45 నిమిషాల్లో హాట్ గా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి వేదాన్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టి రౌడీనే వేదాకు తినిపిస్తాడు…
వేద తింటూ రౌడీ మెడ చుట్టూ చేతులు వేసి ఎందుకు రౌడీ నేనంటే నీకు అంత ఇష్టం నువ్వు నన్ను ఇలా చూసుకుంటూ ఉంటే నాన్న కుడా ఇలా చూసుకునే వాడేమో అనిపిస్తుంది తెలుసా అంటుంది వేదా…
వేద నీకన్నీ నేనే నా కన్నీ నువ్వే మనకి మనిద్దరమే తప్ప ఇంకెవరు వద్దు నాకు నువ్వంటే ప్రాణమే నువ్వు లేవు నువ్వు పక్కన అన్న ఊహ కూడా నేను తట్టుకోలేను అంటాడు రౌడీ…