** అజేయ – 45 **
సియా తన చేతిలో ఉన్న బ్యాగ్‌ని పట్టుకుని, రిసార్ట్ అటెండెంట్ చెప్పినట్టు ఆ మెట్లకు కుడి వైపున ఉన్న కారిడార్ గుండా రూమ్ నంబర్ 105 వైపు వెళ్ళిపోయింది..
సియా వెళ్లిన కొద్ది సెకన్లకే… రాఘవ్ మళ్ళీ కారిడార్ నుండి వెనక్కి వచ్చాడు..
రాఘవ్ తన రూమ్ డోర్ ఓపెన్ చేయబోతుంటే అతనికి రిసెప్షన్ లో తన బ్యాగ్ మర్చిపోయానని గుర్తుకు వచ్చి వెంటనే వెనక్కి వచ్చాడు..
రాఘవ్ వెనక్కి వచ్చేసరికి ఆ హల్ లో సోఫా ఖాళీగా ఉండటం తో..అటెండెంట్‌ని..”నా బ్యాగ్ ఎక్కడ?” అని అడిగాడు రాఘవ్
“సార్, మా బాయ్ ఆల్రెడీ మీ లగేజ్‌ని మీ రూమ్‌కి తీసుకెళ్లాడు సార్.. రూమ్ నంబర్ 104 లో పెట్టేసి ఉంటాడు,” అని చెప్పాడు అటెండెంట్..