New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. ప్రవరాఖ్యుడు – 17

Mr. ప్రవరాఖ్యుడు – 17

హీరా ఎర్లీ గా లేచి రెడీ అవుతు ఉంటుంది…. హేయ్ పిచ్చి ఏంటే దెయ్యం పట్టిందా…??  పొద్దు పొద్దున్నే ఎక్కడికి రెడీ అవుతున్నావ్ ?? కనీసం 8 కూడా అవ్వలేదు …అని అప్పుడే లేచిన షాలు అయోమయంగా అడుగుతుంది. 

 

ఏం లేదే నేను లైబ్రరీ కి వెళ్తున్న …. ఒక ఇంపార్టెంట్ బుక్ కోసం…నువ్వు టిఫిన్ చేసి కాలేజ్ కి వచ్చేయ్ అని బొట్టు పెట్టుకుని ఎలా ఉన్నాను అని అడిగింది. నిజం చెప్పు నువ్వు రిషి సార్ కోసం వెళ్తున్నావ్ కదా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా  అడిగింది షాలు. ‘ వామ్మో దీనికి అర్థమైపోయింది ..ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి ?? అని ఆలోచిస్తూ ఉంటే అంత చించకు .. మూసుకుని వెయిట్ చెయ్యి నేను కూడా రెడీ అయ్యాక టిఫిన్ చేసి వెళ్దాం అని లేచి తాపీగా బ్లాంకెట్ మడత పెట్టుకుంటు సాంగ్ సింగుతుంది షాలు. కావాలనే చేస్తుంది ఇది అని పళ్ళు నూరుతూ ” అబ్బా…నేను బుక్ కోసం వెళ్తున్న షాలు..రిషి సార్ ఇంత ఎర్లీ గా ఎందుకొస్తారు చెప్పు” అని కన్విన్స్ చేయడానికి చూస్తుంటే ” ఓకె ఏం బుక్ కోసం వెళ్తున్నావ్ నువ్వు?” అని అడిగింది. 

 

హీరా కొంచెం సిగ్గు పడుతూ “అదేనే THE LOVE HYPOTHESIS అని ఇంగ్లీష్ స్టోరీ…. రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ…దానికోసమే వెళ్తున్న” అని చెప్తుంది. 

 

వామ్మో నీలో ఈ కళలు కూడా ఉన్నాయా హీరు….ఎంత అమాయకంగా డీసెంట్ గా కనిపిస్తావో తెలుసా పైగా ర్యాంకింగ్ స్టూడెంట్…నువ్వు ఇలాంటివి చదువుతావంటే ఎవరు నమ్మరు అని ఆశ్చర్యంగా నోటి మీద చెయ్యి వేసుకుని అంది షాలు. హేయ్ ఎక్కడ ఎలా ఉండాలో నాకు తెలుసు 😏… అమ్మాయి అయితే ఇలాంటివి చదవకూడదు అని రూల్ ఉందా…?? లేక చదివితే పాపమా?? పైగా …లైఫ్ లో లవ్ అలాగే రొమాన్స్ రెండు ముఖ్యమే… రొమాన్స్ అనేది పార్ట్నర్స్ మధ్య ప్రేమ నీ పెంచడానికి మెయిన్ రోల్. ఇది తప్పేమీ కాదు…కానీ సరైన లైఫ్ పార్ట్నర్ నీ చూస్ చేసుకోవడం లో తప్పు చేయకూడదు…ఇంకా డీసెంట్ అంటావా?? అన్ని చోట్ల మన రియల్ అప్పియర్ ని చూపించకూడదు…డీసెంట్ గా ఉంటే ఏమి తెలియదు అనుకోవడం తప్పు. అలానే యాక్టివ్ గా అల్లరి గా వున్న వాళ్ళని మాస్ అనుకోవడం కూడా తప్పే ఎందుకంటే నిజానికి వాళ్ళకే పెద్దగా ఏం తెలియదు. మనమేంటి అనేది మన లైఫ్ పార్ట్నర్ కి తెలిస్తే చాలు …అందరికీ తెలియక్కర్లేదు. అలాగే ర్యాంకింగ్ స్టూడెంట్ కి  రొమాంటిక్ సెన్స్ ఉండదు లేక అలాంటివి చూడరు అనుకోవడం నీ తప్పు. లవ్ కి కెరియర్ కి సంబంధం ఏం లేదు. ఇంకొక విషయం క్లారిఫికేషన్ ఇస్తున్న విను…నిన్న సాయంత్రం వరకు రిషి సార్ కి ఎట్రాక్ట్ అవుతున్న అనుకున్న కానీ సార్ కనిపించక పోతే నిన్న నైట్ నుండి నాకు మనసేం బాలేదు. ఆయన ఎవరో , వాళ్ళ ఫ్యామిలీ ఏంటో ఏమి తెలియదు నాకు బట్ ఐ థింక్ ఐయాం ఇన్ లవ్ విత్ రిషి సార్…అని లాస్ట్ మాటలు చిన్నగా చెప్పింది. 

 

అప్పటి వరకు ఆమె రొమాంటిక్ క్లాసెస్ గురించి ఆశ్చర్యంగా విన్న షాలిని లాస్ట్ మాటలకి ఇంకా ఆశ్చర్యపోయింది. హీరా ఇది నువ్వేనా అసలు ..నువ్వు ఇలా కూడా మాట్లాడతావా … అస్సలు  నమ్మలేకపోతున్న …ఫస్ట్ ర్యాంకర్ అంటే పుస్తకాలలో పడి మునిగి తేలుతారు అనుకున్న…నువ్వు నిజంగా డిఫరెంట్ హీరు…ఇంకా రిషి సార్ నీ లవ్ చేస్తున్నావ్ అంటే ఐయాం సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్…మీ ఇద్దరికీ బావుంటుంది…మరి సార్ మనసు లో ఏముందో…?? ఒకవేళ సార్ కి ఇంతకు ముందే లవ్ ఉంటే?? అంది షాలు. 

 

అప్పటి వరకు నవ్వుతూ ప్రేమ పాఠాలు, రొమాంటిక్ క్లాసెస్ హుషారు గా చెప్పిన ఆమె నవ్వు మాయం అయిపోయింది ఆ మాటకి. ఎందుకో ఆ మాట విన్న వెంటనే గొంతులో దుఃఖం వచ్చింది…కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది గమనించిన షాలు.. హేయ్ నువ్వింత సెన్సిటివ్ అని నాకు తెలియదు సారీ హీరా…అలా ఏం జరగదు లే…నువ్వు సార్ తో ఉంటే ఎలా ఫీల్ అవుతావు సార్ కూడా నువ్వు పక్కనుంటే నిన్ను మాత్రమే చూస్తారు .. అది నేను గమనించాను…కానీ నువ్వు లేట్ చేయకుండా చెప్పేస్తే సార్ మనసు లో ఏముందో తెలిసిపోతుంది గా అని ఒక ఉచిత సలహా ఇస్తుంది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue