ప్రతి కెమెరా తననే రికార్డ్ చేస్తున్నట్టు మైరాకి భ్రమ కలుగుతోంది.
ఒక సామాన్య మధ్యతరగతి అమ్మాయికి, ఒక అహంకార మృగానికి మధ్య జరిగిన ఆ చిన్న సంఘటన ఆమె జీవితాన్ని తలకిందులు చేయబోతోందని ఆమెకి అప్పుడు అర్థం కాలేదు…..
మాల్ వెనుక గేటు దగ్గర చీకటి ఆవరించి ఉంది. మైరా తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి దొంగచాటుగా బయటకి వచ్చింది.
ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తోంది. త్వరగా త్వరగా పదండి రా, ఆ రాక్షసుడు మనల్ని చూస్తే చంపేస్తాడు అని మైరా వణుకుతూ తన స్కూటీ వైపు పరుగెత్తింది.
అందరూ కలిసి హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఇంటికి వెళ్లే దారిలో మైరా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
తన మనసులో కేవలం ఆ ఇషాంత్ కళ్లే మెదులుతున్నాయి. ఇంటికి వెళ్ళగానే ఏమీ తెలియనట్టుగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.