ముందు మాత్రం ఆ పాత డైరీ అక్షరాలే కదులుతున్నాయి. ఒక చిన్న పాప అంతటి నరకాన్ని ఎలా భరించింది అన్న ప్రశ్న అతన్ని వేధిస్తోంది.   సాయంత్రం ఆరు గంటల వరకు ఆగలేకపోయాడు. ఒక ఇంపార్టెంట్ పని ఉందని అబద్ధం […]

3 min 96 views