వేదను అక్కడికి కొంచెం దూరంలో ఉన్న జిల్లేడు చెట్టు దగ్గరకు తీసుకెళ్లి, ఆమెకు ఆ చెట్టుతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు.
అక్కడ జరుగుతున్న తంతును చూస్తున్న ఆరుకి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు.
‘వేదకి పెళ్లి జరగలేదా? మరి బాబు అంటే… వేదకి పెళ్లి జరగకుండానే బాబు ఎలా పుట్టాడు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ?’
ఆలోచనలు ఒకదానితో ఒకటి కలిసిపోతుండటంతో ఆమెకు తలంతా తిరుగుతున్నట్టుగా అనిపించింది. అప్పటికే మనసులో ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాలు దొరకని అయోమయం. ఆ ఒత్తిడికి నిలబడలేక పక్కనే ఉన్న యష్ మీదకు ఒరిగింది. బాబుని కూడా తనతోపాటే పట్టుకొని ఉండటంతో ఒక్కసారిగా ఇద్దరూ అతని మీదకు వాలిపోయారు.
యష్ వెంటనే అప్రమత్తమయ్యాడు. ఒక చేత్తో బాబుని జాగ్రత్తగా పట్టుకొని, మరో చేత్తో ఆరు కింద పడకుండా చూసుకున్నాడు.
“ఆరు…” అని మెల్లిగా పిలిచాడు.