నందు బొమ్మల లాగా ఎటు కదలకుండా విక్రమ్ ని చూస్తూ ఉండిపోతుంది తన కళ్ళను తానే నలుపుకుంటూ…
అసలు నేను చూస్తుంది విక్రమ్ సార్ నేనా లేకపోతే ఇంకా ఎవరినైనా అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది…
కనురెప్ప కూడా వేయడం కూడా మర్చిపోయి మరి….
నందు అలా చూడడం చూసి విక్రమ్ చిటిక వేసి హలో మేడం
ఏంటి అలా చూస్తున్నారు లోపలికి ఇన్వైట్ చేయరా అని అడుగుతాడు విక్రమ్…..
హా రండి సార్ అని లోపలికి ఇన్వైట్ చేస్తుంది నందు భయపడుతూనే…