విజయవాడలో మైరా తల్లిదండ్రులు రామకృష్ణ గారు, పద్మ గారు తమ కూతురు, అల్లుడు ఇషాంత్ తిరిగి వెళ్తున్నందుకు ఎంతో బాధపడ్డారు.
పద్మ గారు తమ గారాల పట్టి మైరా కోసం ఇష్టమైన వంటకాలు, కొత్త బట్టలు, పట్టుచీరలు పెట్టి ఎంతో ఆత్మీయంగా సాగనంపారు.
రాముకృష్ణ గారు ఇషాంత్ భుజంపై చేయి వేసి, మైరాను నీకు అప్పగించాను ఇషాంత్, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా చూసుకో అని చెప్పడంతో ఇషాంత్ తల వంచి నమస్కరించాడు.
ఇద్దరూ కలిసి ఇషాంత్ పర్సనల్ ఫ్లైట్ ఎక్కారు. ఒక అరగంట ప్రయాణం తర్వాత విమానం హైదరాబాద్ లోని ఇషాంత్ ప్రైవేట్ ఎయిర్ స్ట్రిప్‌లో ల్యాండ్ అయ్యింది.
అప్పటికే అక్కడ ఇషాంత్ పెదనాన్న రాఘవేంద్ర భూపతి రాజు గారు, పెద్దమ్మ దేవిక గారు మరియు ఇషాంత్ తల్లి సుమిత్ర దేవి గారు ఎంతో ఆత్రుతగా
ఎదురుచూస్తున్నారు.
విమానం దిగగానే మైరాకు అత్తవారింటి కోడలిగా ఘనస్వాగతం లభించింది. సుమిత్ర దేవి గారు మైరాను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దుపెట్టుకుని లోపలికి ఆహ్వానించారు.