దరిచేరా రావే.. చెలి!! – 4
పాప ఏడుస్తుంటే సావిత్రి గారి కళ్ళల్లో కన్నీళ్లు.. ఏడుస్తూనే ” పాపిష్టి దానికి మనసెలా ఒప్పిందో… పసి పాప ని ఎలా వదిలేయాలనిపించిందో ” అంటూ తిడుతూనే పాప కి పాలు పడుతుంటే ఆకలి కి ఆ పాలు తాగి పడుకుంటుంది బుజ్జిది
చిన్నా…
ఏంటి పిన్ని..
” పాప గురించి ఒకసారి అలోచించి స్వీటీ ని మరోసారి కలిసి.. తనని ఇంటికి వచ్చేలా చేయ్ ” అన్నారు ఆవిడ
హ్మ్ అంటూ అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయాడు
కార్ స్టార్ట్ చేసుకొని తన విల్లా కి చేరుకున్న రిధ్విక్ మరోసారి కాల్ చేశాడు..
శ్రేయ ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే .. శారద గారికి కాల్ చేశాడు
హలో.. చెప్పండి సర్..
తనేందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అడిగాడు
తన దగ్గర ఫోన్ లేదు సర్
వాట్ అంటూ అరిచాడు
అవును సర్… పెయిన్స్ స్టార్ట్ అయినప్పుడు శ్రేయ మేడమ్ ఫోన్ తీస్కోకుండానే హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యారు
డిశ్చార్జ్ అయ్యాక అయినా ఫోన్ లిఫ్ట్ చేయాలి గా అని పళ్ళు నూరుతాడు
సర్ మేడమ్ డిశ్చార్జ్ అయ్యాక విల్లా కి వెళ్ళేలేదు
వెళ్లక పోవడం ఏంటి.. ఇప్పుడెక్కడుంది
మా ఇంట్లో నే సర్
ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు…
ఓకే సర్ అంటూ వెళ్లి.. పడుకున్న శ్రేయ ని లేపి సర్ మాట్లాడతారంట అని ఫోన్ చేతిలో పెట్టి బయటకి వచ్చింది
హలో సర్
విల్లాకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావ్ అని గర్జించినట్టే ప్రశ్నించాడు
విల్లా కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా సర్
ఏంటి… మళ్ళీ చెప్పు
అగ్రిమెంట్ ఇస్ ఓవర్ సర్… గుడ్ బై అని కాల్ కట్ చేస్తుంది
మళ్ళీ కాల్ చేస్తాడు రిధ్విక్..
లిఫ్ట్ చేసి ఎందుకు చేశారు అంటుంటే.. మా నానమ్మ కి కాల్ చేసి ఇక మీకు నాకు సంబంధం లేదు అని చెప్పు
దట్స్ యువర్ ప్రాబ్లం సర్ నాట్ మై ప్రాబ్లం అని కూల్ గా అనేసి ఇంకెప్పుడు ఫోన్ చేయకండి అంటుంది
నీరసం గా అనిపించి మళ్ళీ పడుకుంది
శ్రేయ మాట్లాడిన మాటలు రిధ్విక్ కి ఏ మాత్రం నచ్చలేదు కానీ ఆ మాటలని ఎలా యూస్ చేసుకోవాలో అర్థం అయ్యి ఓ సైడ్ స్మైల్ తనలో…
తన నానమ్మ కి ఫోన్ చేసి హలో నానమ్మ నీకో వాయిస్ క్లిప్ పంపిస్తున్న విను అని కాల్ కట్ చేసి ఎంతవరకు పంపించాలో అంత వరకు కట్ చేసి పంపించి సక్సెస్ అన్నట్టు నవ్వుకుంటాడు
భానుమతి గారు మనవడు పంపించిన వాయిస్ రికార్డింగ్ ఏంటా అని ఆతృత గా వింటున్న తనకి… ” థట్స్ యువర్ ప్రాబ్లమ్ సర్ నాట్ మై ప్రాబ్లమ్..ఇంకెప్పుడు ఫోన్ చేయకండి ” అని శ్రేయ వాయిస్ విన్న భానుమతి గారికి ఆడియో వినక ముందు వరకు కూడా… మనవడు ఏదో మతలబ్ చేస్తున్నాడు అని అనుకుంది.. కానీ ఈ క్షణం నుండి పురిటి లొనే పసి పాప ని వదిలేసిన శ్రేయ అంటే అసహ్యం పెంచుకుంటుంది
పడుకున్న శ్రేయ కి ఎద భాగం భారంగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది.. ఓ పక్క తను వేసుకున్న బ్లౌజ్ కొంచెం కొంచెం గా తడిచినట్టు గా అనిపిస్తుంటే తడిమి చూసుకుంటే తన చేతి వేళ్ళ పై పాల మరకలు…
ప్రెగ్నెన్సీ టైం లో బలమైన పౌష్టికహారం తినడం వల్ల పాలు బాగా పడ్డాయి శ్రేయ కి
శ్రేయ వక్షోజాల నుండి పాల చుక్కలు కారుతున్నాయి..
పాప కి పాలు పట్టించకపోవడం తో ఎద అంత నొప్పి గా బరువు గా మారుతోంది ఆమె శరీరం…
పాలు ఇవ్వలేకే నేను ఇంత బాధ పడుతుంటే.. పాల కోసం తపించే ఆ పాప ఇంకెంత ఏడుస్తుందో అని తలుచుకోగానే శ్రేయ కన్నీటికి అడ్డుకట్ట వేయలేకపోయింది
వెంటనే శారదమ్మ ని పిలిచి తన పరిస్థితి చెప్పడం తో శారదమ్మ వెంటనే రూమ్ లోకి వెళ్లి ఒక తడి క్లోత్ తీసుకొచ్చి శ్రేయ ఎద పై పెట్టింది
ఇలా పది… పదిహేను నిమిషాల వరకు పెట్టి.. ఇప్పుడేలా అనిపిస్తుంది శ్రేయ
ఇప్పుడు బానే ఉంది కానీ హాస్పిటల్ కి వెళ్ళాలి అని అటుంది..
సరే కాసేపు పడుకో సాయంత్రం తీసుకెళ్తా అనగానే సరే అని కళ్ళు మూసుకుంది.. కానీ నిద్ర పట్టడం లేదు..
ఇన్ఫార్మ్ చేయడానికి తను నీ ఆఫీసులో ఎంప్లాయ్ కాదు నీ భార్య అన్న నానమ్మ మాటలు చెవుల్లో వినిపిస్తుంటే అది నా భార్య ఏంటి… అని అక్కడున్న ఫ్లవర్ వాజ్ విసిరి కొట్టి పైనున్న తన రూమ్ కి వెళ్ళిపోతాడు..
బెడ్ రూమ్ కి కనెక్టడ్ గా ఉండే రూమ్ డోర్ ఓపెన్ చేసి అందులో వాల్ కి వాళ్లిద్దరూ కలిసి తీసుకున్న ఉన్న లార్జ్ వాల్ పోర్ట్రైట్ దగ్గరికి వెళ్లి తడుముతు దాన్ని నా భార్య అంటున్నార్రా … నీ చావు కి కారణమైన తను నా భార్య ఎలా అవుతుందిరా..!!
@ ఇంకా ఉంది…
@ స్టోరీ చదివి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి….
Swipe left/right or tap the sides to turn pages