నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 3
ఇక సాయంత్రం ఆఫీసు టైం అయ్యే వరకు ఆ బ్రాంచ్ దగ్గరే గడిపి నైట్ అవుతుండగా హోటల్ కి రీచ్ అయ్యాడు రన్వీర్
ఇక్కడ హెచ్ ఆర్ పాప కూడా ఫుల్ పోష్ గా రెడీ అయ్యి కేజీ మేకప్ వేసుకొని నీళ్లలో స్నానం చేసిందా లేదంటే సెంటులో స్నానం చేసిందా అన్న డౌట్ వచ్చే అంతలా సెంట్ కొట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది హోటల్ కి
@@@@@@@ హోటల్
సోఫాలో కాలు మీద కాలు వేసుకొని పొగరుగా కూర్చుని ఉన్నాడు రన్వీర్
అతని ఎదురుగా సూటు బూటు వేసుకొని చూడడానికి చాలా హుందాగా అనిపిస్తున్న 40 ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు
” టెండర్ విషయం ఏమైంది ??? మనకే వస్తుంది కదా ??? ” పొగరుగా అవతలి వ్యక్తిని చూస్తూ అడిగాడు రన్వీర్
” సార్ అది కష్టం సార్ 90% మీ కంపెనీకి టెండర్ వచ్చే అవకాశాలు లేవు !!!! ” అన్నాడు అతను
రన్వీర్ నిర్లక్ష్యంగా అతని వైపు చూస్తూ పక్కనే టీపాయ్ మీద ఉన్న సూట్ కేస్ ఓపెన్ చేసి ఒక రెండు నోట్ల కట్టలు అతని మొహం మీద కొట్టాడు
అతని ఫేస్ కి తగిలే చివరి క్షణంలో చేతితో క్యాచ్ పట్టి వాటిని చూస్తూ ఉన్నాడు అతను
” ఇప్పుడు చెప్పు టెండర్ నా కంపెనీకే వస్తుంది కదా ??? ” అడిగాడు
” అంటే ఇందాక ఏమన్నాను సార్ 90% ఛాన్సెస్ లేవు అన్నాను కదా ఇప్పుడు చెప్తున్నాను సర్ 90% కాదు కానీ ఒక 70% ఛాన్సెస్ లేవు సార్ !!!! ” అన్నాడు అతను
మరొక డబ్బు కట్ట తీసి అతని మొహం మీద కొట్టాడు
” ఇప్పుడు ??? ” ప్రశ్నించాడు రన్వీర్
” సర్ 50% ఛాన్సెస్ ఉన్నాయి సార్ మీకు రావడానికి !!!! ” అన్నాడు
రన్వీర్ మరొక నాలుగు డబ్బులు కట్టలు తీసి అతని ముందు పెడుతూ
” టెండర్ నా కంపెనీకి రావడానికి ఈ అమౌంట్ సరిపోతుందా లేదంటే ఇంకా ఎక్స్ట్రా కావాలా ??? ” అహంకారం అతని మాటల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది
” 100 కి 200% మీ కంపెనీకి టెండర్ వచ్చేసినట్టే సర్ మీరు నిశ్చింతగా ఉండండి మిగతా కథంతా నేను చూసుకుంటాను !!!! ” అంటూ ఆనందంగా ఆ డబ్బులు కట్టలు అన్ని తీసుకొని అతని సూట్ కేసులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు
వెళ్తున్న అతని వైపే పొగరుగా చూస్తూ ” డబ్బు చేయలేని పని అంటూ ఏదీ లేదు దేనినైనా డబ్బుతో ఇట్టే శాసించొచ్చు !!!! ” అనుకుంటూ ఉన్నాడు
సరిగ్గా అప్పుడే సింగల్ పీస్ డ్రెస్ లో అక్కడికి వచ్చింది హెచ్ఆర్ పాప
పాపని అలా చూసినా అతనిలో అప్పటివరకు లేని ఏదో సలపరం మొదలైంది
‘ కమాన్ ” అన్నాడు రన్వీర్
” హాయ్ సర్ !!!! ” వయ్యారంగా తిప్పుకుంటూ అతని ముందు పగలుపోయింది హెచ్ఆర్ పాప
” రిమూవ్ యువర్ క్లోత్స్ !!!! ” ఆర్డర్ పాస్ చేశాడు
” ఇదేంటి వీడు ఇంత స్పీడుగా ఉన్నాడు అయినా రోజుకి ఒకరితో ఉంటే ఇలాగే ఉంటుందిలే !!! ” అనుకుంటూ అతను చెప్పినట్టే చేస్తూ వచ్చింది ఆ అమ్మాయి
ఒక నాలుగు గంటల తర్వాత పూర్తిగా అలసిన శరీరంతో ఆమె పక్కకి చేరాడు
ఆ అమ్మాయి కూడా లేచి తన డ్రెస్ తీసి వేసుకుంది
రన్వీర్ టవల్ చుట్టుకుని హెచ్ ఆర్ వైపు చూశాడు
బాగా నీరసంగా ఉన్నట్టు ఆమె వాడిపోయిన మొహం చూస్తేనే తెలిసిపోతూ ఉంది
తన సూట్ కేసులో నుంచి చెక్ బుక్ తీసి సైన్ చేసి ఆ చెక్ చింపి ఆమె ముందు పెట్టాడు
” నీకు నచ్చినంత అమౌంట్ రాసుకో !!!! ” అతని ప్రతి మాటలో అహంకారం స్పష్టంగా కనిపిస్తుంది
ఆ అమ్మాయి సంబరంగా ఆ చెక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది
తను వెళ్ళిపోయాక ఫ్రెష్ అయ్యి అలాగే బెడ్ మీద పడుకుండిపోయాడు రన్వీర్
ఇక్కడ కిందకి వచ్చిన పాప నేరుగా అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది
రణ్వీర్ కూడా తెల్లవారుతుండగా రూమ్ వెకేట్ చేసి వారం రోజుల నుంచి ఇంటి మొహం చూడకపోవడంతో ఇంటికి వెళ్ళాడు
ఇంటికి వచ్చిన రన్వీర్ కి హాల్లోనే ఒక సైడ్ కి పెద్దగా ఉన్న దేవుడి రూమ్ కూర్చుని మంత్ర జపం చేసుకుంటూ కనిపించారు జగదీశ్వరి గారు
మనవడి రాకను చూడకుండానే పసిగట్టారు
లోపలికి వచ్చి సోఫాలో కూలబడ్డాడు రన్వీర్
” మలినమైన దేహాన్ని శుద్ధి చేసుకుని అప్పుడు వచ్చి కూర్చో !!!! ” మంత్రం జపం చేసే మాలని తిరిగి దాన్ని స్థానంలో పెడుతూ గాంబీర్యంగా చెప్పారు జగదీశ్వరి గారు
” నువ్వు మారవ్ !!! ” అనుకుంటూ అక్కడ నుంచి పైకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి
రన్వీర్ తల్లి తండ్రి అతని చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి రన్వీర్ నానమ్మ గారే ఇటు ఆఫీస్ బాధ్యతలు అటు మనవడి బాధ్యతలు అన్ని చాకచక్యంగా చూసుకుంటూ ఉన్నారు
రన్వీర్ పట్టు పట్టి మరి విదేశాలకు వెళ్లడంతో అక్కడ ఫారెన్ కల్చర్ కి బాగా అలవాటు పడిపోయాడు
ఈ విషయాలు అన్ని జగదీశ్వరి గారికి బాగా తెలుసు మొదట్లో ఖండించే ప్రయత్నం చేశారు కానీ రన్వీర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బామ్మ మనవడి మధ్య దూరం పెరిగింది
రన్వీర్ ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తనకే తెలీదు జగదీశ్వరి గారు పెళ్లి చేసుకోమని చెప్పినా కూడా దాని వైపు మక్కువ చూపేవాడు కాదు
చెప్పి చెప్పి ఆవిడ విసిగిపోయి మనవడిని వదిలేశారు
కానీ ఎప్పటికైనా మనవడు మారతాడు తనని మంచిగా చూసుకునే భార్య రావాలి అని కోరిక ఉండేది జగదీశ్వరి గారికి
రన్వీర్ అక్కడి నుంచి తన రూం లోకి వెళ్లి చెయ్యి కిందకి వచ్చాడు
రన్వీర్ పక్కన కూర్చున్నారు జగదీశ్వరి గారు
” రన్వీర్ నా ఆరోగ్యం బాగుండట్లేదు ఎప్పుడు నేను చచ్చిపోతానో నాకే తెలియదు నేను బతికుండగా పెళ్లి చేసుకో ఇదే నా ఆఖరి కోరిక అనుకో !!! ” ప్రేమగా లాలిస్తూ మనవడి గడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ అడిగారు జగదీశ్వరి గారు
” అది తప్ప ఇంకేదైనా చేస్తాను అయినా నీ ఆరోగ్యం బాగోకపోవడం ఏంటి పద హాస్పిటల్ కి వెళ్దాం అయినా అంత బాగోకపోయినప్పుడు ఫోన్ చేయాలి కదా డాక్టర్ నీ పంపించేవాడిని కదా !!! ” తన నుదురు మీద అసహనంగా టాప్ చేసుకుంటూ అడిగాడు రన్వీర్
” అసలు ఒక మనిషికి ఉండే ఎమోషన్స్ ఏవి నీలో లేవా ??? ” ఆవేదనగా మనబడి వైపు చూస్తూ ప్రశ్నించారు
” ఉన్నాయి కానీ అన్నీ లేవు !!! ” అంటూ ఉండగానే
” అవును అహంకారం పొగరు దర్పం మరీ ముఖ్యంగా కామం !!!! ” ఇవి తప్ప నీలో ఇంకే ఎమోషన్స్ లేవు కదా ??? “
” ఇప్పుడేమంటావ్ ఏం చేయమంటావు నన్ను వారానికి ఒకసారి వస్తున్నాను ఇలాగా వచ్చినప్పుడు కూడా నువ్వు ఫిలాసఫీస్ మాట్లాడుతూ ఉంటే రావాలి అన్న ఆ ఇంట్రెస్ట్ కూడా పోతుంది !!!! ” చిరాకుగా చెబుతూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు
ఎందుకో మనవడు అన్న ఆ మాటని ఆ పెద్దావిడ తీసుకోలేకపోయింది
రన్వీర్ అక్కడి నుంచి కనీసం ఒక పది అడుగులు కూడా నడిచి ఉండడు ఈ లోపే అమ్మ అమ్మ అంటూ చిన్నగా నొప్పికి అరుస్తూ నేల మీద పడిపోయారు జగదీశ్వరి గారు
ఆవిడ అరుపుకి వెనక్కి తిరిగిన రన్వీర్ కి అక్కడ జగదీశ్వరి గారు సోఫాలో నుంచి నేలమీద పడిపోయి గుండెల మీద చేయి వేసుకొని నొప్పికి అరుస్తూ కనిపించడంతో
” నానమ్మ నానమ్మ !!! ” అంటూ ఆమె దగ్గరికి వెళ్లాడు
ఆమెని తీసుకొని బాడీ గార్డ్స్ వైపు చూస్తూ కార్ తీయండి అంటూ ఆవిడని ఎత్తుకున్నాడు రన్వీర్
కారు వైపు నడుస్తూ ఉండగానే జగదీశ్వరి గారు తన తుది శ్వాస విడిచారు
@@@@@@@@@@@@@@@@
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
ఇప్పటినుంచి అసలు కదా స్టార్ట్ అవుతుంది ఎవరు మిస్ కాకండి అలాగే చాలామంది చదువుతున్నారు కానీ ఫాలో అవ్వడం లేదు ఇలా అయితే ఎలా అబ్బా రాయాలి అన్న ఇంట్రెస్ట్ రావాలి కదా నాకు సో ఫాలో అయిపోండి డార్లింగ్స్ 😘😘😘
Swipe left/right or tap the sides to turn pages