బావ మరదలు – 1
అందమైన పల్లెటూరు. చుట్టు పచ్చని చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం.
ఆ ఊరికి పెద్ద సూర్య నారాయణ గారు ఆయన చెప్పిందే వేదం అక్కడి ప్రజలకు తూచా తప్పకుండ పాటించేవారు. భార్య రాగిణి, కొడుకు విక్రమ్, కూతురు సంధ్యా. వాళ్ళ నాన్న అంటే గౌరవం, ప్రేమ.
అదే ఊరిలో సూర్య నారాయణ గారి చెల్లెలు సుభద్ర కూడా ఉన్నారు. చెల్లెలు అంటే అమితమైన ప్రేమ. సుభద్ర గారి భర్త రవి శంకర్ గారు. వీళ్లకి కొడుకు, కూతురు. కొడుకు పేరు వికాస్, కూతురు పేరు మధుమిత.
ఇరు కుటుంబాలు చాలా బాగా ఉండేవారు. పిల్లలు కూడా చాలా చక్కగా ఉండేవారు. ఒకే ఊరిలో ఉండడం వల్ల రాకపోకలు ఉండేవి.
విక్రమ్, వికాస్ ఐదవ తరగతి ఇద్దరు మంచి ఫెండ్స్ ఒకరంటే ఒకరికి అభిమానం కలిగి ఉండేవారు. ఒకే ఏజ్ నెలలు తేడా ఉంటుంది. వికాస్ పెద్ద వాడు.
సంధ్య మూడవ తరగతి చదువుతున్నది మన మధుమిత ఒకటవ తరగతి చదువుతున్నారు. అందరూ ఒకే కాన్వెంట్.
మధుమిత గారాల పట్టి రెండు కుటుంబాలకు అల్లరి పిల్ల.
రోజులు గడుస్తున్నాయి. పిల్లలు పెరుగుతున్నారు. మధుమిత మూడవ తరగతి కి వచ్చింది.
నలుగురు చక్కగా చదువుతున్నారు. అలా వాళ్ళు పెరిగేకొద్దీ ఒకరంటే ఒకరికి ఇష్టము పెరిగింది కానీ ఎవరు బయటికి చెప్పుకోలేదు.
ఇద్దరు ఇంటిలో సంవత్సరము మార్పులో ఫంక్షన్ లు జరిగాయి.
మధ్య లో ఎన్నో అలకలు,బుజ్జగింపులు.
వికాస్, విక్రమ్ 10 వ తరగతి కి వచ్చారు.
వికాస్ , విక్రమ్ బాగా చదువుతున్నారు.
ఒక రోజు ఇద్దరు విక్రమ్ వాళ్ళ టెరస్ మీద చదువుతున్నారు.
వికాస్:- రేయ్, విక్రమ్ ఎక్సామ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నావ మనకి టైం చాలా తక్కువగా ఉంది.
విక్రమ్:- అరే బాబు ఇప్పటికీ ఒక వంద సార్లు అయిన చెప్పి ఉంటావు రా నువ్వు నాకు, చదువుతున్న రా నాయన చదవక పోతే నువ్వు నన్ను చంపేయవు.
వికాస్:- అదేంటి రా అలా అంటావు . నేను నీ మంచి కోసమేగదా చెప్పేది.
విక్రమ్:- రేయ్, ఇంక ఒక మాట వినపడిందో అయిపోతావు నా చేతిలో.
ఇద్దరు చదువుతున్నారు. ఇంతలో
సంధ్య, మధు వస్తారు. వాళ్ళ అన్నయల పక్కన కూర్చుంటారు.
సంధ్య:- ఏంటి బాగా కష్టపడి చదువుతున్నారు గా ఇద్దరు అని వారితో అంటుంది.
మధు:- అబ్బో, వీళ్లు నిజంగా చదువుతున్నారు అనుకుంటున్నావ అంత లేదు.
విక్రమ్:- తల మీద ఒకటి వేసాడు.
మధు:- ఆ.. నా తల మీద ఎందుకురా కొట్టావు
రాక్షసుడ.
విక్రమ్:- ఏంటి రా న ఒకటి ఇచ్చానంటే.
వికాస్:- అరే ఆపండి రా ఇద్దరు ఎప్పుడు చూసిన పిల్లి, ఎలుకల కొట్టుకుంటూనే ఉంటారు. అయిన మీరెందుకు వచ్చారు కిందకి వెళ్లండి .
మధు:- అన్నయ..
వికాస్:- వెళ్లండి…
సంధ్య:- హే, మధు పదవే వెళ్లి పోదాం .
మధు :- సరే అని వెళ్లి పోతుంటే విక్రమ్ నవ్వుతూ కనిపిస్తాడు. రావణ్ గాడు అనుకొని కిందకి వెళ్లి పోతారు.
సంధ్య:- ఎందుకే అలా మా అన్నయ తో కొట్టించుకుంటావు.
మధు:- మాకు సరదా మరి మీ అన్నయ తో కొట్టించుకోవడం, ఏదో ఒక రోజు దొరకపోడు.
సంధ్య:- నవ్వుతుంది….. బాగా చెప్పావు అని….
మధు:- నీకు ఎందుకే అంత నవ్వు వస్తుంది. ఇద్దరు అయిపోతారు నా చేతిలో.
సంధ్య వాళ్ళ అమ్మ గారు వస్తారు.
మధు:- అత్త , నీ కొడుకు నన్ను కొట్టాడు.
రాగిణి గారు:- ఎందుకే, నువ్వు ఏమి అనకుండా వాడు ఎందుకు కొడతాడు చెప్పు.
మధు:- నాదే తప్పు అంటున్నారు కదా సరే వాడి పని నేను మావయ్య కి చెపుతాను.
రాగిణి గారు:- పోనిలే నేను వాడిని తిడతాలే, ఈ విషయాన్ని వదిలేసై బంగారు అంటుంది.
మధు:- సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటునాను , లేదంటే నీ కొడుకు పని అయిపోయేది.
రాగిణి, సంధ్య నవ్వుతారు వాళ్ళు కి ఎప్పుడు ఉండేదే అని.
మధు :- ఇంటికి వెళ్లనా ఇంక,
సంధ్య:- ఉండవే అప్పుడే ఎందుకు. పదా నా రూమ్ కి వెళ్లి మాటలాడుకుందాం……….
మధు:- సరే పదా………
సంధ్య, మధు ఏవో మాటలాడుకుంటారు……..
విక్రమ్, వికాస్ ఇద్దరు కిందకి వస్తారు…………….
విక్రమ్:- ఏరి, ఈ కోతులు ఇళ్లు ఇంత సైలెంట్ గా ఉంది అని సంధ్య గది వైపు వెళ్లేటప్పుడు వాళ్ళ అమ్మ పిలుస్తారు…….
రాగిణి గారు:- అరే, నాన్న ఒకసారి రా…….
విక్రమ్:- రేయ్ నువ్వు చూడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో…..
వికాస్:- సరే అని సంధ్య గది వైపు వెళతాడు……
మధు చక్కగా పడుకుని పోతుంది……..
సంధ్య:- ఏదో చదువుతూ ఉంటుంది…….
వికాస్:- సంధ్య…….
సంధ్య:- ఆ ! బావ .
వికాస్:- మధు పడుకుందా సరే నువ్వు ఏం చేస్తున్నావు అని తన దగ్గర కు వస్తాడు…
సంధ్య:- ఏం లేదు బావ చదువుకుంటున్న అంతే….
వికాస్:- సరే , వెళ్లి వస్తా….
సంధ్య:- ఒకే, బావ…..
వాళ్ళ అమ్మ పిలుస్తారు………..
సంధ్య:- ఆ అమ్మ చెప్పు……
రాగిణి గారు:- ఒకసారి ఇలారా ….
సంధ్య:- వస్తున్న…
రాగిణి గారు:- మధు ఏం చేస్తుంది….
సంధ్య:- అది చక్కగా నిద్ర పోతుంది అమ్మ….
రాగిణి గారు:- అవునా, సరే నువ్వు అత్త వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ బాక్స్ ఇచ్చి రా, సరేనా……
సంధ్య:- సరే, అమ్మ…..
రాగిణి గారు:- బావ ఉన్నాడు గా తనతో వెళ్లు….
సంధ్య:- సరే సరే…..
ఇద్దరు కలిసి మధు వాళ్ళ ఇంటికి వెళతారు….
సంధ్య:- బావ, తర్వాత ఏం చేదామని టెన్త్ కంప్లీట్ అవుతుంది కదా……
వికాస్:- ఇంటర్ లో జాయిన్ అవుదామని తర్వాత ఎంసెట్ రాయాలని ఉంది……
సంధ్య:- సూపర్ బావ…….
వికాస్:- నవ్వుతాడు…..
ఇంతలో వికాస్ వాళ్ళ ఇళ్లు వస్తుంది……
సంధ్య:- అత్త, అత్త…..
సుభద్ర గారు:- అబ్బో, నా కోడలికి చాలా రోజుల తర్వాత కనపడింది గా ఈ అత్త…
సంధ్య:- అదేంటి, అత్త నీ దగ్గరకు రాకుండ నేనుంటాన చెప్పు….
సుభద్ర గారు:- అవునా, మరి ఇన్ని రోజులు రాలేదు మరి….
సంధ్య:- కుదరలేదు అత్త….
ప్లిస్, అత్త ఈ ఒక సారి వదిలే…….
వీళ్ల ఇద్దరి ముచ్చటలను చూసి నవ్వుతాడు వికాస్….
సుభద్ర గారు:- నీకెందుకు రా నవ్వు వస్తుంది…
వికాస్:- ఏం లేదు లే….
కాసేపు మాటలాడుకుంటారు.
ఇక్కడ మన మధు పాప లోకాన్ని మరిచిపోయి మరి నిద్ర కొనసాగిస్తుంది…..
విక్రమ్:- ఏంటి ఇది ఇంత సేపు పడుకునే ఉంది….
అని సంధ్య రూమ్ కి వస్తాడు.
చక్కగా టెడ్డి ని పట్టుకొని నిద్ర పోతుంది…..
ఎంత బాగా నిద్ర పోతున్నావే అనుకొని తన బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలి అనిపించి, పెట్టే టైంలో
సడన్ గా వాళ్ళ అమ్మ పిలుస్తారు……
విక్రమ్:- అబ్బా, వస్తున్న…..
రాగిణి గారు:- దానిని లేపరా , చాలా సేపు అయింది….
విక్రమ్:- అలాగే అమ్మ…..
విక్రమ్:- హేయ్,రాక్షసి లేవవా ఎంత సేపు పడుకుంటావు…
మధు:- అబ్బా, ఏంటి నీ గోల….
విక్రమ్:- ఏంటి గోల నా, లేదు లేగు ……
మధు:- నేను లేవను,కాసేపు పడుకుంటా….
విక్రమ్:- లేవవే,అమ్మ పిలుస్తుంది……
మధు:- సరేలే , అని లేచి కూర్చుంటుంది……
విక్రమ్:- వెళ్లి ఆ ఫేస్ వాష్ చేసుకో, ఆ మెాహం చూడు…..
మధు:- తమరి మెాహం కంటే బెటరే లే…..
విక్రమ్:- ఏంటే ….
ఈలోపు,
రాగిణి గారు:- మళ్లీ మెుదలు పెట్టార….
మధు:- నేను కాదు అత్త బావే నాతో కావలని గొడవ పెట్టుకున్నాడు…..
విక్రమ్:- కాదు అమ్మ…
రాగిణి గారు:- మీ ఇద్దరు ఎప్పుడు అంతే లే గాని, మధు లే .
మధు:- వస్తున్న అత్త, వెళుతూ విక్రమ్ ని వెక్కిరించి వెళుతుంది…..
విక్రమ్:- కత్తిరించనా..
మధు:- దెబ్బ కి సైలెంట్ అయిపోయింది….
ఇంకా ఉంది……
Swipe left/right or tap the sides to turn pages