చేస్తాను అండి … చెప్పండి ఏం చెయ్యాలి..? అని బుద్దిగా తల ఊపింది జాను .
ఒకసారి బావ అని పిలవ్వే ” అని అంటాడు ఆశగా జాను నోటి నుంచి ఆ మాట వినడానికి ఎగ్సేట్ అవుతు.
” మీ పేరు బావ నా అండి ..? అదేం పేరు ..? అలాంటి పేరు ఉంటుందా అసలు ..? ” అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగ ఫేస్ పెట్టుకొని అడిగింది జాను పాప.
” నా తింగరి బుచ్చి … ఇలా రా ” అంటూ జాను నీ అతని ఒడిలో కూర్చోబెట్టుకొని ..జాను నడుము చుట్టూ చేతులు బిగించి , తన తల ఢి కొడుతూ
” నా పేరు కాదే అది , ఒకసారి నువ్వు అలా ప్రేమగా పిలువు .. వినాలి అని ఉంది నీ నోటితో ” కళ్ళలో చిన్నపాటి తడితో అడిగాడు రాఖి.