New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Crazy ప్రేమమ్ – 5

Crazy ప్రేమమ్ – 5

 

 

 

 

తల్లీ గొంతు కాదని ఇట్టే పట్టేసిన శివ్.. “ హలో ఎవరూ..?? “ గంభీరంగా అడిగాడు.

 

“నేను ఆముక్త..!!”

 

“ ఏ ముక్త..?? “ పొట్టలో ఉన్న రెండు బీర్స్ డాన్స్ వేస్తుంటే నాలిక మీద ఉన్న అక్షరాలు గింగిరాలు తిరిగాయి శివ్ నోట్లో..

 

“ఆముక్త.. ఉదయం..మీ ఫ్లాట్..!!” అని ముక్కలు ముక్కలు చేసి ఆమె చెప్తున్న సెంటెన్స్ మొత్తాన్ని ఓకే ఫార్మాట్ లో కలుపుకుంటున్న శివ్ కి..

 

 

ఆ పేరు ఎక్కడో విన్నట్టు అనిపించి ఆలోచిస్తుండగా మార్నింగ్ వాళ్ళ అమ్మ పిలిచిన పేరు, తన షర్ట్ పాడు చేసిన అమ్మాయి గుర్తొచ్చి..

 

 

“ఓహ్.. మార్నింగ్ ఫ్లాట్ కి వచ్చింది నువ్వే కదా..??” డౌట్ గా అడిగాడు శివ్.

 

“హ అవును..!!”

 

“మా అమ్మ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేశావేంటి..??” కళ్ళు చిన్నవి చేసి అడిగాడు శివ్.

 

 

ఈలోగా ప్రసాదం తీసుకుని వచ్చేస్తున్న అనసూయ గారు కనబడి “ఒక్క నిమిషం..!!” అని శివ్ తో చెప్పి..

 

 

“ఆంటీ మీకు ఫోన్..!!” అని అనసూయ చేతిలో పెట్టి మెల్లిగా తాను ముందుకు నడిచింది ఆముక్త.

 

ఫోన్ లో శివ్ గొంతు విని వెళ్తున్న అముక్తకి గాల్లోనే మెటికలు విరుస్తూ.. “ఎంత సంస్కారమో అమ్మాయికి..!!” అనుకున్న అనసూయ..

 

 

కొడుకుతో మాట్లాడి, త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఆముక్త దగ్గరికి వెళ్ళింది.

 

తర్వాత వాళ్లిద్దరూ ఇంటికి వెళ్ళిపోతే.. శివ్ కూడా తను వెళ్తున్నట్టు ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసి స్టార్ట్ అయ్యాడు.

 

@@@

 

 

ఆముక్త వచ్చేసరికి సుకన్య గారు కిచెన్ లో ఉంటే.. శివరాం టీవీ రూమ్ లో కూర్చున్నారు.. సంయుక్త ఇంకా ఇంటికి రాలేదు.

 

 

“వచ్చేసావా అమ్ము.. రా ఇలా పిండి కలిపి పెట్టేసాను కొంచెం త్వరగా చపాతీలు చేసివ్వు..!!” కర్రీ చేస్తూనే చెప్పింది సుకన్య.

 

 

“హ పిన్ని ఒక్క నిమిషం..!!” అంటూ పూల సజ్జ దేవుని గదిలో పెట్టేసి వచ్చి పిన్నికి హెల్ప్ చేయడంలో బిజీ అయింది ఆముక్త.

 

మాటల్లో తాను ఆరోజు ఇచ్చిన రెండు ఇంటర్వ్యూస్ కంపెనీ వివరాలు చెప్తూ.. గబా గబా చపాతీలు చేసేస్తుంటే.. అవన్నీ వింటూనే ఆవిడ పనిలో ఆవిడ పడింది సుకన్య.

 

అరగంట తర్వాత వంట పూర్తి చేసుకుని సుకన్య ఫ్రెష్ అవడానికి వెళ్తే.. కాళ్ళు చేతులు కడుక్కుని ఆకాశదీపం పెట్టడానికి టెర్రస్ మీదకి వెళ్ళింది అముక్త.

 

దీపం వెలిగించి కళ్ళు మూసుకుని దేవునికి దండం పెట్టుకున్న ఆముక్త చందమామను చూస్తూ మనసులో కోరిక చంద్రునికి చెప్తుండగా..

 

“హ అమ్మా వస్తున్నానే.. ఐదు నిమిషాలు..!!” అని వినిపించిన సౌండ్ కి కళ్ళు తిప్పి చూస్తే ఎదురుగా మరోవైపు చివరి గోడకు ఆనుకుని కనిపించాడు శివ్..

 

చేతిలోని సిగరెట్ చాలా స్పీడ్ స్పీడ్ గా పఫ్స్ లాగేస్తూ..”అమ్మా నేను ఆల్రెడీ వచ్చేసా.. ఇక మళ్ళీ బయటకు వెళ్ళను.. అంతగా కావాలంటే ఆర్డర్ చేస్తాలే..!!” అంటూ ఆముక్త చూస్తుండగానే..

 

 

గట్టిగట్టిగా రెండు సిగరెట్ పీకలని బూడిద చేసిన శివ్.. మౌత్ ఫ్రెషనర్ తో నోట్లో సిగరెట్ స్మెల్ మాత్రమే కాదు బీర్ స్మెల్ కూడా రాకుండా జాగ్రత్త పడి, పర్ఫెక్ట్ అనుకున్నాక కిందకి నడిచాడు తొందర తొందరగా..

 

ఆ తొందరలో ఆముక్త శివ్ చూస్తుందని తను చూసుకోలేడు.. ఆమెని శివ్ చూడలేడు.

 

అమ్ము మాత్రం కళ్ళు పత్తిగింజల్లా చేసుకుని, నోరేళ్లబెట్టుకుని మరీ చూస్తుంది శివ్ చేసే అరాచకాలని..

 

శివ్ వెళ్ళగానే మళ్ళీ ఆకాశంలోకి చూస్తూ తన పూజ కంటిన్యూ చేసుకుంటున్న ఆమెకి ఈసారి వాళ్ళ కమ్యూనిటీ లోకి ఎంటర్ అవుతున్న బైక్, ఆ బైక్ మీద ఉన్న అబ్బాయి, ఆ అబ్బాయితో క్లోజ్ గా కూర్చున్న సంయుక్త కనబడి.. చిన్నగా నిట్టూరుస్తూ..

 

 

“ ప్చ్, ఈ సంయుకి ఎన్నిసార్లు చెప్పినా అస్సల్ బుద్ది రావట్లేదు..!!” ఆనుకుని చెల్లి బైక్ దిగి లిఫ్ట్ వైపు రావడం, ఆ బైక్ గేట్ దాటి వెళ్లెవరకూ చూసి, కిందకి వచ్చేసింది ఆముక్త.

 

 

తాను వచ్చేసరికి సంయుక్త కూడా పైకి వచ్చేయడంతో.. సంయుతో మాట్లాడుతూనే ఇంట్లోకి వెళ్ళింది ఆముక్త.

 

“ఎప్పటిలానే సంయుకి తనని డ్రాప్ చేసిన వాడికి ఎక్కువ చనువు ఇవ్వొద్దు అని ఆముక్త చెప్తే.. సంయుక్త కూడా ఎప్పటిలానే ఇట్స్ నాన్ యువర్ బిజినెస్ అమ్ము.. అగైన్ డోంట్ ఇరిటేట్ మి..!!” అని కాస్త కరుగ్గానే చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయింది.

 

 

రెండు రోజులైనా అమ్ము ఇచ్చిన ఇంటర్వ్యూస్ నుండి ఎలాంటి కాల్, మెయిల్ రాలేదు.. కానీ డిసప్పోయింట్ అవ్వలేదు అమ్ము అది అలవాటే కాబట్టి..

 

అన్ని రౌండ్స్ బానే నెట్టుకోస్తుంది కానీ తనకి జాబ్ రావట్లేదు అదెందుకో కూడా తెలుసు తనకి.

 

మూడు రోజులుగా అనసూయ గారితో కలిసి గుడికి వెళ్లడం అలవాటైనా అముక్త ఆరోజు ఎందుకో ఇంకా బయటకు రాని అనసూయ గారి కోసం ఎదురు చూస్తూ..తనే వెళ్లి కాలింగ్ బెల్ కొట్టింది.

 

 

లోపల నుండి ఒక అమ్మాయి వచ్చి డోర్ ఓపెన్ చేసింది కాసేపటికి.. జీన్స్ అండ్ స్లీవ్ లెస్ టాప్ వేసుకుని, లూస్ హెయిర్ తో లుక్ వాయిస్ గా పోర్ష్ గా ఉన్నా వయసు 18 కూడా ఉండదేమో అన్నట్టు ఉంది.

 

“హలో ఎస్క్యూజ్ మి హు అర్ యూ..?” డోర్ కొట్టి ఏం మాట్లాడకుండా బొమ్మలా నిలబడిన ఆముక్తని విసుగ్గా చూస్తూ అడిగింది ఆ అమ్మాయి.

 

 

“నిక్కీ ఫాస్ట్.. ఐ కాంట్ వెయిట్..!!” లోపల నుండి శివ్ గొంతు క్లియర్ గా వినిపించవినిపించింది..

 

@@@@

 

continued..