మౌనమే ని భాష – 48
శ్రావణి ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంతవరకు భయంతో, ఒంటరితనంతో నిండిన ఆ గదులు ఇప్పుడు సరస్వతి గారి మాతృత్వపు పరిమళంతో నిండిపోయాయి. శ్రావణి గుండెల్లో గడ్డకట్టుకుపోయిన బాధ మెల్లమెల్లగా కరుగుతోంది. సరస్వతి గారు సోఫాలో కూర్చుని శ్రావణిని దగ్గరకు తీసుకున్నారు. శ్రావణి కళ్లలో నీళ్లు తిరుగుతుండటం చూసి ఆవిడ మనసు తల్లడిల్లిపోయింది. చూడు శ్రావణీ.. నువ్వు ఒంటరి దానివి అని ఎప్పుడూ అనుకోకు. నీకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఈ ఆంటీ […]