వంశీ గదిలో నిశ్శబ్దం ఉంది.తన కళ్ల ముందున్న డైరీలో శ్రావణి గతం నుండి వర్తమానంలోకి అడుగుపెడుతున్న తీరు అతన్ని మంత్రముగ్ధుడిని చేస్తోంది.
రాత్రి సమయం కావడంతో బయట గాలి హోరు వినిపిస్తోంది, కానీ వంశీ మనసంతా శ్రావణి స్నేహ ఇంటికి చేరుకున్న ఆ మొదటి రోజు మీదే ఉంది.
డైరీలో అక్షరాలు ఇప్పుడు కొంచెం కుదురుగా, స్పష్టంగా ఉన్నాయి. ఆకలి, భయం తీరిన తర్వాత శ్రావణి హృదయం నుంచి వచ్చిన మాటలు ఇవి.
అమ్మా.. స్నేహ నన్ను తన రూమ్ కి తీసుకువచ్చాక నా ప్రాణాలకు ఏదో తెలియని ప్రశాంతత దొరికింది.
ఈ రోజుకు నువ్వు రెస్ట్ తీసుకో శ్రావణీ, రేపు నేను పనిచేసే ఆఫీసులోనే నీకు కూడా ఉద్యోగం కోసం మాట్లాడతాను అని స్నేహ చెప్పింది.
శ్రావణి సరే అని అనడంతో సరే భోజనం అది వంటగదిలో ఉంది. కావాల్సిన తిను సరేనా అని చెప్పి నేను ఆఫీస్ కి వెళ్తున్నాను సాయంత్రం గుడ్ న్యూస్తో వస్తాను.