రాక్షస ప్రేమ-9
రౌద్ర ఆమె ఎంత నెడుతున్నా గోర్లతో గిచ్చుతున్న ఆమెను మాత్రం వదిలిపెట్టకుండా అంతే ఫేస్ ని తన చేతుల్లోనే ఉంచుకొని ఇష్టంగా ఆమెకు ముద్దు పెట్టాడు.
అతడు నుంచి తను విడిపించుకోలేదు అని తెలిసినా కూడా ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయింది, అప్పటికే అతడి రాక్షసత్వానికి గుర్తుగా ఆమె కళ్ళ వెంట కన్నీరు ఆగకుండా గంగా నదుల ప్రవహిస్తూనే ఉంది..
ఐదు నిమిషాల తర్వాత అతడు అమెని వదిలిపెట్టి తన పెదవులని చేత్తో తుడుచుకొని ఆమె వైపు హస్కిగా అంతకుమించి అల్లరి చూపులతో చూసి ఎలా ఉంది నా సారీ ఇలా చెప్తే సరిపోతుందా ఇంకొకసారి ట్రై చేయమంటావా అని కన్నింగ్ గా అడిగాడు రౌద్ర…
అప్పటికే అతను చేసిన దానికి ఆమె తట్టుకోలేక మోకాళ్లలో తలను పెట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ ఉంది కనీసం అతడి వైపు కూడా చూడలేకపోయింది.
“ఏంటి శౌర్య కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్.. సారీ చెప్పాలి అన్నావ్, సారీ చెప్పేసాను కదా.. ఇక మన ఇంటికి వెళ్దామా..! వస్తావా.?” అని సర్కాస్టిక్ గా నవ్వుతూ అన్నాడు రౌద్ర