పెళ్లి చూపులు -57
“గిఫ్ట్ ఆ.. ఇప్పుడు నీకు నేను ఇవ్వాలా, సరే పదా బయటికి వెళ్దాం.. మాక్సిమం నువ్వు కీ చైన్ తప్ప ఏమీ తీసుకోవు కదా..! నీకు కావలసింది కీ చైన్స్ కొనిస్తాను” అని నవ్వుతూ రెండు అడుగులు ముందుకు వేశాడు వైష్ణవ్..
“హలో నెంబర్ 50 ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్ ఒక్కడివి.. నేను కీ చైన్ కావాలి అని నిన్ను అడిగానా..?” అని నడుం మీద రెండు చేతులు పెట్టుకొని కన్ను ఎగరేస్తూ అడిగింది సిరి …
“అంటే నీకు ఇష్టమైనది కీ చైన్ కదా” అని వైష్ణవ్ అంటుంటే “నాకు కీ చైన్ అంటే ఇష్టమే.. కానీ ఇప్పుడు అది తీసుకోవాలి అని నేను నిన్ను అడగలేదు కదా..! నిన్నటి నుంచి ఒక్కదాన్నే ఇంట్లో ఉండి బోర్ కొట్టింది.. అలా ఇద్దరం కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం’ అని అన్నది సీరి..
వైష్ణవ్ కూడా నో అని చెప్పకుండా “ఓకే వెళ్దాం” అని అన్నాడు