❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️ – 5
“రఘూ, నువ్వు మళ్లీ మామూలు మనిషివి అవుతావు. ఆ అమ్మాయి నిన్ను కచ్చితంగా మామూలు మనిషిగా చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నీ కొడుకు దీనికి ఒప్పుకుంటే నాకు ఏ దిగులూ ఉండదు” అంటూ ఆయన కొద్దిసేపు రఘునందన్ గారితో మాట్లాడి, తన గదికి వెళ్లిపోతారు.
పైకి వెళ్లిన రణధీర్, ఈరోజు ఇంట్లో జరిగినదంతా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు.
వరూధిని రావడం, ట్రీట్‌మెంట్ చేసి వెళ్లడం అంతా చెక్ చేసి, వరూధిని ఫేస్ ఫోటో తీసుకుని చాలాసేపు ఆలోచిస్తాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి, అలసిపోవడంతో పడుకుంటాడు.
ఉదయం యథావిధిగా వరూధిని పొద్దున్నే నిద్రలేచి, ఇంట్లో అందరికీ టిఫిన్, లంచ్ బాక్సులు సిద్ధం చేస్తుంది. రిక్కీని రెడీ చేసి, అందరూ కలిసి కూర్చొని టిఫిన్ తింటారు.
తర్వాత రిక్కీకి బోలెడన్ని జాగ్రత్తలు చెప్పి, స్కూల్లో వదిలిపెట్టి తను హాస్పిటల్‌కి వెళ్లిపోతుంది.
వరూధిని హాస్పిటల్‌కి వెళ్లగానే, డీన్ క్యాబిన్ నుంచి ఒకతను వచ్చి వరూధినిని పిలుస్తాడు.
వరూధిని డీన్ క్యాబిన్‌కి వెళ్తుంది.
డీన్ వరూధినిని కూర్చోమని చెప్పి, తన ముందు ఒక ఆఫర్ లెటర్ పెడతాడు.
అది చూసి చదివిన వరూధిని అయోమయంగా డీన్ వైపు చూస్తుంది.
“మిస్ వరూధిని, మీరు నిన్న ట్రీట్‌మెంట్ చేయడానికి వెళ్లారు కదా! రఘునందన్ అనే పేషెంట్‌కి ఈరోజు నుంచి మీరే ట్రీట్‌మెంట్ చేయాలి. దానికి సంబంధించిన ఆఫర్ లెటర్ ఇది. మీకు ఇది మంచి అవకాశం. మీరు ఇప్పుడు తీసుకుంటున్న శాలరీ కంటే ఎక్కువ శాలరీ వస్తుంది. ఫ్యూచర్‌లో మీకు మంచి అవకాశాలు కూడా ఉంటాయి” అని డీన్ చెప్పగానే,
“సార్, ఇందులో మార్నింగ్ 9 నుంచి ఈవెనింగ్ 8 వరకు డ్యూటీ చేయాలని రాసి ఉంది. కానీ నాకు అంతసేపు ఉండడం కుదరదు సార్. ఎందుకంటే నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడిని రోజూ స్కూల్ నుంచి పిక్ చేసుకోవాలి.
నాకు ఇప్పుడు చేస్తున్న జాబ్ చాలు. ఈ ఆఫర్ అవసరం లేదు సార్” అని అంటుంది వరూధిని.
“మిస్ వరూధిని, మీరేం వదులుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? మీ బాబుని స్కూల్ నుంచి మీరు కాకపోయినా ఇంకెవరైనా తీసుకురావచ్చు. కానీ ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. మీరు ఒకసారి బాగా ఆలోచించండి” అంటాడు డీన్.
“లేదు సార్, నేను ఆలోచించే చెప్తున్నాను. నాకు వీలుపడదు సార్. నా బాబుని నేనే చూసుకోవాలి. మీరు వాళ్లకి చెప్పేయండి. వేరే ఎవరినైనా చూసుకోమని చెప్పండి. లేదంటే ఇదివరకు చేసిన డాక్టర్‌నే కంటిన్యూ చేయమనండి” అంటుంది వరూధిని.
“మిస్ వరూధిని, దీనికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకుని తీరాలి. లేదంటే అనవసరంగా రుద్రవీర్ గారి ఆవేశానికి మనమందరం బలికావాల్సి ఉంటుంది. అనవసరంగా కాంప్లికేట్ చేసుకోకండి. తర్వాత మీ ఇష్టం” అంటాడు డీన్.
“నాకు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు సార్. నేను చేసుకునే జాబ్ నాకు చాలు. ఎవరి ఆఫర్లు నాకు అవసరం లేదు. నేను వెళ్తాను సార్” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది వరూధిని.
డీన్ రుద్రవీర్‌కి ఫోన్ చేసి, వరూధిని ట్రీట్‌మెంట్ చేయడానికి ఒప్పుకోలేదని చెప్పేస్తాడు.
దాంతో కోపం వచ్చిన రుద్రవీర్, “హౌ డేర్ యు! నేను ఇచ్చిన ఆఫర్‌నే వద్దంటుందా? ఇంత పొగరా? నేను ఇప్పుడే వస్తున్నాను” అంటూ హాస్పిటల్‌కి బయలుదేరుతాడు.
వరూధిని బయటికి రాగానే, వైష్ణవి తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. తను బయటికి రాగానే తన దగ్గరికి వెళ్లి,
“ఏమైంది వరు? డీన్ ఎందుకు రమ్మన్నారు?” అని అడుగుతుంది.
వరూధిని లోపల జరిగినదంతా వివరంగా వైష్ణవికి చెప్తుంది.
వైష్ణవి షాకింగ్ గా ! అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? ఇంత మంచి ఆఫర్‌ని వద్దంటావా? అసలు నువ్వేంటే, నాకు అస్సలు అర్థం కావడం లేదు” అంటుంది వైష్ణవి.
“నేను డాక్టర్‌ని అయ్యింది అందరికీ సేవ చేయడానికి. కానీ ఒక్కరికి మాత్రమే ట్రీట్‌మెంట్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. నేను ఎంతో కష్టపడి చదివి ఇక్కడి వరకు వచ్చాను. డబ్బు కోసం అమ్ముడుపోయే క్యారెక్టర్ నాది కాదు. అందుకే వద్దని చెప్పేశాను” అంటుంది వరూధిని.
“ఒసేయ్! నువ్వు అసలు ఏమనుకుంటున్నావ్? అక్కడుంది సింహం. వాళ్లు చెప్పింది మనం చేయాలి కానీ, మనం చెప్పేది వాళ్లు వినరే బాబు! నువ్వు వెళ్లి డైరెక్ట్‌గా సింహం నోట్లోనే తల పెడుతున్నావ్. ఏం జరుగుతుందో.
ఏంటో!” అంటూ వరూధినిని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది వైష్ణవి.
రుద్రవీర్ ఆవేశంగా హాస్పిటల్‌కి వచ్చి, డీన్ క్యాబిన్‌లో కూర్చుంటాడు.
“ఆ డాక్టర్‌ని పిలిపించండి” అంటాడు.
డీన్ భయపడుతూనే వరూధినికి కాల్ చేసి పిలిపిస్తాడు.
రుద్రవీర్ కోపంగా కాలు మీద కాలు వేసుకుని, ముడిచిన కనుబొమ్మలతో ఫోన్‌ని చేతిలో తిప్పుతూ వరూధిని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
వరూధిని లోపలికి వస్తూ రుద్రవీర్‌ని చూస్తుంది. దవడ కండరాలు బిగించి, కాలు మీద కాలు వేసుకుని కూర్చుని, చేతిలో మొబైల్ తిప్పుతూ, కోపంతో ఎర్రబడ్డ కళ్లతో తననే చూస్తూ ఉంటాడు.
వరూధిని లోపలికి వచ్చి, “చెప్పండి సార్. ఎందుకు రమ్మన్నారు?” అని అడుగుతుంది.
“మిస్ వరూధిని, ఆయనే మిస్టర్ రుద్రవీర్ సింహ. మీతో మాట్లాడటానికి వచ్చారు” అని పరిచయం చేస్తాడు డీన్.
రుద్రవీర్ మాట్లాడుతూ, “ఏయ్ మిస్! నీకెంత పొగరు? నేను ఇచ్చిన ఆఫర్‌ని కాదంటావా? అసలేం చూసుకుని నీకు ఇంత పొగరు?” అంటాడు.
రుద్రవీర్ మాట్లాడే తీరు ఏమాత్రం నచ్చని వరూధిని,
“మిస్టర్, మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు ఎలా పడితే అలా మాట్లాడితే ఇక్కడ పడటానికి ఎవరూ రెడీగా లేరు” అంటుంది.
“హౌ డేర్ యు! టాక్ లైక్ దిస్! నీతో ఇంతసేపు మాట్లాడటమే చాలా చిరాగ్గా ఉంది నాకు . అలాంటిది ఇంకా పొగరు చూపిస్తున్నావేంటి? నేను చెప్పాను, నువ్వు చేయాలి. అంతే! అంతకుమించి ఎక్స్ట్రా వాగితే, తర్వాత జరిగే కన్సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.
పైగా నీకు శాలరీ నచ్చకపోతే ఎంత కావాలో అడుగు. పారేస్తాను. అంతేకానీ, రాను, అది, ఇది అని నా దగ్గర నీ పొగరు చూపించాలని అనుకోకు” అంటాడు రుద్రవీర్.
వరూధినికి అతను అలా మాట్లాడుతూ ఉంటే చాలా కోపం వస్తుంది.
దాంతో, “మిస్టర్, అందర్నీ డబ్బుతో కొనలేరు. మీ దగ్గర డబ్బు అనే పొగరు ఉంది. నా దగ్గర ఆత్మాభిమానం అనే రెస్పెక్ట్ ఉంది. మీకు మీ పొగరు చూపించుకోవడానికి బయట చాలా మంది దొరుకుతారు. వాళ్ల మీద చూపించండి మీ డబ్బు పొగరు కానీ, నా మీద కాదు” అంటూ వరూధిని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది.
అంతలో పెద్ద శబ్దం వినిపిస్తుంది.
వరూధిని వెనక్కి తిరిగి చూడగానే, ఫ్లవర్ వాజ్ పగిలిపోయి ఉంటుంది. రుద్రవీర్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది.
“ఏయ్ లేడీ! ఇంతసేపు ఓపికగా మాట్లాడుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నావ్. మర్యాదగా ఈరోజు సాయంత్రం నువ్వు ఈ రుద్రవీర్ మెన్షన్‌కి వచ్చి మా నాన్నకి ట్రీట్‌మెంట్ చేయాలి. లేదంటే, ఆ తర్వాత నువ్వు ఊహించలేని సిచువేషన్‌ని ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని చెప్పి బయటికి వెళ్లిపోతాడు.
డీన్ వరూధినితో మాట్లాడుతూ,
“వరూధిని, అనవసరంగా నీ లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకోకు. ఆయన చెప్పినట్టుగా ట్రీట్‌మెంట్ చేయడానికి ఒప్పుకో. లేకపోతే ఆయన గురించి నీకు తెలియదు. ఆయనకు ఎదురెళ్లిన వాళ్లు ఇంతవరకు బ్రతికున్నట్టు చరిత్రలో లేదు. అనవసరంగా నువ్వు ప్రాబ్లంలో ఇరుక్కొని, మీ ఫ్యామిలీని కూడా ప్రాబ్లంలోకి నెట్టకు” అంటాడు.
To be connected
Swipe left/right or tap the sides to turn pages