New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 4

మై మాఫియా డాన్ – 4

సిద్ధార్థ్ వంగి సార్ వాడు చాలా తెలివైన వాడు. ప్రతి పది నిమిషాలకు ఐపి అడ్రస్ మారుస్తున్నాడు. కానీ ఇప్పుడే ఒక లొకేషన్ ఫిక్స్ అయ్యింది. 

 

అది ఎక్కడి నుంచో కాదు సార్ ,మన పాత షిప్పింగ్ యార్డ్ సామ్రాట్ ఎక్స్‌పోర్ట్స్ ఏరియా నుంచి వస్తోంది అన్నాడు.

 

రానా కళ్లు మెరిశాయి. ఆ యార్డ్ ఐదేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ వల్ల మూతపడింది. అక్కడి నుంచి సిగ్నల్ వస్తుందంటే, శత్రువు రానా పాత సామ్రాజ్యంలోనే తిష్ట వేశాడని అర్థం.

 

రానా తన బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ కారును తానే డ్రైవ్ చేసుకుంటూ పాత షిప్పింగ్ యార్డ్ వైపు దూసుకెళ్లాడు. అతని వెనుక ఐదు కార్లలో అతని స్పెషల్ టీమ్ ఉంది.

 

యార్డ్ దగ్గరికి రాగానే రానా కార్ ఆపి కిందకి దిగాడు. గాలిలో తుప్పు పట్టిన ఇనుము సామాన్ల అక్కడ అంతా విస్తరించి ఉన్నాయి.అక్కడ ఉన్న భారీ కంటైనర్ల మధ్య ఎవరూ లేనట్టు కనిపిస్తోంది.

 

సిద్ధార్థ్, టీమ్‌ని మూడు వైపుల నుంచి పంపించు. నేను లోపలికి వెళ్తున్నాను. ఎవ్వరినీ ప్రాణాలతో వదలొద్దు. కానీ వాళ్ళ లీడర్ మాత్రం నాకు కావాలి,అని ఆర్డర్ ఇచ్చి, సైలెన్సర్ ఉన్న రెండు గన్స్ పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు.

 

చీకట్లో అడుగుల శబ్దం.. ఒక్కసారిగా పైన ఉన్న కంటైనర్ల నుంచి కాల్పులు మొదలయ్యాయి. రానా ఒక భారీ ఇనుప పీపా వెనుక దూకి కవర్ తీసుకున్నాడు.

 

రానా! నీ సమయం ముగిసింది! చికాగోలో తప్పించుకున్నావు కానీ, ఈ యార్డ్ నీకు స్మశానం అవుతుంది, అని ఒక గంభీరమైన గొంతు స్పీకర్ల ల ప్రతిధ్వనించింది.

 

రానా నవ్వుతూ, నా గడ్డ మీద నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ధైర్యముంటే బయటకి వచ్చి మాట్లాడు, అంటూ తన గన్ తో పైన ఉన్న ఇద్దరు షూటర్లను గురి తప్పకుండా కాల్చాడు.

 

యార్డ్ మధ్యలో ఉన్న ఒక పాత ఆఫీస్ బిల్డింగ్ లోకి రానా దూసుకెళ్లాడు. అక్కడ ఉన్న పదిమంది గార్డ్స్ ని తన మార్షల్ ఆర్ట్స్ మరియు గన్ పవర్ తో ఒక్క నిమిషంలో మట్టి కరిపించాడు.

 

రక్తం చిందినా రానా చూపు మాత్రం ఆ గది చివరిలో ఉన్న కుర్చీ మీద ఉంది.కుర్చీ మెల్లగా తిరిగింది.అందులో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ముఖం మీద ఒక పెద్ద గాయం గుర్తు ఉంది. అతన్ని చూడగానే రానా ఒక్క క్షణం ఆగిపోయాడు.

 

ఖాలిద్..? రానా అడిగాడు……..

 

అతను గట్టిగా నవ్వి, గుర్తు పట్టావు రానా,ఐదేళ్ల క్రితం ఇదే యార్డ్ లో జరిగిన పేలుడులో నేను చనిపోయాను అనుకున్నావు కదా? కానీ మిగిలాను, ఈ గాయంతో, నీ మీద పగతో ప్రతి రోజూ బతికాను,అన్నాడు ఖాలిద్.

 

 

ఖాలిద్ ఒకప్పుడు రానాకి పార్టనర్. కానీ బిజినెస్ లో రానాను మోసం చేయాలని చూసి, రానా చేతిలోనే దెబ్బ తిని పారిపోయాడు. అప్పటి నుంచి అతను బ్లాక్ ఈగల్ అనే ముఠాను కట్టి రానా సామ్రాజ్యాన్ని కూల్చాలని ప్లాన్ చేస్తున్నాడు.

 

నా సామ్రాజ్యం మీద కన్నేయడం అంటే, నీ చావుని నువ్వే కొని తెచ్చుకోవడం ఖాలిద్. చికాగోలో నా షిప్స్ ఆపింది నువ్వే,నా సర్వర్ హ్యాక్ చేసింది నువ్వే, ఆ మెసేజ్ పంపింది కూడా నువ్వే రానా కోపంతో అన్నాడు.

 

 

అవును రానా! నీకు అత్యంత ఇష్టమైన ఈ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయడమే నా లక్ష్యం. ఇప్పుడు చూడు, ఈ బిల్డింగ్ చుట్టూ నా మనుషులు ఉన్నారు. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లలేవు అంటూ ఖాలిద్ సిగ్నల్ ఇచ్చాడు.

 

 

ఒక్కసారిగా ఇరవై మంది ఆయుధాలతో రానాను చుట్టుముట్టారు. రానా దగ్గర గన్స్ అయిపోయాయి. అతను తన కోటు విప్పి నేల మీద పడేశాడు.

 

 

గన్స్ తో చంపడం ఈజీ ఖాలిద్,కానీ నీ మనుషులను నా చేతులతో చంపితే వచ్చే కిక్కు వేరు అంటూ రానా విరుచుకుపడ్డాడు.

 

 

అది ఒక మారణహోమం. రానా దెబ్బకి ఒక్కొక్కడి ఎముకలు విరిగిపోతున్నాయి. ఒకడిని కంటైనర్ కి వేసి కొడితే, ఇంకొకడిని గాల్లోకి లేపి నేలకేసి కొట్టాడు. 

 

రానా కళ్ళలో ఇప్పుడు రౌద్రం కనిపిస్తోంది. ఖాలిద్ పంపిన షూటర్లు రానా వేగాన్ని అందుకోలేకపోయారు.

చివరికి రానా ఖాలిద్ గొంతు పట్టుకుని గోడకు అదిమి పెట్టాడు.

 

 

బ్లాక్ ఈగల్ పేరు బాగుంది. కానీ ఈగల్స్ ఎప్పుడూ సింహంతో యుద్ధం చేయలేవు ఖాలిద్, అంటూ రానా తన చేతిలో ఉన్న ఒక చిన్న కత్తిని ఖాలిద్ గుండెకు గురి పెట్టాడు.

 

 

చెప్పు ఖాలిద్ నీ వెనుక ఇంకెవరున్నారు? నీకు ఈ టెక్నాలజీ, ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? రానా గర్జించాడు.

 

 

ఖాలిద్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ, నేను…… నేను కేవలం ఒక భాగం మాత్రమే రానా. అసలైన కింగ్ వేరే ఉన్నాడు.వాడు నీ నీడలోనే ఉన్నాడు, అని నవ్వుతూ కళ్లు మూసుకున్నాడు.

 

 

రానా ఖాలిద్ ని కిందకు తోసేశాడు. ఖాలిద్ చనిపోయాడు, కానీ అతను చెప్పిన చివరి మాటలు రానా మెదడులో తూటాల్లా పేలాయి.

 

 

నీ నీడలోనే ఉన్నాడు, అంటే అర్థం ఏంటి? తన కంపెనీలో లేదా తన టీమ్ లోనే ఎవరైనా ద్రోహి ఉన్నారా,

రానా యార్డ్ నుంచి బయటకు వచ్చాడు. 

 

సిద్ధార్థ్ వచ్చి, సార్, అంతా క్లియర్. బ్లాక్ ఈగల్ ముఠా పూర్తిగా అంతమైపోయింది అన్నాడు.రానా సిద్ధార్థ్ కళ్ళలోకి అనుమానంగా చూశాడు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి.

 

 

సామ్రాజ్యం భద్రంగా ఉందనుకున్నప్పుడే శత్రువు పుడతాడు సిద్ధార్థ్. పద ఈ ఆట ఇప్పుడే మొదలైంది, అని రానా తన కారు వైపు నడిచాడు.

 

 

చీకటిలో, వర్షంలో రానా కారు దూసుకెళ్లింది. శత్రువుని పట్టుకున్నాడు, కానీ ఆ శత్రువు వెనుక ఉన్న అసలైన సూత్రధారి ఎవరో తెలుసుకోవడం ఇప్పుడు రానా ముందున్న కొత్త సవాల్.

 

 

                   కొనసాగుతుంది…………..

 

ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని సమీక్ష ద్వారా తెలియజేయండి. అలాగే కొత్తగా స్టోరీ చదివే వాళ్ళు ప్లీజ్ నన్ను ఫోన్ చేసి సపోర్ట్ చేయండి………