ప్రేమలో పడితే -26
వాళ్ళిద్దరినీ కలిసి మాట్లాడి ఆ తర్వాత చైతన్య ఇంటికి వచ్చి శ్రీహరి గారితో కాసేపు మాట్లాడి ముంబై వెళ్ళిపోయాడు.
తర్వాత రోజు అందరికంటే ముందుగా మహాలక్ష్మి ఆఫీస్ కి వచ్చి తన వర్క్ ప్లేస్లో కూర్చుంది. తన బ్రెయిన్ లో నుంచి ఇంకా ఆ ఫోటో పోలేదు. తను ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుంది. కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు.
ఆ ఫోటో గురించి ఒక క్లారిటీ కూడా తనకి రాలేదు ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు. ఎవరిని అడిగితే తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చాలాసేపు ఆలోచించి గోవర్ధన్ గారు ఎస్ గోవర్ధన్ గారిని అడిగితే కచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
30 సంవత్సరాలకే పైగా ఇదే కంపెనీలో పీఏగా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అనే చెప్పారు. ఈ కంపెనీ పెట్టే 49 సంవత్సరాలు దాటింది అందులో 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటే కచ్చితంగా నేను చూసిన ఫోటో గురించి గోవర్ధన గారికి తెలిసే ఉంటుంది.
ఆయన్ని అడిగితే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అనుకొని వెంటనే ఆ క్యాబిన్లో నుంచి బయటికి వచ్చింది,
తను ఆలోచన నుంచి బయటికి వచ్చి సమయానికి టైం 9 దాటింది అప్పటికే ఆఫీసులోకి ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు.