ప్రేమలో పడితే -27
అతడు చైర్ లో కూర్చున్న మరుక్షణం సార్ అంటూ అతని ముందు ఒక పేపర్ పెట్టింది.
“నువ్వు నాకు షెడ్యూల్ చెప్పాలి నేను చదువుకోవటం కాదు, పది రోజులుగా వర్క్ చేస్తున్నావ్, ఇంకా తెలియలేదా..?” అని సీరియస్ గా అన్నాడు శ్రీరామ్.
“ఇది మీ షెడ్యూల్ పేపర్ కాదు నా రేసిగ్నేషన్ లెటర్”అని సీరియస్ గా చెప్పింది మహాలక్ష్మి.
రిజిగ్నేషన్ లెటర్ అని ఆ పేపర్ ని చేతిలో పట్టుకొని ఊపుతూ “నువ్వు రిజిగ్నేషన్ చేస్తే కండిషన్స్ ఏంటో గుర్తున్నాయి కదా” అని ఆమె డబ్బులు కట్టలేదు అన్న ఉద్దేశంతో ఆమెను తక్కువ చేస్తూనే అడిగాడు శ్రీరామ్..
“గుర్తుంది సార్, కోటి రూపాయలు పెనాల్టీ కట్టాలి అంతే కదా, రేపు ఉదయాన్నే నేను మీకు ఆ కోటి రూపాయలు తీసుకొని వచ్చి ఇస్తాను, కానీ మీ కింద మాత్రం నేను పిఏగా వర్క్ చేయను” అని సీరియస్గా అన్నది.