అదే అదునుగా చూసుకొని స్కూటీ అక్కడే వదిలేసి దగ్గర్లో ఉన్న ఆటో స్టాండ్ కి వెళ్లి ఓ ఆటో లో కూర్చుని రైల్వే స్టేషన్ కి వెళ్లమని చెప్పింది…
రైల్వే స్టేషన్ కి వెళ్లి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ లో ఉన్న ట్రైన్ గురించి తెలుసుకొని దానికి జెనరల్ టికెట్ తీసి వెళ్లి అందులో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది…
వెంటనే ట్రైన్ కదలడంతో గట్టిగా ఊపిరి తీసుకొని పీల్చి తండ్రి తో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటే పెదాలపై చిరునవ్వు కంట్లో నుండి కన్నీళ్లు ఏకదాటిగా కారుతుంటే పక్క సీట్లోనే ఉన్న యాభై అయిదు ఏళ్ల ముసలావిడ క్యా హువా బేటీ??? అని అడిగింది..
ఆవిడ ప్రశ్న కి కళ్ళు తెరిచి చూసి కన్నీళ్లు తుడుచుకొని ఏమ్ లేదన్నట్టుగా చిన్నగా నవ్వి.. నేను ఇంట్లో నుండి వచ్చేసాను అని ఇంద్ర కి తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడేమో కదా..