New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 23

మౌనమే ని భాష – 23

 

ఆ బావ శ్రావణి మెడలో తాళి కట్టేసాడా? శ్రావణి జీవితం అక్కడితో ముగిసిపోయిందా? లేక ఏదైనా అద్భుతం జరిగిందా?

 

వంశీ ఆ అక్షరాల వెనుక ఉన్న బాధను భరించలేక డైరీని గుండెలకు అత్తుకున్నాడు. శ్రావణీ.. నీకు ఇంతటి అన్యాయం జరిగిందా? ఆ తాళి పడకుండా ఎవరూ ఆపలేదా? అని మౌనంగా రోదించాడు.

 

 

గదిలో నిశ్శబ్దం గంభీరంగా ఉంది. వంశీ చేతిలో ఉన్న డైరీ పేజీలు అతని ఆందోళనతో వణుకుతున్నాయి.

 

పెళ్లి పీటల మీద ఉన్న ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే వంశీకి ఊపిరి ఆగిపోతున్నట్లు అనిపిస్తోంది. పంతులు గారు మంగళసూత్రాన్ని పెళ్ళికొడుకు చేతికి ఇచ్చారు..

 

ముహూర్తం సమయం మించిపోతోంది.. ఇక శ్రావణి జీవితం ఆ కర్కశ క్రూరుడి చేతిలో బందీ అయిపోవడమే మిగిలింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue