మౌనమే ని భాష – 8
ఆ రాత్రంతా శ్రావణికి కంటిమీద కునుకు లేదు. కొత్త డైరీలో రాసిన ఆ నాలుగు ముక్కలు ఆమెలోని ఆవేదనను తగ్గించలేకపోయాయి. తెల్లవారుజామునే నిద్రలేచి, గదిలో ఉన్న వెలుతురును చూసి ఆమెకు ఎందుకో భయం వేసింది. తన సర్వస్వం అయిన ఆ డైరీ ఇప్పుడు, ఏ అపరిచితుడి చేతుల్లో ఉందో అన్న ఆలోచన ఆమెను నిముషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఆ రోజు శ్రావణి ఆఫీస్కు గంట ముందే బయలుదేరింది. ఆశ చావలేదు. […]