ఇంత క్లోజ్ గా ఉంటున్న అతడు కశ్చితంగా ఆమెని లవ్ చేస్తున్నాడు అని అనుకున్న ఆమెకి అతని ఆన్సర్ కళ్ళ నుండి కన్నీళ్లు తెప్పించింది.
వాటిని అదుపు చేయలేక సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లేందుకు వెనక్కి తిరిగేంతలో ఆమె నడుము పట్టి తన మీదకి లాక్కున రిషి ” ఎలా కనిపిస్తున్నానే నీ కంటికి ?? అందరితో ఇలా తిరుగుతూ నా ?? ఎప్పుడైనా నన్ను అమ్మాయితో చూసావా ?? ఇందాక కూడా అది కావాలనే నా దగ్గర కి వచ్చి ఏదో పిచ్చి వాగుడు వాగి కాలు స్లిప్ అయినట్టు యాక్ట్ చేసింది. వదిలేస్తే నిజంగానే కింద పడి బ్యాక్ బంపర్ చేసుకుంటుందని హెల్ప్ చేశా ” అని ఆమె మీద వున్న ప్రేమ చెప్పకనే చెప్పాడు రిషి.
రిషి అలా మాట్లాడతాడానికి ఎక్స్పెక్టె చెయ్యని హీరా నోటి మీద చేతిని వేసుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ “రిషి సార్…ఇది మీరేనా …?? మీరు ఇలా కూడా మాట్లాడతారా ?? అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
రిషి కి కూడా కొత్తగానే ఉంది ..ఎందుకంటే చిన్నప్పటి నుండి మాటలు తక్కువ అందులో ఇలాంటి వల్గర్ వర్డ్స్ ఎప్పుడూ మాట్లాడింది లేదు . అందుకే అతనికి అంత కొత్తగా అనిపించింది.
హీరా నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా జరిగి ఆమె పెదవుల వైపు చూస్తూ ముందు ఇది చెప్పు…నీకు నేనంటే ఇష్టమా అని హస్కీ గా అడిగాడు.