నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 4
” నానమ్మ నానమ్మ !!! ” అంటూ ఆమె దగ్గరికి వెళ్లాడు
ఆమెని తీసుకొని బాడీ గార్డ్స్ వైపు చూస్తూ కార్ తీయండి అంటూ ఆవిడని ఎత్తుకున్నాడు రన్వీర్
కారు వైపు నడుస్తూ ఉండగానే జగదీశ్వరి గారు తన తుది శ్వాస విడిచారు
తన చేతుల్లోనే తన తుది శ్వాస విడిచిన నానమ్మ వంక చూస్తూ ఉన్నాడు రన్వీర్
అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అతనికి
దేవుడా అనుకుంటూ కారు వైపు వెళ్తున్నవాడల్లా ఆగి తిరిగి ఇంట్లోకి తీసుకువచ్చి హాయ్ మధ్యలో ఆమెని పడుకోపెట్టాడు
ఇక విషయం రన్వీర్ పిఏ ద్వారా అందరికీ తెలిసి అందరూ ఆమెను చూడడానికి వచ్చారు
అక్కడ ఎలాంటి భావం లేకుండా చూయింగ్ గమ్ బాగా నమ్ములుతూ దాన్ని బబుల్ వచ్చేలాగ ఊదుతూ అక్కడ ఒక మనిషి చనిపోయింది అన్న విషయం కూడా పట్టకుండా ఉన్నాడు
ఇక కొంతమంది దగ్గరుండి చెప్పడంతో ఆవిడకి దహన సంస్కారాలు చేశాడు
ఇది జరిగిన ఒక పది రోజులకి
” ఆస్తులన్ని నా పేరు మీదికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ??? ” గార్డెన్ లో టీపాయ్ మీద పెట్టిన కాఫీ కప్పు తీసుకొని సిప్ చేస్తూ తన ఎదురుగా ఉన్న తన లీగల్ అడ్వకేట్ని ప్రశ్నించాడు
” సర్ జగదీశ్వరి గారి వీలునామా ప్రకారం ఆస్తిలో నయా పైసా కూడా మీకు చెందదు ఆస్తి మొత్తం మైధిలి అనే అమ్మాయి పేరు మీదకి వచ్చేలాగా వీలునామా రాశారు !!! ” అన్నాడు అతను భయంతో తనకి పట్టిన చమటలని కర్చీఫ్ తో తుడుచుకుంటూ
” వాట్ డు యు మీన్ ఆస్తి మొత్తం నా పేరు మీదకి కాకపోతే ఆ అమ్మాయి పేరు మీదకి ఎలా షిఫ్ట్ అవుతాయి ఇంతకీ ఎవరు ఆ సో కాల్డ్ మైధిలి ??? ” గాంభీర్యంగా కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేస్తూ ప్రశ్నించాడు
” సర్ అది నాకు కూడా తెలియదు అది మేడమ్ గారి వీలునామా ప్రకారం ఇలానే ఉంది సార్ అందులో ఏది అయితే ఉందో అదే నేను మీకు చెప్తున్నాను !!! ” అన్నాడు అతను మరి కాస్త భయంగా
” మరి దాని పేరు మీద నుంచి నా పేరు మీదికి రావాలి అంటే ఏదైనా మార్గం ఉందా ?? ” ప్రశ్నించాడు రన్వీర్
” ఉంది సార్ ఆమెని మీరు పెళ్లి చేసుకుంటే 50% ఆస్తి నీ పేరు మీదకి షిఫ్ట్ అవుతుంది !!!! ” అన్నారు అతను వనికే స్వరంతో
” వాట్ నానమ్మ చచ్చిపోయి బ్రతికి పోయావు లేదంటే నేనే చంపేసే వాడిని నిన్ను నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు అంటే ఇలా లాక్ చేసావా చెప్తా చెప్తా నీ పని నీకు మాయ మాటలు చెప్పి ఆస్తి మొత్తాన్ని దాని పేరు మీదకి మార్చుకున్న ఆ మైధిలి ఇద్దరి పని చెప్తా !!!! ” అంటూ తన పిఏ ని పిలిచి
” ఎవరో మైధిలి అంట గంటలో ఏంటి గంటలో దాని ఫుల్ డీటెయిల్స్ నాకు తెలియాలి అమ్మ బాబు ; అన్న తమ్ముడు ; అక్క చెల్లి ; పని చేస్తుందా లేదా ఇంట్లో ఉంటుందా ఇలా ప్రతి చిన్న విషయం తో సహా నాకు కావాలి గంటకి ఒక్క నిమిషం దాటినా కూడా నిన్ను నా చేతుల్లో నుంచి ఆ భగవంతుడు కూడా కాపాడలేడు !!!! ” వార్నింగ్ టోన్ లో చెప్పాడు రన్వీర్
” ఓకే సార్ అలాగే సార్ !!! ” అంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు పిఏ
############
” అక్క అక్క ఈరోజు సండే కదా ప్రతి సండే ఆఫ్టర్నూన్ నుంచి నువ్వు కూచిపూడి మాకు నేర్పిస్తావు కదా ఈరోజు ఎందుకు ఇంత డల్ గా ఉన్నావ్ రా మాకు నేర్పించు !!!! ” అంటూ మైధిలి దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని గింతుతూ ఉంది ఒక పదేళ్ల పాప
” మను ఈరోజు అస్సలు మూడ్ లేదురా ప్లీజ్ ఈరోజుకి వదిలేస్తారా అక్కని ?? ” అనునయంగా పాప తల నిమురుతూ అడిగింది మైధిలి
” ఏమైంది అక్క ఎవరైనా ఏమైనా అన్నారా ?? ” అడిగింది ఆ పాప
” నన్నెవరూ ఏమంటారు మను నాకే ఎందుకో ఏదోలా ఉందిరా నువ్వు బయటికి వెళ్లి కృష్ణ వాళ్లతో ఆడుకో సరేనా ??? ” అంటూ పాప బుగ్గ మీద ముద్దు పెట్టి పాపని బయటకి పంపించేసింది
” ఎందుకు నాకిలా ఉంది ఏదో పెద్ద మార్పు జరగబోతోంది అనిపిస్తుంది అసలేంటది లేదు గుడికి వెళ్తే కానీ సెట్ అవ్వదు !!!! ” అనుకుంటూ ఫ్రెష్ అయ్యి లంగా వోని కట్టుకొని గుడికి స్టార్ట్ అయింది
@@@@@@@@@@@@@@@@@@@
————–continues……….
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
నెక్స్ట్ ఎపిసోడ్
గుడిలో దేవుడి దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న గట్టుమీద కూర్చొని పంతులుగారు ఇచ్చిన ప్రసాదం తింటూ ఉంది మైధిలి
అప్పుడే అక్కడికి వచ్చిన రన్వీర్ మైధిలి ని చూసి
ఇన్నాళ్లు ఇంత అందాన్ని నా ఆఫీస్ లోనే పెట్టుకొని చూడలేదా సరే ముందు మంచిగా మాట్లాడి ట్రై చేద్దాం లేదంటే అప్పుడు చూస్తాను ఏం చేయాలో క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి మైధిలి దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుని తన నడుము చుట్టూ చేతులు వేసి తనని ఇంకా దగ్గరికి లాక్కున్నాడు
స్టోరీ చదివేసి వెళ్ళిపోకుండా కొంచెం వెయిటింగ్ అలాగే ఒక చిన్న కామెంట్ తో పాటు నన్ను ఫాలో అయిపోయి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను
Swipe left/right or tap the sides to turn pages