New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వేచానయ్య నీకోసం 🤍 – 6

వేచానయ్య నీకోసం 🤍 – 6

“అవునమ్మా” అని గాయత్రి పెద్దమ్మ చెప్పడంతో “అందుకే అక్కడికి వెళ్ళాక కావ్య వేసుకునే లాంటి పంజాబీ డ్రెస్సులు కొనివ్వు” అని చెప్పడంతో సరే అని చెప్పింది ఆవిడ….

 

ఆరోజు రాత్రి దుర్గమ్మ ఇంకా పడుకోకపోవడంతో “ఇంకా పడుకోలేదా అమ్మమ్మ?” అంటూ గాయత్రి అక్కడికి రావడంతో “నీకు మీ తాతకి పచ్చడి లేకపోతే ముద్ద దిగదు కదా… అందుకే మీ పెదనాన్నకి సపరేటు డబ్బాలో నీ ఒక్కదానికి సపరేట్ డబ్బాలో ఆవకాయ ఉసిరికాయ నిమ్మకాయ ఇలా అన్ని రకాల పచ్చళ్ళు పెట్టి పంపిస్తున్నాను…. అలాగే కొన్ని జంతికలు రవ్వ లడ్డులు సున్నుండలు కూడా పెట్టాను… అయిపోగానే చెప్పు… హైదరాబాద్ ఎవరైనా వస్తుంటే చేసి వాళ్ళతో పంపిస్తాను” అంది ఆవిడ…

 

“నేను నీకు తాతయ్యకి భారం గా ఉన్నానా అమ్మమ్మ?” అని అడగడంతో ఒక్కసారిగా దుర్గమ్మ కళ్ళలో నీళ్లు తిరిగి “అదేంటి అలా మాట్లాడుతున్నావ్?” అంటుంటే “మరి ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్దమ్మతో ఎందుకు పంపిస్తున్నావ్?” అనగానే “ఒసేయ్ మొన్న పెళ్లి సంబంధం అనగానే ఎంతలా ఏడ్చావో మర్చిపోయావా… కావ్య నీ కంటే పెద్దది… సంబంధాలు అనగానే వాడిని రఫ్ ఆడిస్తాను అంటుంది తప్పితే ఎప్పుడైనా ఏడవడం చూసావా?” అంది….

 

గాయత్రి మౌనంగా ఉండడంతో “అయినా ఇది పెళ్లికి వచ్చిన సమస్య మాత్రమే కాదు… నాకు మీ తాతయ్యకి వయసు అయిపోయింది… ఇంకా ఈ ప్రాణం ఇన్ని రోజులు బ్రతికి ఉంది అంటే మా మీద ఆధారపడి ఉన్న నీకోసం మాత్రమే… మేమింకా ఎన్ని రోజులు బ్రతుకుతాము… ఆడపిల్లవి కనీసం ఒక అయ్య చేతిలో పెట్టలేకపోయినా నీకు క్షేమంగా ఉండే ఇల్లు కావాలి కాబట్టే పెద్దమ్మ వాళ్లకి అప్పజెబుతున్నాను” అంది….

 

గాయత్రి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో “నువ్వు పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనీసం రెండు నెలలకి ఒకసారి అయినా నేను తాతయ్య నీ వంకతో వచ్చి అక్కడ ఉండొచ్చు… అప్పుడు నా కూతురుతో మనవరాళ్లతో కొన్ని రోజులు గడిపినట్టుగా ఉంటుంది కదా” అంది….

 

గాయత్రి ఇంక మౌనంగా ఉండడంతో “పైగా అక్కడికి వెళ్తే మంచి ఇంగ్లీష్ మీడియం చదువు కూడా వస్తుంది…. నా మాట విని కావ్య వాళ్ళతో బయలుదేరు” అని చెప్పడంతో ఇంకా గాయత్రి మౌనంగా సరే అని చెప్పేసరికి “నా బంగారు తల్లి నా మాట వింటుందని నాకు తెలుసు” అంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue