హాలులో సందడి నెమ్మదిగా సద్దుమణిగింది. పంతులు గారు జాతకాలు చూసి ముహూర్తాల గురించి చర్చిస్తున్నారు.
రామకృష్ణ గారు కొంచెం తడబడుతూ, గొంతు సవరించుకుని ఇషాంత్ వాళ్ళ పెదనాన్న, అమ్మగారి వైపు చూశారు.
అది.. సంబంధం చాలా పెద్దది. మా స్థాయికి తగ్గట్టుగా మేము కట్నకానుకలు ఇచ్చుకోవాలి కదా,మీ కోరికలు ఏంటో చెబితే.. మేము ఏర్పాటు చేసుకుంటాం అని వినయంగా అడిగారు.
వెంటనే ఇషాంత్ అమ్మగారు నవ్వుతూ వారించారు. రామకృష్ణ గారు, మాకు కట్నం అంటే అస్సలు ఇష్టం లేదు. మా ఇషాంత్కి అన్నీ ఉన్నాయి.
మాకు కావాల్సింది మీ అమ్మాయి మైరా మాత్రమే. ఆ పిల్ల మా ఇంటికి వస్తే చాలు. అసలు పెళ్లి వద్దన్న మావాడు ఎక్కడో చూసి మీ అమ్మాయిని ఇష్టపడడమే మాకు ఆశ్చర్యంగా ఉంది.
మాకు కట్నాలుకు సంబంధించి ఏమీ వద్దు. మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి చాలు అని అంటారు.